బిగ్‌బాస్‌కు వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి
అత్యంత పాపులరిటీ సంపాదించుకున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ (Bigg Boss). ఈ గేమ్ షో ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో పేరు వినగానే ప్రేక్షకుల కళ్ల ముందు గ్రాండ్ సెటప్, మైండ్ గేమ్స్, టాస్కులు, రోజువారీ డిస్కషన్స్, గొడవలు, డ్రామా అన్నీ ఒక్కసారిగా గుర్తుకువస్తాయి. ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ లో సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది. ఇలాంటి గేమ్ షోలో పాల్గొనాలని, బీబీ హౌస్‌లో అడుగుపెట్టాలని ఎంతో మంది కలలు కంటున్నారు. అందుకోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి బిగ్‌బాస్‌పై ఓ మాజీ కంటెస్టెంట్ షాకింగ్ చేసింది. బిగ్‌బాస్‌కు వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మాజీ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకిలా కామెంట్స్ చేసింది?
ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. యాంకర్ విష్ణు ప్రియ. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత యాంకర్‌గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ సహా పలు షోల్లో కనిపిస్తూ అందంతో, స్టయిల్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. బ్యూటీ తన అందంతో చాలా మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టింది. అక్కడ కూడా మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఇటీవలగా ఆమె స్క్రీన్‌పై కనిపించడం ఆగిపోవడంతో, విష్ణుప్రియా ఎందుకు షోల నుంచి దూరంగా ఉంటోంది అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

యాంకర్ విష్ణు ప్రియా ఇటీవల బిగ్ టీవీ 'కిస్సిక్ టాక్స్'లో పాల్గొన్నారు. ఈ సమయంలో బిగ్‌బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రియాలిటీ షోను తిట్టాలనే భావన కూడా వచ్చిందని ఆమె మొదటిసారిగా బయటపెట్టింది. అందులో బాండింగ్స్‌పై పెదవి విప్పింది. బిగ్‌బాస్ 8లోకి విష్ణు ప్రియ కంటెస్టెంట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో పృథ్వీ శెట్టి లవ్ ట్రాక్‌తో మెప్పించింది. అక్కడ తనదైన ఆటతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే మరోసారి బిగ్‌బాస్ 9లో పిలిస్తే వెళతావా? అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు.
ఆ కోరికలు తీర్చుకోవడానికే సహజీవనం.. అందుకే పెళ్లికి దూరం..96
'బిగ్‌బాస్ వల్ల నేను కొత్తగా ఏం నేర్చుకోలేదు. హౌజ్‌లో ఉన్న రోజుల్లోనే ఎందుకు వచ్చాను? అనిపించింది. మళ్లీ నా జీవితంలో ఆ షోకి వెళ్లను. వెళ్లిన కొన్ని రోజులకే ఈ షోకి ఎందుకు వచ్చానురా అని బాధపడ్డాను. బిగ్ బాస్ కి వెళ్లినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలని అనిపించింది. నన్ను నేను తిట్టుకోని రోజు లేదు. ఇప్పటికే ఈ షోకి వెళ్లినందుకు చెప్పుతో కొట్టుకోవాలేదని బాధపడుతున్నాను'అని స్పష్టం చేశారు.
విష్ణుప్రియ ఇంకా మాట్లాడుతూ.. హౌజ్‌లో సరైన నిద్ర, తిండి, రిలాక్సేషన్ ఏమీ లేవని, టీ, కాఫీ కూడా ఇష్టం వచ్చినప్పుడు తాగే పరిస్థితి లేదు.బిగ్‌బాస్ హౌజ్‌లో నరకం అనుభవించాను. బయటికి వచ్చిన తర్వాత షోను తిట్టాలని కూడా అనిపించింది" అని ఆమె చెప్పుకొచ్చారు.కానీ... ప్రేక్షకుల ప్రేమ వల్ల కష్టానికి విలువ తెలిసింది. అయితే బిగ్‌బాస్‌లో చేసిన కష్టానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమ, ఫేమ్ కారణంగా ఆ బాధ కొంత తగ్గిందని చెప్పారు. అలాగే షో వల్ల తనకు పృథ్వీ శెట్టి, సీత, నిఖిల్, యష్మి, ప్రేరణ, నైనిక వంటి మంచి ఫ్రెండ్స్ దొరికారని చెబుతున్నారు. ప్రస్తుతం విష్ణు ప్రియ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











