ఓ డైరెక్టర్, 500 మంది పని చేస్తారు.. షోలో జరిగేదిదే.. ‘బిగ్‌బాస్’గుట్టు విప్పిన వితికా షెరు
బిగ్‌బాస్ షోపై ఎన్నో రకాల పుకార్లున్నాయి. అవన్నీ ముందుగా ప్లాన్డగా రచిస్తారని, అంతా స్క్రిప్ట్డ్ షో అని కామెంట్స్ వినిపిస్తుంటాయి. అయితే అదంతా కాసేపు పక్కనబెడతాం. రోజుకు 24 గంటలుంటాయి. మనం షో చూసే మహా అయితే గంట. ఆ గంటలోనే కంటెస్టెంట్లందర్నీ చూసి ఓ అభిప్రాయానికి వచ్చేస్తాం. అది కూడా పూర్తి ఎడిటింగ్‌తో. వాళ్లకు ఏది కావాలో అది మాత్రమే బయటకు పంపిస్తారు. ఇలా బిగ్‌బాస్ షోలోని సీక్రెట్స్, షోలో పాల్గొనడం వల్ల ఏమేమీ కోల్పోయిందో వితికా షెరు చెప్పుకొచ్చింది.

విచిత్ర మనస్తత్వం..
బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్‌లో వరుణ్ సందేశ్, వితికా షెరు జంటగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వితికా షెరు ప్రవర్తనపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అక్కడి మాటలు ఇక్కడా.. ఇక్కడి మాటలు అక్కడా చెబుతూ ఉండేది. ప్రాణ స్నేహితుల్లా ఉండే రాహుల్ గురించి సైతం శ్రీముఖి వద్ద చెడుగానే చెప్పింది. ఇక అలీ రెజా రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలోనూ అతని ఫిట్‌నెస్ మీద ఓ కామెంట్ చేసింది. ఇలా తనపై బిగ్ బాస్ షో ప్రభావం చూపెట్టిన ప్రతీ అంశంపై మాట్లాడింది.

ఓ డైరెక్టర్
బిగ్ బాస్ అనేది 24 గంటల షో.. కాని మనకి చూపించేది ఒక గంట. కాని ఆ గంట షో చూసి ఒక మనిషిని ఎంతలా దిగజార్చుతారంటే.. ఆ తరువాత వాళ్లకు లైఫ్ ఉంటుందా? అనిపించింది. ఆ షోకి ఒక డైరెక్టర్ ఉంటారు.. రోజుకి 500 మంది వర్క్ చేస్తుంటారు అని వితికా షెరు అసలు విషయాన్ని తెలిపింది.

వాళ్ల స్ట్రాటజీలు..
మొదటి రెండు సీజన్లు చూసినప్పుడు అక్కడ జరిగేది ఒకటైతే చూపించేది వేరేది ఎందుకు ఉంటుందని నేనూ మీలాగే అనుకున్నాను.. కాని నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు వాళ్లు ఎలాగైనా చూపించగలరని అర్థమైంది. నన్ను నేను చూసుకుని ఏంటి ఇలా చేస్తున్నానని అనుకున్నాను. నేను బిగ్ బాస్‌ని బ్లేమింగ్ చేయడం లేదు.. వాళ్ల స్ట్రాటజీలు వాళ్లకి ఉంటాయని వితిక చెప్పుకొచ్చింది.

ట్రోలింగ్‌తో డిప్రెషన్..
బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి చాలా ట్రోలింగ్స్ వస్తుంటాయి.. నన్ను అనే కాదు.. చాలామందిని చేశారు. ఎన్నిరోజులు ఇలా చేస్తారు? నేను ఓవర్‌కమ్ అయితే నా ఫ్యామిలీ ఇబ్బంది పడింది. నాలాగా నా ఫ్యామిలీ కూడా చాలా వీక్.. ఆ ట్రోల్, కామెంట్స్ చూస్తే బతకాలని అనిపించలేదని వితిక తెలిపింది.
Recommended Video

ఎడిటింగ్ చేసి..
బయటకు వచ్చిన తరువాత రెండు మూడు వారాలైనా కోలుకోలేకపోయాను. నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కొన్నినెలల వరకూ నాపై చాలా మెసేజ్‌లు వచ్చాయి. నువ్ ఏంటి? నువ్ అలా నువ్ ఇలా.. అని. ఇక అలీ రెజా ఫిట్నెస్‌పై నేను చేసిన కామెంట్‌ను కూడా వారికి నచ్చినట్టుగానే ఎడిట్ చేసి చూపించారు అని బిగ్‌బాస్ చేసే మాయ గురించి వితిక చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











