వామ్మో వితిక నుంచి ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు.. అలా దుమ్ములేపేందుకు రెడీ!

బిగ్‌బాస్ షోలో కనిపిస్తే అందరికీ ఒకేలా ఫేమ్, నేమ్ వస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అప్పటి వరకు ఉన్న క్రేజ్ పడిపోవచ్చు.. లేదా ఓవర్ నైట్ స్టార్‌ను చేసేయొచ్చు. అదే బిగ్‌బాస్ షో. మొత్తంగా చెప్పాలంటే హీరోను జీరో చెయొచ్చు.. జీరోను హీరోనూ చేయొచ్చు. అయితే బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ కంటెస్టెంట్లలో దాదాపు అందరికీ పాజిటివ్ క్రేజ్ వచ్చింది. అయితే ట్రోలింగ్ మాత్రం ప్రతీ ఒక్కరూ ఎదుర్కొవాల్సిందే.

వితికా షెరుకు అలానే..

వితికా షెరుకు అలానే..


వరుణ్ సందేశ్ భార్యగా వితికా షెరుకు ఓ గుర్తింపు ఉండేది. సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ వరుణ్ సందేశ్ భార్యగానే అందరూ గుర్తిస్తారు. అయితే బిగ్ బాస్ షోలోకి రాకముందు వీరిద్దరి కెరీర్ డౌన్ ఫాల్‌లో ఉండేది. బిగ్ బాస్ తరువాత వరుణ్ సందేశ్ కూల్ నెస్, మంచితనం నిజాయితీ వల్ల ఓ గుర్తింపు వచ్చింది. అయితే వితికా షెరుకు మాత్రం కాస్త నెగెటివిటీ పెరిగింది.

అమ్మలక్కల ముచ్చట్లు..

అమ్మలక్కల ముచ్చట్లు..

అక్కడి మాటలు ఇక్కడా.. ఇక్కడి మాటలు అక్కడా చెబుతూ నెగెటివిటీ మూట గట్టుకుంది. ఆడవారి నోట్లో ఏ మాట దాగదు అనేదానికి వితిక మంచి ఉాదాహరణ. ఒకానొక సమయంలో రాహుల్ సిప్లిగంజ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. అక్కడ ఆమెకు చాలా దెబ్బ పడింది. ఇలా వితికపై సోషల్ మీడియాలో నెగెటివిటీ పెరిగింది.

బిగ్‌బాస్ షో వల్ల నష్టం

బిగ్‌బాస్ షో వల్ల నష్టం

ఇక తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేస్తూ బిగ్ బాస్ షో వల్ల, ట్రోలింగ్ వల్ల ఎంతటి వేదనను అనుభవించిందో వివరించింది. చచ్చిపోవాలనుకున్నాను.. డిప్రెషన్‌లోకి వెళ్లాను అంటూ తెగ ఎమోషనల్ అయింది. అందులో జరిగేది వేరు.. చూపించేది వేరు అంటూ అంతా ఎడిటింగ్ మాయ అని వితికా తన బాధనంతా వెల్లగక్కింది. తనతో పాటు అందరూ కూడా బిగ్ బాస్ వల్ల కలిగిన బాధను వివరించాలని తోటీ ఫీమేట్ కంటెస్టెంట్లను కోరింది.

కొత్త అవతారం..

కొత్త అవతారం..

బిగ్ బాస్ షో తరువాత వితికకు ఎలాంటి అవకాశాలు రాలేదు. యాంకర్‌గా సెటిల్ అవుతానని షోలో ఉన్నప్పుడు చెప్పింది. అయితే మొత్తానికి తాను అనుకున్నది సాధించినట్టు కనిపిస్తోంది. సామజవరగమన అనే షోకు యాంకర్‌గా చేస్తోన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. వితిక ఇంత అందంగా ఉంటుందా? ఇలా ఎప్పుడూ ఊహించలేదు అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక యాంకరింగ్ వితికా దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X