Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లో బూతు వివాదం.. ఆమె పుణ్యస్త్రీ.. మేము ఆ టైప్ అంటూ!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే అసాధారణ రెస్పాన్స్‌తో గతంలో దేనికీ సాధ్యం కాని విధంగా సూపర్ సక్సెస్ అయింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. మన ప్రేక్షకులు ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. తద్వారా సూపర్ డూపర్ హిట్ షోగా మార్చారు. అందుకే ఇది ఏకంగా సీజన్ల మీద సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. వాటిలో దేనికదే రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో బూతు వివాదం గొడవకు కారణం అయింది. ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!
వైభవంగా మొదలైన సీజన్
తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు ప్రారంభం అయినా దానికి అదిరిపోయే స్పందన దక్కుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రీమియర్ ఎపిసోడ్ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అలాగే, గత ఆదివారం సాయంత్రం ఎనిమిదో సీజన్ కూడా అంచనాలకు తగ్గట్లుగానే మొదలైంది. ఇందులో ఎన్నో ఊహించని విషయాలు చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.

ఇప్పుడు పద్నాలుగు మందే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఎన్నో అంచనాలతో వచ్చింది. ఇందులోకి యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, ప్రేరణ కంభం, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు సెలెబ్రిటీలు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఆరంభం నుంచే గొడవలతో
సాధారణంగా బిగ్ బాస్ షో అంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అందులోనూ ఏడు సీజన్లను నేషనల్ రేంజ్‌లో హిట్లుగా మార్చుకున్న దీనికి అభిమానులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఎనిమిదో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఇందులో ఆరంభం నుంచే గొడవలు కూడా బాగానే కనిపిస్తున్నాయి.

వాళ్లిద్దరూ కొంచెం క్లోజ్‌గానే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు వచ్చారు. వారిలో కొందరే హైలైట్ అయ్యారు. అందులో నిఖిల్, సోనియా ఆకులు పేర్లు ముందుగా చెప్పుకోవాలి. అంతలా వీళ్లిద్దరూ తమదైన తీరిలో అలరిస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను లాక్కుంటున్నారు. మరీ ముఖ్యంగా గత ఎపిసోడ్‌లలో నిఖిల్, సోనియా బాగా క్లోజ్ అయ్యారు. దీంతో ఎప్పుడూ జంటగానే కనిపిస్తున్నారు.
అడల్ట్ కామెడీనే వద్దంటూ
బిగ్ బాస్ షోలో గొడవలు జరగడానికి ఎప్పుడూ పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అందుకు అనుగుణంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో విష్ణుప్రియ 'మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు. మరి ఇప్పుడు ఎలా ఫ్రెండ్‌షిప్ కుదిరింది' అని సోనియాను ప్రశ్నించింది. దీనికామె 'ఎవరు అడగమన్నా నేను మాత్రం మీ అడల్డ్ (బూతు) కామెడీలో పార్ట్ కాను' అని చెప్పింది.
పుణ్యస్త్రీ అంటూ ఘాటుగా
అడల్డ్ కామెడీ అంటూ కామెంట్ చేసిన సోనియా తర్వాత ఏడ్చింది. దీంతో విష్ణుప్రియ 'ఇదేంటి మీరే అనేసి మీరే ఏడుస్తున్నారు. నాకు ఏడుపు రాదా? అయినా అలా డైలాగ్ వేసింది. ఈమె ఎవరినైనా ఏమైనా అనొచ్చు. ఆమెను అంటే మాత్రం ఇలా చేస్తుంది. ఈమెది ఓ పర్సనాలిటీ.. ఈమె ఓ పుణ్యస్త్రీ మేమ తేడా' అని వచ్చేసింది. దీనిపై నాగార్జున కూడా సీరియస్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











