Bigg Boss Voting: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. ఒకరు టాప్‌లో మరొకరు లాస్ట్‌లో.. ఎలిమినేట్ మాత్రం ఎవరంటే!
తెలుగు బుల్లితెరపై ఏ షోకూ సాధ్యం కాని రీతిలో స్పందనను అందుకుంటూ.. సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోతోంది బిగ్ బాస్. అదే సమయంలో అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ ఇండియా వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు పూర్తయిన ఏడు సీజన్లూ సూపర్ హిట్ అవగా.. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్ కూడా అదే రీతిలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇందులో చాలా సర్‌ప్రైజ్‌లు కనిపిస్తున్నాయి. అలానే ఇప్పుడు రెండో వారం ఓటింగ్ కూడా షాకింగ్‌గా సాగుతోంది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!
ఎప్పటికప్పుడు కొత్తగానే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో తీసుకు వస్తున్నట్లు చెప్పినప్పటి నుంచే దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఇందులో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌లో ఊహించని మలుపులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రేక్షకులకు వినోదం కూడా బాగానే లభిస్తోంది. తద్వారా ఈ సీజన్ రెస్పాన్స్‌ను రాబడుతోంది.

ఒకరు మాత్రమే అవుట్
తాజాగా ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో మొదటి వారంలో బెజవాడ బేబక్క షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.
నామినేషన్‌లో వీళ్లంతా
ఎపిసోడ్స్ ఎలా నడుస్తున్నా 8వ సీజన్ నామినేషన్స్ మాత్రం చాలా గొడవలతో రంజుగా సాగుతున్నాయి. ఇలా రెండో వారంలో మరింత ఎక్కువగానే ఇవి కనిపించాయి. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ప్రక్రియలో 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో నిఖిల్, విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, శేఖర్ బాషా, నైనికలు నామినేట్ అయ్యారు.
ఒక్కసారిగా మారిందిగా
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి నుంచి ప్రారంభం అయింది. ఇది మొదటి రెండు రోజులు ఒకలా సాగింది. కానీ, మూడో రోజు మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. గత ఎపిసోడ్‌లో విష్ణుప్రియను ఒక గ్యాంగ్ టార్గెట్ చేయడంతో ఆమెకు సానుభూతి పెరిగింది. ఫలితంగా అత్యధిక ఓట్లు సాధిస్తూ ఆమె టాప్‌కు చేరుకుంది.
వాళ్ల స్థానాల్లో నోచేంజ్
రెండో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో విష్ణుప్రియ టాప్ ప్లేస్‌కు చేరుకోవడంతో అప్పటి వరకూ మొదటి స్థానంలో ఉన్న నిఖిల్ రెండో స్థానానికి పడిపోయాడు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. నాగ మణికంఠ మూడో స్థానంలో, నైనిక నాలుగో స్థానంలో, శేఖర్ బాషా ఐదో స్థానంలోనే కొనసాగుతోన్నారు.
ఎలిమినేట్ ఎవరంటే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రెండో వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతం ఆరో స్థానంలో ఆదిత్య ఓం ఉన్నాడు. అయితే, అతడి కంటే తక్కువగా అంటే ఏడు, ఎనిమిది స్థానాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన కిర్రాక్ సీత, పృథ్వీ ఉన్నారు. అంటే, ఈ ముగ్గురిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువగా సీత లేదా ఆదిత్య వెళ్లిపోవచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











