Just In
- 4 min ago
ఊరికే లింకులు పెడతారు కదా! అందుకే చేశా.. ఓపెన్‌గా చెప్పేసిన సుడిగాలి సుధీర్
- 10 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 11 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 11 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
Don't Miss!
- News
అమెరికాలో కాల్పుల కలకలం: దుండగుల కాల్పుల్లో పోలీసు సహా ఆరుగురి మృతి..
- Finance
బద్ధకం ఖరీదు... రూ 42,69,00,000
- Lifestyle
బుధవారం మీ రాశిఫలాలు 11-12-2019
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్.. భార్యను బిగ్‌బాస్ నుంచి బయటకు పంపి.. కన్నీటి పర్యంతం
బిగ్‌బాస్ తెలుగు ఎలిమినేషన్ వీకెండ్ సరదాగా, ఎమోషనల్‌గా సాగిపోయింది. నాగార్జున ఫుల్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చి అందరిలో జోష్ నింపాడు. ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడిస్తూ ఎపిసోడ్‌ను వినోదంగా మార్చారు. మధ్యలో ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ ఎపిసోడ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అలా ఆడుతూ వితికను ఎలిమినేట్ చేశాడు. వితిక ఎలిమినేషన్‌కు ముందు షోలో ఏం జరిగిందంటే..

ఇంటి సభ్యులతో
తొలుత ఇంటిలో కంటెస్టెంట్లతో పాటలకు డ్యాన్సులు చేసే గేమ్‌ను ఆడించారు. అందరూ తలో పాటకు డ్యాన్స్ చేయగా రాహుల్ ముఠామేస్తీ సాంగ్‌కు, శివజ్యోతి ఒక ఊరిలో పాటకు, బాబా భాస్కర్ జులాయి పాటకు డ్యాన్స్ చేశారు. చాలా సహజసిద్ధంగా డ్యాన్స్ చేసిన శివజ్యోతికి టాప్ మార్కులు సాధించి విజేతగా నిలిచారు. బాబా భాస్కర్ రెండోస్థానంలో నిలిచాడు.

శివజ్యోతి సేఫ్
ఆ తర్వాత ఇంటిలో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. నామినేషన్లో ఉన్న అలీ, వితిక, వరుణ్, శివజ్యోతికి చెరో మట్టికూజా ఇచ్చి పగలగొడితే వచ్చిన తర్వాత లభించే గోల్డ్ కాయిన్స్‌పై ఎవరి పేరు ఉంటే వారు సేఫ్ అవుతుందని గేమ్ రూల్స్ చేప్పారు. ఆ తర్వాత శివజ్యోతి సేఫ్ అయినట్టు ప్రకటించారు.

వితిక, వరుణ్‌తో
ఆ తర్వాత మళ్లీ ఓ బ్లైండ్ ఫోల్డ్ గేమ్‌ను ఆడించారు. ఈ గేమ్‌లో కళ్లకు గంతలు కట్టి శ్రీముఖి చేత డ్యాన్స్, వరుణ్, అలీ చేత బాక్సింగ్, వితిక, వరుణ్‌తో స్మైల్ బాల్స్ కొట్టుకోవడం లాంటి గేమ్ ఆడించారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియను మరోసారి ఆడించి అలీ రెజాను సేఫ్ అయినట్టు ప్రకటించారు.

వితిక్ అవుట్ ఇలా
ఇక చివర్లో వితిక, వరుణ్ సందేశ్ మిగలగా వారికి మధ్య ఎవరు సేఫ్.. ఎవరు అవుట్ అవుతారనే ట్విస్టును పెట్టాడు. వరుణ్ అవుటయితే తనకు ఇన్సిపిరేషన్‌గా భావిస్తానని వితిక చెప్పింది, ఒకవేళ వితిక అవుట్ అయితే నాకు సర్వస్వం అవుతుందని వరుణ్ చెప్పారు. చివరకు ఓ బోర్డు మీద చిన్న గేమ్ ఆడి వితికను అవుట్ చేశాడు.

గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్
వితిక్ అవుట్ కావడంతో వరుణ్ షాక్‌కు గురయ్యాడు. గుక్కపట్టి ఏడ్చాడు. వరుణ్ ఏడుస్తుంటే వితిక ఓదార్చేందుకు ప్రయత్నించింది. నీవు అలా ఏడవకు అంటూ వితిక సముదాయించింది. కానీ వరుణ్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. చివరకు సెల్ఫీ దిగి నాగార్జున వద్దకు స్టేజ్‌పైకి వెళ్లింది. ఆ తర్వాత తన జర్నీ చూసి ఎమోషనల్ అయింది.