Bigg Boss Unseen.. మానస్ అఘోరా.. వామ్మో కలలోకి వచ్చి... అలా ఆటపట్టించిన వీజే సన్నీ

బిగ్‌బాస్ ఇంటిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతు రిలేషన్ గురించి కాజల్, మానస్ ఆసక్తికరమైన చర్చ చేశారు. సిరిని షన్ను ఎలివేట్ కాకుండా కంట్రోల్ చేస్తున్నాడేమో అనే అనుమానాన్ని మానస్ వ్యక్తం చేస్తే.. దానికి కాజల్ సమర్ధిస్తూ సీరియస్‌గా చర్చించుకొంటూ కనిపించారు. అలాగే సంఘటన టాస్క్‌లో పింకిగా నటించిన మానస్ గురించి వీజే సన్నీ ఫన్నీ కామెంట్స్ చేయడం బిగ్‌‌బాస్ అన్ సీన్ ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా కనిపించాయి. బిగ్‌బాస్ ఇంటిలో 95 రోజు జరిగిన విషయాలు, కంటెస్టెంట్ల అభిప్రాయాలు ఏమిటంటే?

సిరిని అలా కంట్రోల్ అంటూ..

సిరిని అలా కంట్రోల్ అంటూ..

ఆర్జే కాజల్‌తో మానస్ మాట్లాడుతూ.. షన్ను గురించి డాక్టర్ వశీకరణ్ అనే విషయంపై మనం మాట్లాడుకొన్నాం కదా.. సిరి హన్మంతను బాగా కంట్రోల్ చేస్తున్నాడనిపిస్తుంది అని మానస్ అంటే.. లేదు.. మాటలతో కాదు కనుసైగలతో షన్ను ఆమెను కంట్రోల్ చేస్తున్నాడు. అన్నీ నేర్పిస్తాడు. సిరి బాగా మారిపోయింది అంటూ ఆర్జే కాజల్ తన అభిప్రాయాన్ని చెప్పింది.

అస్థిత్వం కోసం వ్యక్తిత్వం కోల్పోవద్దు

అస్థిత్వం కోసం వ్యక్తిత్వం కోల్పోవద్దు

బిగ్‌బాస్ ఇంటిలో కేవలం అస్థిత్వం కోసం సిరి హన్మంతు ప్రయత్నిస్తున్నది. అందుకే షన్నుతో అలా క్లోజ్‌గా ఉంటుంది. అలా వ్యవహరిస్తే.. తన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు కదా.. అని మానన్ అంటే.. అస్థిత్వం కోసం సిరి అలా చేయడం లేదు. షణ్ముఖ్ అంటే ఆమెకు చాలా ఇష్టం అంటూ ఆర్జే కాజల్ చెప్పింది. అయితే నీవు ఎవరినైనా ఇష్టపడితే.. నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతావా అంటూ కాజల్‌ను మానస్ ప్రశ్నించాడు. తప్పు చేసినా, ఒప్పు చేసినా ఓ గీత ఉంటుంది. ఆ గీతను ఎవరూ కూడా దాటకూడదు. దాంతో మన సొంత అభిప్రాయాలను పక్కన పెట్టొద్దు అంటూ మానస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

మానస్ ఫ్రస్టేషన్ గురించి

మానస్ ఫ్రస్టేషన్ గురించి

మానస్‌తో మాట్లాడుతూ.. వీజే సన్నీతో జరిగిన డిస్కషన్ గురించి కాజల్ చెబుతూ.. మానస్ ఎందుకు ఫ్రస్టేట్ అవుతున్నాడో అర్దం కావడం లేదని చెప్పాడు. అయితే తాను వెళ్లి మాట్లాడమని సలహా ఇచ్చాను. అందుకే వచ్చి నీతో మాట్లాడాడు అని కాజల్ చెబితే.. ఎవరేమి అనుకొన్నా నేను పట్టించుకోను అని మానస్ అన్నాడు. అయితే నీవు చేస్తే ఫన్.. లేదా సన్నీ చేస్తే ఒకే కానీ.. సిరి, షణ్ముఖ్ గానీ, మరొకరు నన్ను కామెంట్ చేస్తే నేను పట్టించుకోను అని కాజల్ అన్నాడు. అయితే మంచి మూడ్ ఉన్న సమయంలో ఎవరైనా కామెంట్ చేస్తే నేను పెద్దగా ఇష్యూ ఉండదు అని మానస్ చెప్పాడు.

మానస్ నీవు చీరకట్టుకొంటావా?

మానస్ నీవు చీరకట్టుకొంటావా?

ఇక ప్రియాంక సింగ్ క్యారెక్టర్ వేసిన మానస్‌తో వీజే సన్నీ మాట్లాడుతూ.. నీవు మళ్లీ చీరకట్టుకుంటావా? అని అంటే.. నీకు నచ్చిందా అంటూ మానస్ ప్రశ్నించాడు. అయితే ఈ రోజు నీట్‌గా షేవ్ చేసుకొని.. పింకి క్యారెక్టర్ వేయి అని చెప్పాడు. దాంతో ఈ రోజు కూడా పింకి క్యారెక్టర్ వస్తుందేమో అంటూ కాజల్ డౌట్ వ్యక్తం చేసింది. అంత సీన్ లేదు అంటూ మానస్ అంటే... చిన్న చిన్న కోరికలు తీర్చరా.. సిరి నీకు నచ్చలేదా అంటూ వీజే సన్నీ కామెంట్ చేశాడు. అందుకు సమాధానంగా నేను షాక్ అయ్యాను అంటూ సిరి హన్మంతు చెప్పింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Shanmukh- Siri Upset | VJ Sunny Ultimate || Filmibeat Telugu
కలలోకి వచ్చి అలా భయపెట్టావు అంటూ

కలలోకి వచ్చి అలా భయపెట్టావు అంటూ

అయితే పింకిగా మేకప్ కావడం నాకు కూడా షాక్ తగిలింది. నాకు మాత్రం అఘోరాలా కనిపించాడు. కలలోకి వచ్చి బయపెట్టాడు. వైల్డ్ కార్డు ఎంట్రీగా పింకిలా డ్రస్ వేసుకొని నువ్వే రారా అని వీజే సన్నీ కామెంట్ చేశాడు. ఏరా నీకు అంత నచ్చానా. నాకు నీ ఫీలింగ్స్ ఏమిటో అర్ధం కావడం లేదు అంటూ మానస్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X