తల్లి మరణంతో ఒంటరి, డబ్బు కోసం భగవద్గీత శ్లోకాలు నేర్పించి..కంటతడి పెట్టిస్తోన్న విష్ణుప్రియ లైఫ్ స్టోరీ.?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా ప్రారంభమైంది. స్టార్ యాంకర్ విష్ణుప్రియ భీమనేని హౌస్‌లోకి అడుగుపెట్టారు. దీంతో ఆమె నేపథ్యం, యాంకర్‌గా ఎంట్రీ , కుటుంబ వివరాల గురించి నెటిజన్లు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ బయోడేటా మీ కోసం.

1986 ఫిబ్రవరి 22న ప్రకాశం జిల్లాలో జన్మించారు విష్ణుప్రియ. ఆమెకు చెల్లెలు పావని ఉన్నారు. చిన్నతనం నుంచి చదువులో, ఆటపాటల్లో చురుగ్గా ఉండే విష్ణుప్రియ.. స్కూల్‌లో కూడా కల్చరల్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేసేవారట. ఆమె తండ్రి వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ బాల్యమంతా హైదరాబాద్‌లోనే సాగింది. మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యానికేతన్‌లో చదువుకున్న ఆమె, ఈథీమ్స్ కాలేజీలో బీబీఏ పూర్తి చేసింది.

Vishnupriyaa bhimeneni entered as contestant in Bigg Boss Telugu 8 Here Achor s personal and Professional details

బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడంతో తాతగారు ఆమెకు భగవద్గీత శ్లోకాలు నేర్పించేవారు. ఈ కారణంగానే డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేవారట. అలాంటి విష్ణుప్రియ డిగ్రీ చదువుతున్నప్పుడే మోడలింగ్‌ వైపు అడుగుపెట్టి , తన సినిమాలను కొన్ని సినిమా ఆఫీసులకు పంపించింది. ఈ క్రమంలో 2005లో ఓ కో- డైరెక్టర్ పరిచయమై మలయాళంలో మయూఖం అనే సినిమాలో చిన్న వేషం ఇప్పించాడు.

ఆ తర్వాత నాగేంద్ర అనే అసోసియేట్ డైరెక్టర్‌తో పరిచయం కారణంగా తమిళంలో శివప్పతి గారమ్ అనే మూవీలో ఛాన్స్ ఇప్పించాడు. ఈ దశలో ఎస్ఎస్ రాజమౌళి- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యమదొంగలో ఛాన్స్ దక్కినా ఆ రోల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. గూలీ అనే కన్నడ సినిమాలోనూ విష్ణుప్రియ నటించారు. అప్పటి వరకు ఏడాదికి ఒకటి అరా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమెకు ఆ తర్వాత పూర్తిగా మొహం చాటేశాయి.

ఈ క్రమంలో యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది. పెళ్లిచూపులు, మెన్ విల్ బి మెన్, వైఫ్ ఆఫ్ కరుణ, యెల్లో, సోడాబుడ్డీ, ఇండియన్స్ ఏజ్ 25 వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయినా అవకాశాలు దొరక్కపోవడంతో 2017లో ఈటీవీ ప్లస్ ఛానెల్ కోసం మల్లెమాల పోవే పోరా అనే కొత్త ప్రోగ్రామ్ కోసం ఆడిషన్స్ నిర్వహించింది. ఈ ఆడిషన్స్‌కు వెళ్లిన విష్ణుప్రియ మొత్తం మూడు రౌండ్లలోనూ అదరగొట్టింది. ఆమెతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఎంపికైనా విష్ణుప్రియనే అదృష్టం వరించింది.

2017లో ఈటీవీలో టెలికాస్ట్ అయిన పోవే పోరాను విష్ణుప్రియ అద్భుతంగా హోస్ట్ చేశారు. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ అంతా సుధీర్‌ ఖాతాలోనే పడిందనే టాక్. ఈ షో ద్వారా విష్ణుప్రియ తెలుగు జనాలకు బాగా దగ్గరయ్యారు. కానీ మరే షోకు విష్ణుప్రియ యాంకర్‌గా ఎంపిక కాకపోవడం ఆశ్చర్యపరిచింది. కొద్దిరోజుల క్రితం ఆమె తల్లి కన్నుమూయడంతో విష్ణుప్రియ డిప్రెషన్‌లోకి వెళ్లారు. అవకాశాలు దొరక్కపోవడంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసేది. ఈ మధ్య బిగ్‌బాస్ ఫేం మానస్ నాగులపల్లితో కలిసి జరీ జరీ పంచె కట్టు అనే ప్రైవేట్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ దాదాపు 34 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ అయ్యింది. ఇటీవల మా టీవీలో ప్రసారమైన కిరాక్ బాయ్స్- ఖిలాడీ గర్ల్స్‌లో మంచి మార్కులు కొట్టేసిన విష్ణుప్రియ .. ఆ ఫేమ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 8లోనూ అవకాశం దక్కించుకుంది. ఈ షోలో ఆమె అద్భుతంగా పర్ఫర్మ్ చేయాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెబుతోంది ఫిల్మీబీట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X