ఫ్యామిలీ షోలో విశ్వక్ సేన్ బూతులు.. అంతమంది లేడీస్ ముందు.. అది చింపేస్తారంటూ!

హీరో విశ్వక్ సేన్ మాస్ కా దాస్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. గతేడాది ఓరి దేవుడా చిత్రంతో ఆడియెన్స్ మెప్పు పొందిన విశ్వక్ సేన్ ఈ ఏడాది దాస్ కా ధమ్కీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఉగాది పండుగ పురస్కరించుకుని మార్చి 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో పలు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు విశ్వక్ సేన్. అయితే విశ్వక్ సేన్ మాట్లాడే తీరు అందరికీ తెలిసిందే. ఆయన మాట, ప్రవర్తన తీరుతో వివాదాలు ఎదుర్కొన్నాడు. తాజాగా ఓ ఫ్యామిలీ షోకి హాజరైనా విశ్వక్ సేన్ బూతులు మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.

 విశ్వక్ సేన్ తండ్రి నిర్మాతగా..

విశ్వక్ సేన్ తండ్రి నిర్మాతగా..

ఫలక్​ నూమా దాస్ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో హీరోగాపాటు దర్శకత్వం వహించి సత్తా చాటాడు. ఇప్పుడు మరోసారి హీరోగా, డైరెక్టర్​గా ఆకట్టుకునేందుకు ముందుకు వస్తున్నాడు విశ్వక్ సేన్. సుమారు నాలుగేళ్ల తర్వాత విశ్వక్ సేన్ మెగా ఫోన్ పట్టుకున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్​, విశ్వక్​ సేన్ సినిమాస్​ బ్యానర్లపై విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ హీరోయిన్ గా అట్రాక్ట్ చేయనుంది.

ఫ్యామిలీ ఆడియెన్స్ కు..

ఫ్యామిలీ ఆడియెన్స్ కు..

ఇదిలా ఉంటే ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ జీ తెలుగు ఛానెల్ 'ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్' పేరుతో ఓ ఫ్యామిలీ షో నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ ప్రోమో చివర్లో విశ్వక్ సేన్ బూతులు మాట్లాడటం ఫ్యామిలీ ఆడియెన్స్ కు కాస్తా ఇబ్బంది కలిగించింది. అయితే ఆయన బూతులను మహిళలు ఎంకరేజ్ చేయడం విశేషంగా మారింది.

నేను ఎక్కడికి వెళ్లినా..

నేను ఎక్కడికి వెళ్లినా..

ప్రోమో స్టార్టింగ్ లో ఇంటింటి రామాయణం మూవీ టీమ్ సందడి చేసింది. నవ్య స్వామి రాహుల్ రామకృష్ణతో జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి కామెడీ పండించింది. ఆ తర్వాత ఆది సాయి కుమార్ చిరునవ్వే విసిరావే అంటూ తన పాటకు డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అది చూసి రోహిణి వచ్చి ఆదికి హగ్ ఇచ్చింది. 'నేను ఎక్కడికి వెళ్లినా.. ఈవిడ వస్తారన్న మాట. ఎందుకో నాకు అర్థం కావడం లేదు' అని ఆది కౌంటర్ ఇచ్చాడు.

 బికినీలో చేద్దాం..

బికినీలో చేద్దాం..

''ఈవిడ (రోహిణి) మీకు బికినీలో కావాలా లేక శారీలో కావాలా'' అని ఆదిని యాంకర్ శ్రీముఖి ఫన్నీగా అడిగింది. ''ఆల్రెడీ సౌందర్య గారు శారీలో చేసేశారు కాబట్టి. మనం బికినీలో చేద్దాం'' అని రోహిణి అందరికీ షాక్ ఇచ్చింది. తర్వాత ప్రోమో చివర్లో హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చాడు. విశ్వక్ సేన్ తో సీరియల్ నటికి అవార్డు ఇప్పించారు. దానికి ఆమె థాంక్యూ చెప్పగా.. దీన్ని పొగరుగా చెప్పవా అని శ్రీముఖి అంది. దానికి విశ్వక్ సేన్.. 'ఇచ్చిర్రు తియ్' అని అన్నాడు. తర్వాత బాలయ్య డైలాగ్ ను తన వెర్షన్ లో చెప్పాడు.

 వాళ్లే కోరుకుంటున్నారు..

వాళ్లే కోరుకుంటున్నారు..

అనంతరం విశ్వక్ సేన్ 'వాని ఇంట్ల నా ఇంజిన్ పాడదెXXX' అంటూ ఓ బూతు డైలాగ్ కొట్టాడు. దీంతో అంతా షాక్ కాగా.. శ్రీముఖి మాత్రం అరుస్తూ ఎంకరేజ్ చేసింది. 'వినిపయలేదు మల్లా చెప్పు' అని రోహిణి అంటే.. 'ఇంతమంది లేడీస్ ముందు' ఎలా అన్నట్లుగా విశ్వక్ సేన్ అన్నాడు. దానికి 'వాళ్లే కోరుకుంటున్నారు అర్థం కాలేదు మీకు' అని ఇమ్మాన్యుయేల్ అన్నాడు. 'అడిగింది లేడీస్ యేనా' అని విశ్వక్ సేన్ అనుమానంగా అన్నాడు.

మీరు మీరు చింపుకోండి..

విశ్వక్ సేన్ అన్నదానికి 'ఇది లేడీలా కనబడట్లేదా నీకు..' అంటూ రోహిణికి ఇమ్మాన్యూయేల్ పంచ్ వేశాడు. అప్పుడు 'పాడుదేXX అంటే చింపేద్దామని' అర్థం అని విశ్వక్ సేన్ వివరిస్తుంటే 'అది చింపేస్తారట' అని శ్రీముఖి అంది. ఇది విని రోహిణి 'మీరు మీరు చింపుకోండి' అని రోహిణి కౌంటర్ ఇచ్చి సైలెంట్ అయింది. తర్వాత ప్రోమోలో నాని వచ్చి సందడి చేశాడు. ఇలా ప్రోమో బాగుండగా.. ఆ ఒక్క బూతు తప్పా అంతా అదిరిపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X