Vishnu Priya: వివాదంలో బిగ్‌బాస్ విష్ణుప్రియ.. ఆ పోస్టులతో చిక్కుల్లో ..

Vishnu Priya: బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా విష్ణు ప్రియ భీమినేని (Vishnupriya Bhimeneni)మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆమె, లక్షలాది మంది ప్రేక్షకులను, వేలాది మంది ఫాలోవర్స్ ను సంపాదించకుంది. అయితే.. ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకోవడం టాలీవుడ్, టెలివిజన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇప్పుడు అదే విషయం ఆమెకు సమస్యగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇటీవలి కాలంలో యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ విషయమై విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. అల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (AISF) నాయకులు ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. ముఖ్యంగా, విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అసభ్యకరమైన, అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, సమాజంలో నైతిక విలువలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Vishnupriya Controversy Complaint Filed Over Instagram Content Probe Begins

ఫిర్యాదులో మరో ముఖ్య అంశం సబ్‌స్క్రిప్షన్ మోడల్. విష్ణుప్రియ తన కొన్ని ప్రత్యేక కంటెంట్‌ను చూడాలంటే డబ్బులు చెల్లించాలనే విధంగా ప్రచారం చేస్తున్నారని AISF నాయకులు ఆరోపించారు. ఈ విధానం కేవలం పాపులారిటీ కోసం కాకుండా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్టు వారు పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలను ఇలాంటి విధంగా ఉపయోగించడం సరైంది కాదని, ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్‌గా ఉన్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని వారు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమికంగా విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసును పరిశీలించి, అవసరమైతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్ ప్రచారం చట్టపరంగా నేరమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇక విష్ణుప్రియ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె మొదట "పోవే పోరా" వంటి షోలతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన చురుకైన యాంకరింగ్ స్టైల్‌తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తర్వాత రియాలిటీ షోలలో, ముఖ్యంగా బిగ్‌బాస్ వంటి కార్యక్రమాల్లో పాల్గొని మరింత పాపులారిటీ సాధించింది. అయితే ఇటీవల కాలంలో ఆమె తన ఇమేజ్‌ను మార్చుకుంటూ గ్లామర్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న బోల్డ్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు ఇప్పటికే పలు సందర్భాల్లో ట్రోలింగ్‌కు గురయ్యాయి. అయితే వాటిపై విష్ణుప్రియ గతంలో స్పందిస్తూ "నా శరీరం.. నా ఇష్టం" అనే ధోరణిని వ్యక్తం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పిన ఆమె, విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు విషయం పోలీసు కేసు స్థాయికి చేరుకోవడంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వివాదంపై విష్ణుప్రియ నుంచి అధికారిక స్పందన రాలేదు. ఆమె ఈ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారు? చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X