Bigg Boss OTT: మరో ప్రధాన కంటెస్టెంట్ పేరు లీక్.. భార్యతో కలిసే ఎంట్రీ ఇవ్వబోతున్నాడా!
అసలేమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును.. ఆదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఇది భారీ సక్సెస్ అయింది. అందుకే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అంతేకాదు, ఏకంగా దేశంలోనే నెంబర్ వన్ షోగానూ పేరు సంపాదించుకుంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇక, తాజాగా మరో ప్రధాన కంటెస్టెంట్ పేరు లీకైంది. ఇంతకీ ఎవరది? పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

ఐదు సీజన్ల పూర్తి.. ఓటీటీ వెర్షన్
చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న తెలుగులో వచ్చే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్థాయిలో గుర్తింపు దక్కిందన్న విషయం తెలిసిందే. అందుకే ఇది ఐదు సీజన్లను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని నిర్వహకులు తెలిపారు. దీన్ని కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు.

24 గంటలు అందులో ప్రసారం
గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను హిందీ నిర్వహకులు ప్రసారం చేశారు. అక్కడ ఇది మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు తెలుగులోకి కూడా తీసుకుని వస్తున్నారు. అయితే, దీన్ని బిగ్ బాస్ సీజన్ మాదిరిగా టీవీలో ప్రసారం చేయరు. కేవలం ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ప్రసారం చేస్తారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఓటీటీ వెర్షన్ పనుల వివరాలు
ఫిబ్రవరి చివరి వారం నుంచి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా రోజుల క్రితమే దీనికి సంబంధించిన అన్ని పనులనూ మొదలెట్టారు. సెట్ వర్క్‌ను దాదాపుగా కంప్లీట్ చేసేశారు. ఐదో సీజన్ హౌస్‌కు కొన్ని మార్పులు చేసి దీన్ని నిర్మిస్తున్నారని సమాచారం. అలాగే, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది.

డేట్, కంటెస్టెంట్లు, రోజులి ఇలా
బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం నుంచి ఎంతో వైభవంగా ప్రారంభం కాబోతుందట. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగనుందని తెలిసింది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందని టాక్.

వాళ్లను కూడా తీసుకొస్తున్నారు
అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఇక, ఇందులో ముగ్గురు లేదా నలుగురు మాజీ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇందుకోసం పాత కంటెస్టెంట్లతో మంతనాలు చేస్తున్నారట.

షోలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్
ఓటీటీ మొదటి సీజన్‌కు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సెలెబ్రిటీ పేరు కూడా వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఓటీటీలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్ విశ్వ రఘు మాస్టర్ ఎంట్రీ ఇస్తున్నాడట. ఇప్పటికే అగ్రిమెంట్‌పై సైన్ కూడా చేసేశాడట.
Recommended Video

భార్యతో కలిసి ఎంట్రీ ఇస్తాడా?
టాలీవుడ్‌లో చాలా కాలంగా కొరియోగ్రాఫర్‌గా హవాను చూపిస్తో విశ్వ రఘు మాస్టర్.. గతంలోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా ఐదో సీజన్‌లోకి భార్య ప్రణవి (సింగర్)తో కలిసి రాబోతున్నాడని అన్నారు. కానీ, అలా జరగలేదు. అయితే, ఓటీటీ వెర్షన్‌కు మాత్రం అతడు ఎంట్రీ ఇస్తున్నాడట. మరి ఇప్పుడు ఒంటరిగా వస్తాడా? భార్యతో వస్తాడా చూడాలి.


Click it and Unblock the Notifications











