Bigg Boss Telugu 8: దిగజారిన లేడీ కంటెస్టెంట్లు.. క్యారెక్టర్ లేని దానా, పతివ్రత అంటూ నీచంగా!
ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు ఇస్తూ.. ప్రేక్షకులకు కావాల్సిన దానికంటే ఎక్కువ మజాను అందిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. హిందీలో ఎప్పుడో మొదలైన ఈ కార్యక్రమం.. తెలుగులోకి మాత్రం ఎనిమిదేళ్ల క్రితమే వచ్చింది. ఎన్నో అనుమానాలతో ప్రారంభం అయినా.. తక్కువ సమయంలోనే సక్సెస్ అయింది. దీంతో ఏడు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దాన్ని మొదలు పెట్టారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో లేడీ కంటెస్టెంట్లు దిగజారిపోయారు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!
భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడు వారాల క్రితమే ప్రారంభం అయింది. అంచనాలకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు ఇందులో కనిపిస్తున్నాయి. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, కొట్లాటలు, వాదనల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతూ సాగుతోంది.

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కొంత మంది వ్యవహార శైలిపై అప్పుడప్పుడూ విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో కొందరు అమ్మాయిలు ప్రవర్తన ఎవరూ ఊహించని విధంగా ఉంటోంది. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ నాగార్జున కూడా వాళ్ల వాళ్ల ముఖం మీదనే విమర్శించారు. ఇదే కారణం చెప్పి చాలా మంది ఈ వారం కొందరు నామినేషన్ కూడా చేసుకున్నారు.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో మూడో వారంలో 'ప్రభావతి 2.O' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో నిఖిల్ క్లాన్, అభయ్ క్లాన్‌లలో ఎవరి దగ్గర ఎక్కువగా గుడ్లు ఉంటే వాళ్లు గెలుస్తారు. దీంతో ఇరు జట్ల సభ్యులు ఎక్కువ గుడ్లను సాధించేందుకు ట్రై చేశారు. ఇందులో భాగంగా కొందరు అమ్మాయిలు ఓ రేంజ్‌లో గొడవలకు దిగారు. ఫలితంగా ఈ టాస్క్ అంతా రంజుగా సాగిపోయింది.
Raakshasi.. Characterless... Pathivratha.. 🙏#BiggBossTelugu8 #Prerana #KirrakSeetha #VishnuPriya pic.twitter.com/QfYpcHr45F
— TeluguBigg (@TeluguBigg) September 19, 2024
'ప్రభావతి 2.O' టాస్కులో భాగంగా గుడ్లను తీసుకునే, దాచుకునే క్రమంలో ప్రేరణను కిర్రాక్ సీత, విష్ణుప్రియ భీమనేని టార్గెట్ చేశారు. వాళ్లిద్దరూ కలిసి ఆమెను చైర్‌పై కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ప్రేరణ.. సీతపై ఎటాక్ చేస్తూ కొట్టేసింది. అప్పుడు విష్ణుప్రియ కూడా ఆమెను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయడంతో రాక్షసి అంటూ తిట్లదండకం అందుకుంది.
ప్రేరణ తనను రాక్షసి అని అనడంతో విష్ణుప్రియ కూడా ఆమెను నువ్వే రాక్షసివే అనేసింది. దీనికామె 'క్యారెక్టర్‌లెస్ (క్యారెక్టర్ లేని అమ్మాయి) నువ్వు' అని నోరు జారింది. దీంతో విష్ణుప్రియ 'నేను క్యారెక్టర్‌లెస్ అయితే నువ్వు పతివ్రతవా' అని బదులిచ్చింది. ఇలా ఇద్దరూ చాలాసేపు గొడవ పడ్డారు. ఇదంతా చూసిన ప్రేక్షకులు చిరాకు పడే పరిస్థితి కనిపించింది.


Click it and Unblock the Notifications











