కల్యాణ వైభోగం నుంచి వీజే సన్నీ అవుట్.. తప్పుకొన్నాడా? తప్పించారా? వివాదంగా నటుడి నిష్క్రమణ

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన డైలీ సీరియల్స్‌లో కల్యాణ వైభోగం ఒకటి. ఈ సీరియల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకొన్న నటుల్లో వీజే సన్ని ఒకరంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అలాంటి నటుడు అనూహ్యంగా సీరియల్ నుంచి తప్పుకోవడం తెలుగు టెలివిజన్ రంగంలో చర్చనీయాంశమైంది. అయితే వీజే సన్నిని సీరియల్ నుంచి తప్పించారని, లేదు.. ఆయనే తప్పుకొన్నారనే రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే వాటిపై వీజే సన్నీ ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే...

 1000 ఎపిసోడ్స్‌తో రికార్డుగా

1000 ఎపిసోడ్స్‌తో రికార్డుగా

కల్యాణ వైభోగం దాదాపు 1000పైగా ఎపిసోడ్స్‌తో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కొనసాగుతున్న సీరియల్స్‌లో మంచి టీఆర్పీని సాధించింది. టాప్ సీరియల్స్‌లో ఒకటిగా పేరు తెచ్చుకొన్నది. ఇలాంటి సీరియల్ నుంచి కీలక పాత్రధారి వీజే సన్నీ తప్పుకోవడం అనేక ఊహాగానాలకు దారి తీసింది.

నా బంధం తెగిపోయిందంటూ

నా బంధం తెగిపోయిందంటూ

నాకు ఎంతో ఆదరణ ఇచ్చిన కల్యాణ వైభోగం సీరియల్ నుంచి తప్పుకొన్నాను. ఆ సీరియల్‌తో నా బంధం తెగిపోయింది. ముందే ఈ విషయాన్ని ఫ్యాన్స్‌కు చెప్పాలనుకొన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల చెప్పడం వీలు కాలేదు. సమయం వచ్చింది కాబట్టి నాపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇవ్వాలనుకొంటున్నాను అని వీజే సన్నీ ఆంగ్ల మీడియాకు చెప్పారు.

ఆరోపణలపై వీజే సన్నీ ఖండన

ఆరోపణలపై వీజే సన్నీ ఖండన

కల్యాణ వైభోగం నిర్మాతలతో తన వ్యక్తిగత విభేదాలే సీరియల్ నుంచి తప్పుకోవడానికి కారణమంటూ వచ్చిన ఆరోపణలను వీజే సన్నీ ఖండించారు. అలాంటి ఊహాగానాల్లో వాస్తవం లేదు. వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ షోతో నా కాంట్రాక్టు ముగిసింది. నాకు వేరే కమిట్ మెంట్స్ ఉండటం వల్ల అందులో భాగం కాలేకపోయాను అని సన్నీ పేర్కొన్నారు.

నా నటనకు మంచి ప్రశంసలు

నా నటనకు మంచి ప్రశంసలు

కల్యాణ వైభోగం టీమ్ నుంచి స్నేహపూర్వకమైన రిలేషన్స్‌తో బయటకు వచ్చాను. ఆ టీమ్‌తో కలిసి పనిచేయడం, ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. సీరియల్‌లో నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. అందరి విషెస్‌తో నేను బయటకు వచ్చాను అని వీజే సన్నీ చెప్పారు.

Recommended Video

Adipurush : Prabhas కి జోడీగా Kriti Sanon, లక్ష్మణుడి గా ఇతనే..!!
త్వరలోనే మంచి వార్తతో మీ ముందుకు

త్వరలోనే మంచి వార్తతో మీ ముందుకు

కల్యాణ వైభోగం నుంచి బయటకు వచ్చినప్పటికీ.. ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచేందుకు సిద్దంగా ఉన్నాను. ఇంకా నా భవిష్యత్ కార్యచరణ ఏమిటో ఆలోచించలేదు. త్వరలోనే మంచి ప్రాజెక్టుతో ముందుకు వస్తాను అని వీజీ సన్నీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సన్నీ స్థానంలో మరొకరిని రిప్లేస్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X