ఈ వారం కూడా వితిక సేఫే.. బిగ్ బాస్ సూపర్ ప్లాన్.. ఆమెను అడ్డుగా పెట్టుకుని..

తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ఎలిమినేషన్ వరకు ఎవరు వస్తారు.. ఎవరు వెళ్లిపోతారు అనేది రహస్యంగానే ఉంటోంది. అయితే, కంటెస్టెంట్ల ప్రవర్తనను బట్టి కాదు.. బిగ్ బాస్ నిర్వహకులు ఎవరిని బయటకు పంపాలనుకున్నారో వారే వెళ్లిపోతారన్న టాక్ కూడా ఉంది. ఇక, గత వారం ఎలిమినేషన్.. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ప్రతి ఒక్కరికీ ఇదే నిజమేనేమోనన్న సందేహం కలుగక మానదు. బిగ్ బాస్‌లో ఏం జరుగుతోంది..? ఈ వారం ఎవరు వెళ్లిపోతారు..? పూర్తి వివరాల్లోకి వెళితే....

ఈ వారం నామినేషన్

ఈ వారం నామినేషన్

గత వారం నాటకీయ పరిణామాల మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియ ఈ వారం మాత్రం సీరియస్‌గా జరిగింది. దీనికి కారణం పునర్నవినే అన్న విషయం తెలిసింది. ఒక్కొక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పిన బిగ్ బాస్.. తమకు ఇష్టం లేని ఇద్దరి కంటెస్టెంట్స్‌‌ పేరు చెప్పి వాళ్లకు నామినేషన్ స్టాంప్ గుద్దాలని స్టాంప్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు వచ్చి తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఈవారం ఎలిమినేషన్‌లో నిలిచారు.

గత వారం వితిక అనుకుంటే జాఫర్

గత వారం వితిక అనుకుంటే జాఫర్

గత వారం చివర్లో వితికా, వరుణ్, జాఫర్, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది సస్పెన్స్‌గా మారింది. వాస్తవానికి వితికా షెరు ఎలిమినేట్ కావడం ఖాయమని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలో కూడా వితికాకు వ్యతిరేకంగా బోలెడంత ప్రచారం జరిగింది. అయితే, ఆమె సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో జాఫర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు.

రొమాన్స్ కోసమే ఉంచారంటూ..

రొమాన్స్ కోసమే ఉంచారంటూ..

మరోవైపు, వితికను ‘బిగ్ బాస్' హౌస్‌లో కావాలనే ఉంచారన్న టాక్ వినిపించింది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా.. వితిక వెళ్లిపోతే భార్య భర్తల రొమాన్స్ మిస్ అవుతారు. అదే జరిగితే రేటింగ్ పడిపోతుంది అని కొందరు కామెంట్లు చేశారు. మరోవైపు, ఎలిమినేట్ అయిన జాఫరే ఇక్కడ అంతా సిస్టమాటిక్‌గా జరుగుతుందని చెప్పడం విశేషం.

ఈ వారం కూడా అదే జరగబోతుందా?

ఈ వారం కూడా అదే జరగబోతుందా?

గత వారం ఎలిమినేట్ అవుతుందని అనుకున్న వితిక తృటిలో తప్పించుకుంది. అయితే, ఈ వారం కూడా అదే జరగబోతుందని షో చూసే వారికి అర్థం అయిపోతుంది. కానీ, ఒక ఎలిమినేషన్ ఉంటేనే. అదే ఇంటి నుంచి ఇద్దరు బయటకు వెళ్లాల్సి వస్తే.. ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు. అసలు వితిక ఎలిమినేట్ అవదు అనడానికి కారణం తమన్నానే.

తమన్నానే కారణం

తమన్నానే కారణం

ఈ వారం తమన్నా కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని అవగతం అవుతోంది. షోను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారు మాత్రమే కాదు.. సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ చూసిన వారు కూడా ఇదే అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఆమె రవికృష్ణను టార్గెట్ చేయడమే. తమన్నా అతడిని అన్న మాటలకు పాపం కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.

వితిక ఎందుకు వెళ్లిపోవాలి.?

వితిక ఎందుకు వెళ్లిపోవాలి.?

హౌస్‌లో వితిక ఏమీ తప్పులు చేయడం లేదు. అంతేకాదు, ఎవరినీ నొప్పించడమూ లేదు. పైగా అందరికీ వంట కూడా చేసి పెడుతోంది. అయినా ఆమె వెళ్లిపోవాలని అనుకోడానికి కారణం.. తన భర్తను సరిగా ఆడనీయకపోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణంగానే వితిక వెళ్లిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు

బిగ్ బాస్ ప్లాన్ అంటూ..

బిగ్ బాస్ ప్లాన్ అంటూ..

అయితే, గత వారం వితికను ఎలిమినేట్ చేయకపోవడానికి ఓట్లు కారణం కాదని, దాని వెనుక బిగ్ బాస్ ప్లాన్ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అదే.. ఈ వారం కూడా తమన్నాను హైలైట్ చేసి, వితికను సేఫ్ చేయాలని అనుకుంటున్నారన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి, ఎవరు నామినేట్ అవుతారన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X