Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షోలో కొత్త లవ్ స్టోరీ.. బాత్రూంలో అలా బెడ్‌రూంలో ఇలా!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకుని.. దాదాపు ఎనిమిదేళ్లుగా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అందుకే నిర్వహకులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దాన్ని వినూత్నంగా నడుపుతున్నారు. ఇక, ఇందులో కొన్ని ప్రేమకథలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో లవ్ ట్రాక్ కూడా తాజాగా బయటపడింది. ఆ సంగతులేంటో మీరు కూడా చూసేయండి మరి!

కొత్త సీజన్‌ మరింత కొత్తగా
తెలుగులో ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో.. ఎనిమిదో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఇటీవలే మొదలు పెట్టారు. ఇందులో గతంలో కంటే భిన్నంగా కొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా సొంతం అవుతోంది. అలా ఇంకా ఈ సీజన్‌పై అందరిలో ఆసక్తిని పెంచుతున్నారు.

Vishnupriya Bhimeneni Shows Huge Love on Prithviraj Shetty In Bigg Boss Telugu 8 Show

14 మంది.. ఆమె హైలైట్

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో విష్ణుప్రియ భీమనేని స్పెషల్ అట్రాక్షన్ అయింది. యాంకర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ చిన్నది.. ఎన్నో షోలను హోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్‌లోకి వచ్చింది. ఇందులో ఆమె ఆరంభంలోనే తనదైన రీతిలో హైలైట్ అవుతూ సాగిపోతోంది.

ఆటతో పాటు గొడవలతో
ఎనిమిదో సీజన్‌లో విష్ణుప్రియ భీమనేని తనదైన మార్కును చూపిస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడు మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అదే సమయంలో తరచూ గొడవలు పెట్టుకుంటూ రచ్చ లేపుతోంది. గత వారంలో విష్ణుప్రియ ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని చూపించలేక ఇబ్బందులు పడింది.

Vishnupriya Bhimeneni Shows Huge Love on Prithviraj Shetty In Bigg Boss Telugu 8 Show

అతడిపై బాగా ఫోకస్‌తో

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే విష్ణుప్రియ ఫోకస్ అవుతోంది. ఆమె రూపం, మాట తీరుకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈమె ఆరంభం నుంచే పృథ్వీరాజ్ శెట్టితో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. తరచూ అతడిపై ప్రేమను వ్యక్త పరుస్తోంది.

అందంగా రెడీ చేసి మరీ
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో పృథ్వీరాజ్.. సోనియా ఆకులతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. అలాంటిది తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అతడు విష్ణుప్రియతో కలిసి రచ్చ లేపాడు. దీంతో ఆమె పృథ్వీని చక్కగా రెడీ చేసి బాత్రూంలో, బెడ్‌రూంలో సందడి చేసింది. అప్పుడు వాళ్లను చూసిన సోనియా తెగ కుళ్లుకుంది. మొత్తానికి బిగ్ బాస్ షోలో కొత్త లవ్ ట్రాక్ మొదలైనట్లు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X