వరుణ్‌ చుట్టూ అమ్మాయిలే.. నా మీద చేయి కూడా వేయనన్నాడు.. ఇష్టం లేకపోయినా అతడితో..: వితిక

Recommended Video

Vithika sheru & Varun Sandesh Love Story ❤️❤️

వరుణ్ సందేశ్ - వితిక షేరు.. వీళ్లిద్దరూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. దీనికి కారణం ఈ జంట బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడమే. బిగ్ బాస్ మొత్తానికి ఈ కపుల్ కొంచెం స్పెషలనే చెప్పాలి. దీనికి కారణం వీరిద్దరూ భార్యభర్తలు కావడమే. 'బిగ్ బాస్' చరిత్రలోనే దంపతులను షోకు తీసుకొచ్చిన దాఖలలు లేవు. ఈ సీజన్‌లో జంటగా రావడంతో అందరి కళ్లు వీళ్ల పైనే ఉన్నాయి. హౌస్‌లోకి ఎంటరయ్యే సమయంలోనే వరుణ్.. వితికను ఎత్తుకుని తీసుకెళ్లడం మరింత హైలైట్ అయింది. తాజాగా వితిక ఆసక్తికర విషయాలు చెప్పింది.

 రొమాన్స్‌తో మరింత హైలైట్

రొమాన్స్‌తో మరింత హైలైట్

హౌస్‌లోకి ఎంటరైన తర్వాత వరుణ్ సందేశ్.. వితిక కలిసే ఉండడం కనిపిస్తోంది. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం.. మధ్య మధ్యలో బాతాకానీలు పెట్టడం సరిపోతుంది. మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఒకటి.. మేమిద్దరం మాత్రమే ఒకటి అన్నంతగా ఈ జంట ఉంటోంది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా కనిపించాయి. బాత్ టబ్‌లో రొమాన్స్, దుప్పట్లో దూరిపోవడం వంటి వాటితో ఈ జంట మరింత హైలైట్ అయింది.

 భార్య కోసం.. భార్యతోనే గొడవ

భార్య కోసం.. భార్యతోనే గొడవ

తన భార్యను మహేశ్ విట్టా ఏదో అన్నాడని వరుణ్ సందేశ్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో ‘‘దమ్ముంటే నన్ను కొట్టు.. ఆడవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. సిగ్గు లేదు నీకు.. సిగ్గు లేనోడా'' అంటూ అతడు ఊగిపోయాడు. తర్వాత మహేశ్ సారీ చెప్పడంతో ఇది ముగిసిపోయింది. తర్వాత వరుణ్.. వితిక మధ్య చిన్న వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. భార్య ఎన్ని విషయాలు చెప్పినా వరుణ్ మాత్రం జెన్యూన్‌గా ఆడుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

వరుణ్ చుట్టూ అమ్మాయిలే

బిగ్ బాస్ షోలో భాగంగా వితిక తన ప్రేమ కథను మిగిలిన హౌస్‌మేట్స్‌తో పంచుకుంది. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకుంది. ‘వరుణ్‌తో సినిమా అనగానే చాలా మంది అతడు చుట్టూ అమ్మాయిలే ఉంటారు అని నాకు చెప్పారు. అమెరికాలో పెరిగి వచ్చిన వాడు కదా నిజమేనేమో అని అనుకున్నాను. దీంతో అతడితో సినిమా చేయకూడదనుకున్నాను. కానీ, ఇష్టం లేకపోయినా చేశాను' అని వితిక చెప్పుకొచ్చింది.

చేయి కూడా వేయనన్నాడు

చేయి కూడా వేయనన్నాడు

అలాగే, షూటింగ్ సమయంలో వరుణ్ ప్రవర్తన గురించి వివరిస్తూ.. ‘షూటింగ్ ప్రారంభం అయిన రోజు మీడియా వాళ్లందరూ వరుణ్‌ను హీరోయిన్‌పై చేయి వేయండి సార్ అని అన్నారు. దానికి వరుణ్ ఒప్పుకోలేదు. నేను చేయి వేయడం ఏంటి అన్నాడు. తర్వాత రెండు నెలల పాటు షూటింగ్ జరిగినా నాతో మాట్లాడలేదు. క్లైమాక్స్ కారులో ఉంటుంది. ఆరోజు తప్పక మాట్లాడాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యాం' అని పేర్కొంది.

 వరుణ్‌ను చూసి జాలి అనిపించింది

వరుణ్‌ను చూసి జాలి అనిపించింది

వరుణ్‌తో స్నేహం కుదిరిన తర్వాత జరిగిన దానిపై స్పందిస్తూ.. ‘వరుణ్ వాళ్లకు ఇక్కడ రెండు విల్లాలు ఉండేవి. వాళ్ల అమ్మానాన్న వెళ్లిపోయిన తర్వాత వీడు ఒక్కడే ఉండేవాడు. అవి అంతగా బాగుండేవి కాదు. అప్పుడు పాపం ఎలా ఉంటున్నాడు..? ఎలా తింటున్నాడ..? అనిపించేది. ఆ సమయంలోనే అతడిపై జాలి కలిగింది. నేను అతడితో ఉంటే బాగుండు కదా అనిపించింది' అని ఆమె వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ మా విడుదల చేసింది.

ఎలిమినేషన్ అయ్యేది ఎవరు..?

ఎలిమినేషన్ అయ్యేది ఎవరు..?

ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే.. ఈ సారి జాబితాలో ఏడుగురు ఉన్నారు. పునర్నవి, శివజ్యోతి, హిమజ, అషు రెడ్డి, రాహుల్‌, బాబా భాస్కర్, మహేశ్ విట్టాలు ఎలిమినేట్ అవడానికి నామినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిలో నుంచి ఎవరు బిగ్ బాస్ హౌస్‌ను వదిలి వెళ్లిపోతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X