Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నా ఇష్టం వచ్చినోడితో మాట్లాడుకుంటా.. రెచ్చిపోయిన వితిక.. శాంతంగా కనిపించిన వరుణ్
'బిగ్ బాస్' రియాలిటీ షోలో రోజు రోజుకూ వివాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. వాస్తవానికి గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కంటెస్టెంట్లలో అంతగా పేరున్న వాళ్లు లేకపోయినా.. షో మాత్రం ప్రేక్షకాదరణను పొందుతోంది. దీనికి కారణం ఇంట్లో జరిగే రచ్చే. సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకుని గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.
కెప్టెన్ అయిన అలీ
బుధవారం ఎపిసోడ్లో స్టార్ట్ బజర్ మోగిన వెంటనే అలీ రెజా పరుగున వెళ్లి సింహాసనంలో కూర్చున్నాడు. అతనికి అండగా శ్రీముఖి, బాబా భాస్కర్ అండగా నిలిచారు. అలీ అయితే సింహాసనాన్ని చాలా గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. అలీని దించడానికి రాహుల్ అండ్ టీం విశ్వప్రయత్నాలు చేసింది. ఆఖరికి రాహుల్, రవికృష్ణ మాత్రమే 15 నిమిషాల పాటు అలీని సింహాసనం నుంచి దించడానికి ప్రయత్నించారు. కానీ, అలీని దించలేక తప్పుకున్నారు. దీంతో అలీనే కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..
ఇక, గురువారం ఏం జరగబోతుంది అనేది బుధవారం రాత్రి ఎపిసోడ్ ముగిసిన తర్వాత ప్లే చేశారు. దీని ప్రకారం.. గురువారం ఎపిసోడ్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారన్నది స్పష్టమైంది. కంటెస్టెంట్లు డ్యాన్సులు వేసిన దాని ప్రకారం దీనిని అర్థం చేసుకోవచ్చు.
రెచ్చిపోయిన వితిక.. శాంతంగా కనిపించిన వరుణ్
గురువారం జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో ముందుగా అనుకున్నట్లు కంటెస్టెంట్లతో స్కిట్లు చేయించారు. ఇందులో భాగంగా వితిక తన కో స్టార్ రవికృష్ణతో ‘నువ్వు ప్రియతో ఎందుకు మాట్లాడావు.. నేను కూడా నా ఇష్టం వచ్చినోడితో మాట్లాడుకుంటా' అంటూ సీరియస్ క్యారెక్టర్ చేసింది. మరో గ్రూపులో ఉన్న వరుణ్.. శాంత పరుడిలా కనిపించాడు. దీంతో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది.
గత సీజన్లో కూడా..
బిగ్ బాస్ సీజన్ - 2లో కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన టాస్కులు ఇచ్చాడు. ఇందులో భాగంగా అందరూ స్కిట్లు చేశారు. అలాగే, మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్టులు చేశారు. ఆ ఎపిసోడ్లో భారతమాత గెటప్ వేసిన గీతా మాధురి అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందింది.
ఎలిమినేషన్ ఎవరు..?
ఈ వారం ఎలిమినేషన్‌కు రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్లు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సారి ఉన్న కంటెస్టెంట్లు అందరికీ ఎటువంటి రిమార్కులు లేకపోవడంతో (రాహుల్ మినహా) ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.