Bigg Boss Eviction Free Pass వీజే సన్నీ ప్లాన్స్ తలకిందులు.. పాస్ అలా మాత్రమే అంటూ బిగ్‌బాస్ షాక్!
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగిన నిప్పుల్లో శ్వాసగా, గుండెల్లో ఆశగా అనే టాస్క్‌లో హైడ్రామా చోటుచేసుకొన్నది. ఈ టాస్క్‌లో మానస్, ఆర్జే కాజల్ మధ్య జరిగిన వాగ్వాదం చివరికి వీజే సన్నీకి లాభం చేకూర్చింది. ఎవిక్షన్ ప్రీ పాస్‌ను వీజే సన్నీ గెలుచుకోవడంతో ఆ టాస్క్ గొడవల మధ్య ముగిసింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లో ఎలాంటి గొడవలు జరిగాయి. వీజే సన్నీకి లభించిన ఎవిక్షన్ పాస్ ఎలాంటి లాభాన్ని ఎవరికి అందించబోతున్నది అనే విషయాల్లోకి వెళితే...

ఆర్జే కాజల్ చాలా ఇంటెలిజెంట్‌గా
ఎవిక్షన్ ఫ్రీ పాస్ సందర్భంగా ఆర్జే కాజల్ చాలా తెలివిగా తన గేమ్‌ను ఆడింది. అయితే తొలుత సిరిని సేఫ్ చేద్దామని అనుకొన్నది. అయితే మానస్ అందుకు ఒప్పుకోకపోవడంతో మానస్, ఆర్జే కాజల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది సిరిని సేవ్ చేద్దామని అని మానస్ అంటే.. అని మాస్టర్‌ను సేవ్ చేద్దామని కాజల్ ప్రపోజల్ పెడితే.. వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కనిపించలేదు. దాంతో ఇద్దరు సేవ్ కాకుండా వారి ఫోటోలు తగలబడిపోయాయి. దాంతో వీజే సన్నీకి ఎవిక్షన్ పాస్ లభించింది.

అనీ మాస్టర్ గొడవ చేస్తూ..
ఇక వీజే సన్నీకి ఎవిక్షన్ పాస్ లభించేలా ఆర్జే కాజల్ తన గేమ్ ప్లాన్ పక్కాగా అమలు చేసింది. అయితే ఆర్జే కాజల్ ఆడిన డ్రామాపై అనీ మాస్టర్ ఘాటుగా స్పందించింది. చాలా తొండిగా ఆడారు అంటూ అనీ మాస్టర్ గట్టిగా అరిచింది. మానస్‌ను సరిగా ఆడలేదని శ్రీరామచంద్ర, యాంకర్ రవి నిందించారు. కెప్టెన్సీ ఎలా చేస్తావో చూస్తాను అంటూ శ్రీరామచంద్ర కనిపించారు.

వీజే సన్నీకి ఎవిక్షన్ పాస్..
ఎవిక్షన్ పాస్ గెలుచుకొన్న వీజే సన్నీని హోస్ట్ నాగార్జున అభినందించారు. ఆర్జే కాజల్ కావాలని వీజే సన్నీకి ఎవిక్షన్ పాస్ వచ్చేలా చూసింది. అది ఆమె గేమ్ ప్లాన్ అంటూ నాగ్ అన్నారు. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఏం లాభం జరుగుతుందని అనుకొంటున్నావు అంటూ నాగ్ ప్రశ్నిస్తే.. నామినేషన్‌లోకి వెళ్లకుండా కాపాడుకొనేందుక పనికి వస్తుందని అనుకొంటాను. నాకు నేను సేవ్ చేసుకొంటాను అని వీజే సన్నీ చెప్పాడు.

ఎలిమినేషన్ కత్తి మెడపై ఉంటే..
అయితే ఎవిక్షన్ ప్రీ పాస్ ఉద్దేశం నామినేషన్ నుంచి తప్పించుకోవడం కాదు. నామినేషన్ లోకి వెళ్లకుండా ఎవిక్షన్ పాస్ ఉపయోగపడదు. ఎవరైనా ఎలిమినేషన్ ముప్పు ఉంటే.. లేదా నీకు ఎలిమినేషన్ ముప్పు ఉన్నా దానిని ఉపయోగించుకోవచ్చు. అలాంటి సమయం వచ్చినప్పుడు బిగ్‌బాస్ నీకు ఇస్తాడు. అప్పటి వరకు వేచి ఉండాలి అని హోస్ట్ నాగార్జున చెప్పారు.

వీజే సన్నీకి టీషర్ట్ గిఫ్టుగా
ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ లభించినందున సెలబ్రేషన్ చేసుకొందామని హోస్ట్ నాగార్జున చెప్పాడు. దాంతో ఇంటి సభ్యులందరూ లేచి నిలబడితే.. యాంకర్ రవిని స్టోర్ రూమ్‌లోకి వెళ్లి గిఫ్ట్ బాక్స్ తీసుకురమ్మని చెప్పాడు. ఆ తర్వాత అందులో టీషర్టుపై ఎవరి బొమ్మ ఉంటే.. వారు సేఫ్ అని చెప్పాడు. బాక్స్ ఓపెన్ చేయగా.. అందులో టీషర్ట్‌పై వీజే సన్నీ బొమ్మ ఉంది. దాంతో ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి వీజే సన్నీ సేవ్ అయ్యాడు. ఆ టీషర్ట్ వీజే సన్నీ వేసుకోగా.. అది బిగ్‌బాస్ గిఫ్టుగా ఉంచుకో అంటూ చెప్పారు.


Click it and Unblock the Notifications











