Bigg Boss Telugu 8 Voting : మిడ్ వీక్‌లో ఆదిత్య ఔట్.. మెంటలెక్కిస్తోన్న ఓటింగ్, నెక్ట్స్ వికెట్ ఆమెనా?

బిగ్‌బాస్ తెలుగు 8 ఐదో వారం ఎండింగ్‌కి వచ్చేసింది. ఈ వారం మిడ్‌వీక్‌లో ఓ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పినట్లుగానే బిగ్‌బాస్ చేశాడు. ఆదిత్య ఓంను ఇంటికి పంపించేశాడు. 14 మందితో ప్రారంభమైన ఈ సీజన్‌లో బేబక్క , ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఇప్పుడు తాజాగా ఆదిత్య ఓం ఎలిమినేషన్‌తో హౌస్‌లో 9 మంది మిగిలారు . ఐదో వారం నామినేషన్స్ ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్‌‌లో ఆదిత్య ఓం ఎలిమినేట్ కావడంతో.. విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, నబిల్, నిఖిల్ మిగిలారు. దీంతో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీకోసం ..

హౌస్‌లో ఐదో వారం కొత్త చీఫ్ కంటెండర్ కోసం బిగ్‌బాస్ టాస్క్‌లు పెడుతున్న సంగతి తెలిసిందే. బుధవారం నాటి పప్పీ టాస్క్ గురువారం కూడా కొనసాగింది. మేల్ కంటెస్టెంట్స్‌తో సమానంగా చివరి వరకూ పోరాడిన ప్రేరణకు షాక్ తగిలింది. ఈ గేమ్‌లో నబీల్, ప్రేరణ మాత్రమే మిగలగా.. చీఫ్‌ను ఎంపిక చేసే బాధ్యతను హౌస్‌మేట్స్‌కి అప్పగించాడు బిగ్‌బాస్. అందరి ఏకాభిప్రాయంతో నబీల్‌ను చీఫ్ కంటెండర్‌గా సెలెక్ట్ చేశారు. శక్తి టీమ్ నుంచి చీఫ్ కంటెండర్‌గా పృథ్వీ ఇప్పటికే నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో పృథ్వీ- నబీల్ మధ్యలో రాజయ్యేది ఎవరు అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో పృథ్వీ చాలా దూకుడుగా ఉండగా.. నబీల్ కష్టపడి చివరికి విజయం సాధించాడు.

vishnupriyaa bhimeneni and nainika in danger zone in Bigg Boss Telugu 8 here s the details

కొత్త చీఫ్ ఎంపిక గురించి ఇంటి సభ్యులు మాట్లాడుకుంటూ ఉండగా.. బిగ్‌బాస్ అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిపించి మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు టైం అయ్యిందని చెబుతాడు. దీంతో తమలో ఎవరు మిడ్ వీక్ వెళ్లిపోతున్నారోనంటూ హౌస్‌మెట్స్ టెన్షన్‌తో ఉంటారు. ఆదిత్య, నైనిక, విష్ణుప్రియ డేంజర్‌ జోన్‌లో ఉన్నారని చెప్పి.. వీరిలో ఎవరు హౌస్‌లో ఉండాలని అనుకుంటున్నారో తేల్చాలని హౌస్‌మెట్స్‌ చేతుల్లోనే పెట్టాడు. ఎక్కువ మంది ఆదిత్య ఓంనే ఎలిమినేట్ చేయాలని కోరుకోవడంతో ఆయన అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్లిపోయాడు. ఆదిత్య ఎలిమినేట్ అయ్యారని.. నామినేషన్స్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ ఓటింగ్ కొనసాగుతుందని బిగ్‌బాస్ చెప్పాడు.

కాగా.. బిగ్‌బాస్‌లో వరుసపెట్టి ఎలిమినేషన్స్‌ జరగానికి 12 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపడానికేనని ఆడియన్స్ భావిస్తున్నారు. ఆ 12 మంది ఎవరంటూ మీడియాలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. టేస్టీ తేజా, యాంకర్ రవి, మెహబూబ్, రోహిణి, నయని పావని, హరితేజ, అవినాష్, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, గలాటా గీతూ కన్ఫర్మ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 12 మందిని ఒకేసారి హౌస్‌లోకి పంపుతారా లేదంటే వారానికి నలుగురు చొప్పున , మూడు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫినిష్ చేసి లెక్క సరిచేస్తారా అన్నది ఉత్కంఠ నెలకొంది.

vishnupriyaa bhimeneni and nainika in danger zone in Bigg Boss Telugu 8 here s the details

ఇకపోతే.. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన ఐదుగురి ఓటింగ్ పరిశీలిస్తే : నబీల్ 26.08 శాతం ఓటింగ్‌తో ముందంజలో ఉన్నాడు. నిఖిల్ 25.48 శాతం ఓటింగ్‌తో నబీల్‌తో తలపడుతున్నాడని సోషల్ మీడియా టాక్. మణికంఠ 17.34 శాతం ఓట్లతో టాప్ 3లో నిలిచాడు. ఇక యాంకర్ విష్ణుప్రియ (14.03 శాతం) , నైనిక (6.07 శాతం) ఓటింగ్‌తో డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న విష్ణుప్రియ, నైనికలలో ఒకరు ఈవారం ఎలిమినేట్ కానున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి నైనిక హౌస్‌ను వీడుతారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X