పెళ్లయ్యాక మూడు సంవత్సరాలు బాధపడ్డాం.. 50 లక్షలు వచ్చాయంటే! వితిక కామెంట్స్
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 చివరి వారంలోకి ఎంటర్ అయింది. దీంతో ఈ షో విజేత ఎవరనే దానిపై ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఎవరికీ తోచిన అనాలిసిస్ వారు చేస్తూ విజేత ఎవరనేది డిసైడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరుణ్ సందేశ్ సతీమణి వితిక షేరు బిగ్ బాస్ విన్నర్ మా ఆయనే అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్ లు ఉన్నారు. ఈ ఐదుగురిలో విజేత ఎవరనేది ఈ వారమే తెలియనుంది. అయితే వితిక మాత్రం వరుణ్ సందేశ్ విన్నర్ అని బల్లగుద్ది మరీ చెబుతోంది. వరుణ్ సోలోగా ఉంటేనే మరింత బాగా ఆడతాడని తాను బయటకు వచ్చిన తరువాత చాలా మంది చెప్పారని, అందువల్ల తాను ఎలిమినేట్ అయ్యానని బాధపడటం లేదని వితిక పేర్కొంది.

బిగ్ బాస్ హౌస్‌లో భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి ఓ కంటెస్టెంట్‌గా ఉన్న వితిక ఇటీవలే ఎలిమినేట్ అయింది. కాగా తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. వరుణ్ సందేశ్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని జోస్యం చెప్పింది. ఫైనల్‌లో వరుణ్ గెలిస్తే వచ్చే 50 లక్షల రూపాయలను ఫిక్సెడ్ డిపాజిట్ చేసుకుంటామని తెలిపింది. పెళ్లయ్యాక మూడు సంవత్సరాలు తాము చాలా ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు డబ్బులు వస్తే ఆ ఆనందమే వేరని చెప్పింది.
బిగ్ బాస్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పిన వితిక.. వేరొకరి సహాయం లేకుండా, సోషల్ మీడియా అందుబాటులో లేకుండా సింపుల్‌గా బతకవచ్చని తెలిసిందని చెప్పుకొచ్చింది. చూడాలి మరి వితిక 50 లక్షల ఆశ ఎంతవరకు నెరవేరుతుందో!.


Click it and Unblock the Notifications











