పృథ్వీని ముద్దుల్లో ముంచెత్తిన విష్ణుప్రియ.. ప్లేస్ మారినా.. పులిహోర మారలేదుగా
గతేడాది ముగిసిన బిగ్‌బాస్ తెలుగు 8లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌లో పలువురి మధ్య ప్రేమాయణం సాగింది. వీరిలో పృథ్వీరాజ్ శెట్టి - విష్ణుప్రియల జోడి చివరి వరకు వినోదాన్ని అందించింది. సీజన్ విజేతగా నిలుస్తుందనుకున్న విష్ణుప్రియ ప్రేమలో మాయలో పడి ఫైనల్‌కు ముందు హౌస్‌ను వీడింది. పృథ్వీ కూడా మధ్యలోనే వెళ్లిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఆయనను కూడా బిగ్‌బాస్ కంటిన్యూ చేసి కొన్నాళ్లు కథ నడిపించారు. పృథ్వీ - విష్ణుల మధ్య ఈ ప్రేమకథ బిగ్‌బాస్ వరకే పరిమితం అనుకున్నారంతా. కానీ ఎక్కడ పృథ్వీ కనిపిస్తే అక్కడ పులిహోర కలిపిస్తోంది విష్ణుప్రియ.
బిగ్‌బాస్‌లో పృథ్వీ వెంటపడ్డ విష్ణుప్రియ
బిగ్‌బాస్‌లో లవ్ ట్రాకులు కామన్ అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయితే ఎప్పుడూ లేనిది గత సీజన్‌లో మాత్రం విష్ణుప్రియ నేను నిన్ను ప్రేమిస్తున్నాన్రా అంటూ వెంటపడుతున్నా పృథ్వీ పట్టించుకోలేదు. హౌస్‌లో నీకు అన్ని చేసి పెడుతున్నాను కదా నా మీద నీకు ప్రేమ కలగడం లేదా అని బతిమలాడేది విష్ణు. అయినా మనోడు ఓ చిన్న నవ్వు నవ్వి మెలికలు తిరుగుతూ వెళ్లిపోయేవాడు. కానీ విష్ణు మాత్రం అతనిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. పృథ్వీని గేమ్ నుంచి డైవర్ట్ చేయడానికి విష్ణుప్రియ ఇలా చేస్తోందని అంతా అనుకున్నారు. కానీ నిజంగానే అతనితో క్లోజ్‌గా ఉండేది విష్ణు.

పృథ్వీ తల్లితో క్లోజ్‌గా
అందరి పేరెంట్స్ హౌస్‌లోకి వస్తున్న టైంలో పృథ్వీ తల్లి సత్యభామ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ వచ్చిన రోజున విష్ణు తెగ మర్యాదలు చేసింది. ఆవిడ చేతులతో గోరు ముద్దలు తిని, ఆశీర్వాదం తీసుకుంది. హౌస్‌లో నాకు అందరికంటే విష్ణుప్రియ అంటేనే ఇష్టమని సత్యభామ చెప్పడంతో ఈ యాంకరమ్మ మురిసిపోయింది. ఇంకేముంది నన్ను కోడలిగా అంగీకరించింది అని మైండ్‌లో ఫిక్సయిపోయింది. కట్ చేస్తే.. బిగ్‌బాస్ నుంచి విష్ణుప్రియ, పృథ్వీలు కొద్దిరోజుల గ్యాప్‌లో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
ఆ వంట ప్రోగ్రామ్‌లో విష్ణు - పృథ్వీ సందడి
బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక ఆహా ఓటీటీలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అనే షోలో పృథ్వీ - విష్ణుప్రియలు జంటగా కనిపించారు. బిగ్‌బాస్ పాత కంటెస్టెంట్స్, సీరియల్ నటీనటులు, యూట్యూబర్లతో స్టార్ యాంకర్ సుమ కనకాల ఈ షోను నడిపించారు. దీనికి నటుడు, చెఫ్ జీవన్ కుమార్ జడ్జీగా వ్యవహరించారు. ఈ షోలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం విష్ణుని తీసుకున్నారు నిర్వాహకులు. దాదాపు మూడు వారాల పాటు విష్ణు- పృథ్వీల జోడీ అలరించారు. అయితే ఏమైందో ఏమో కానీ ఈ జంట ప్లేస్‌లో ప్రసాద్ బెహరా - విరాజిత జోడీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో విష్ణుప్రియ ఓ స్కామ్‌లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరగడంతో ఆమెను షో నుంచి తప్పించారన్న ప్రచారం కూడా జరిగింది.
కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్‌లో మరోసారి జంటగా
ప్రస్తుతం విష్ణుప్రియ- పృథ్వీరాజ్‌ల జోడీ మరో షోలో సందడి చేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్‌లో వీరిద్దరూ కంటెస్టెంట్స్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. తాజాగా పృథ్వీపై తన ఇష్టాన్ని మరోసారి బయటపెట్టింది విష్ణుప్రియ. ఇటీవల స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో విష్ణుప్రియలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటనీ పృథ్వీని యాంకర్ శ్రీముఖీ అడగ్గా కేరింగ్ అని చెబుతాడు. అది విన్న విష్ణు ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకుని సిగ్గుపడుతుంది. పృథ్వీలో నీకేం ఇష్టమని విష్ణుని అడగ్గా అతని లాయల్టీ అని చెబుతుంది విష్ణుప్రియ. అలాగే ఆమెలో స్టామినా, ఎనర్జీ కూడా నాకు ఇష్టమని పృథ్వీ చెప్పడంతో విష్ణు సంబరాలు చేసుకుంటుంది. సత్యభామ గారు ఇంత అందమైన అబ్బాయికి జన్మనిచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ ముద్దుల్లో ముంచెత్తుతుంది. దీంతో అమ్మాయిలు, అబ్బాయిలు కేకలు పెడుతుంటారు.


Click it and Unblock the Notifications











