షణ్ముఖ్, సిరి హన్మంతును చీల్చి చెండాడిన వీజే సన్నీ ఫ్యాన్స్.. లేబర్ బిహేవియర్.. మబ్బు బ్యాచ్ అంటూ దారుణంగా ..
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో కెప్టెన్సీ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఇంటి సభ్యులు అవేశకావేశాలకు లోనై ఒకరిపై మరొకరు దాడి చేసుకొనేంత స్థాయికి వెళ్లారు. అయితే ప్రధానంగా వీజే సన్నీ, సిరి హన్మంతు మధ్య జరిగిన గొడవలో షణ్ముఖ్ జస్వంత్ జోక్యం చేసుకోవడంతో మాటల యుద్దానికి దారి తీసింది. అయితే ఈ వాదన సందర్భంగా షన్ను చేసిన నిర్వాకంపై సన్నీ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్‌కు కారణం ఏమింటంటే..
Photo Courtesy: Star మా and Disney+Hotstar

కెప్టెన్సీ టాస్క్‌లో భారీగా గొడవ
కెప్టెన్సీ టాస్క్ కోసం యాంకర్ రవి, వీజే సన్నీ, సిరి హన్మంతు, అనీ మాస్టర్ పోటీ పడ్డారు. గేమ్‌లో భాగంగా బ్రిక్స్‌తో చేసిన వాల్‌ను రక్షించుకొనే పనిలో పడ్డారు. అయితే వీజే సన్నీ తన ప్రత్యర్థి వాల్‌ను పడగొట్టేందుకు బంతిని విసరుతుండగా సిరి హన్మంతు వెనుక నుంచి వచ్చి గట్టిగా వాటేసుకొన్నది. దాంతో ఓ దశలో మర్యాదగా వదిలిపెట్టమని సిరిని విజే సన్నీ కోరాడు. అయినా వెనుక నుంచి వాటేసుకొని గట్టిగా పట్టుకోవడంతో విసిరి కొట్టాడు. దాంతో సిరి హన్మంతు కిందపడింది.
అట్లా అయితే నేను తంతాను.. అంటూ
అయితే సిరి హన్మంతు తనను పట్టుకోవడంపై సంచాలకులు అనీ మాస్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే తన గేమ్‌లో భాగంగా పట్టుకొన్నాను అని సిరి సమాధానం ఇచ్చింది. అయితే తాను గట్టిగా విసిరితే అప్పడం అయ్యే దానివి. నేను ఏదో అని ఊరుకొన్నాను. నీ గేమ్ పట్టుకోవడం అయితే నేను బ్లాక్స్‌ను తంతాను అని వీజే సన్నీ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అయితే సిరిని అప్పడం అనడంపై షణ్ముఖ్ ఘాటుగా స్పందించాడు. దాంతో వీజే సన్నీకి, షణ్ముఖ్ గట్టిగా గొడవ జరిగింది.

క్షణం పట్టదు అంటూ సన్నీ వార్నింగ్
సిరిని అప్పడం అంటే నేను మధ్యలో వస్తాను అని షణ్ముఖ్ అంటే.. దమ్ముంటే రా.. క్షణం పట్టదు అంటూ వీజే సన్నీ సవాల్ విసిరాడు. నేను తంతా అని ఎవరిని అనలేదు. అప్పడం అవతావని అనలేదు. కిందపడితే అప్పడం అవుతావని అన్నాను అని వీజే సన్నీ వివరణ ఇచ్చారు. అయితే యూట్యూబ్‌లో ఇలాంటి కామెంట్లు ఎన్నో చూశాం అని షణ్ముఖ్ అన్నాడు. అవును అది యూట్యూబ్‌లో అంటూ వీజే సన్నీ అన్నాడు. అయితే అవును నేను యూట్యూబర్‌ను, జస్ట్ యూట్యూబర్‌ను అంటూ వీజే సన్నీ వ్యాఖ్యలను తప్పుగా, షన్ను వక్రీకరించే ప్రయత్నం చేశాడు.

షన్నుగాడి బ్యాచ్ లేబర్‌గా బీహేవ్
అయితే వీజే సన్నీ, సిరి హన్మంతు చేసిన నిర్వాకం, గొడవపై సన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. వీజే సన్నీని షన్ను గ్రూప్‌గా ఏర్పడి టార్గెట్ చేస్తున్నారు అంటూ భారీగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ షన్నుగాడి బ్యాచ్ అంతే... అంతమంది ఫాలోవర్స్ పెట్టుకొని కూడా లేబర్‌గా బిహేవ్ చేస్తున్నారు. వాడు వీడియోలు వల్గర్‌గా ఉంటాయి. చెక్ చేసుకో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
మబ్బు అంటూ షన్నును ట్రోలింగ్
సోషల్ మీడియాలో షణ్ముఖ్‌ను నిబ్బా, సిరి హన్మంతును నిబ్బి అంటూ షన్నీ ఫ్యాన్స్ ఆటాడుకొంటున్నారు. మబ్బు (షణ్ముఖ్) తాను చెప్పిన మాటలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నాడు. అయినా వాడిని బ్లైండ్‌గా సపోర్ట్ చేస్తున్నారు అంటూ వీజే సన్నీ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు.
యూట్యూబ్ వరకే అంటూ సన్నీ కామెంట్స్
షణ్ముఖ్‌ను వీజే సన్నీ డ్రీగేడ్ చేయలేదు. యూట్యూబ్ వరకే అంటూ కామెంట్ చేశాడు అని వీజే సన్నీ అన్నాడు. నీవు షన్ము నీవు కేవలం యూట్యూబ్ వరకే.. వీజే సన్నీ జర్నలిస్టు, వీజే, సీరియల్ యాక్టర్ అంటూ ఫ్యాన్స్ అండగా నిలిచారు. దాంతో వీజే సన్నీ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా నిలిచారు. ఎంతో మంది అభిమానులు సన్నీకి అండగా నిలిచి.. షన్ము, సిరి హన్మంతును ట్రోల్ చేస్తున్నారు.

బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్‌గా యాంకర్ రవి
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ ఇంటికి పదోవారానికి కెప్టెన్‌గా యాంకర్ రవి ఎంపికయ్యాడు. చాలా వారాలుగా ప్రయత్నిస్తున్న రవికి ఈ వారం తన ప్రయత్నంలో సఫలమయ్యారు. కెప్టెన్‌గా ఎంపిక కావడంతో కెప్టెన్ బ్యాండ్‌ను చేతికి కట్టుకొన్నాడు. ఆ తర్వాత ఇంటి సభ్యుల బిగ్‌బాస్ అభినందించారు.


Click it and Unblock the Notifications











