Bigg Boss లో హగ్గులతో మోత మోగించిన వీజే సన్నీ.. అసంతృప్తితో సిరి హన్మంతు, షణ్ముక్

బిగ్‌బాస్ ఇంటిలో 14వ వారం ఇంటిలో ఫన్ టాస్క్‌లను ఇంటి సభ్యులకు ఇచ్చాడు. సూపర్ లగ్జరీ టాస్క్‌కు ముందు కొన్ని తినుబండారాలను ఇచ్చాడు. వాటిని సొంతం చేసుకోవాలంటే ఓ టాస్క్ ఆడాల్సిందనే రూల్‌ను ఇంటి సభ్యులకు విధించాడు. ఆ టాస్క్‌ ఎలా సాగింది? అలాగే మొదటి సంఘటన టాస్క్ ఎలా ముగిసిందనే విషయంలోకి వెళితే..

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

12 గులాబ్ జామున్స్ తిన్న సిరి హన్మంతు

12 గులాబ్ జామున్స్ తిన్న సిరి హన్మంతు

సూపర్ లగ్జరీ టాస్క్‌లో భాగంగా లాన్‌లో టేబుల్స్ పైన కొన్ని గులాబ్ జామున్స్ పెట్టి ఎవరైతే చేతుల పెట్టకుండా తింటారో వారు విజేతలుగా నిలవడంతోపాటు సూపర్ లగ్జరీ టాస్క్ గిఫ్టుల లభిస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్క్‌లో వేగంగా 12 గులాబ్ జామున్ తినడం పూర్తి చేసిన సిరి హన్మంతును విజేతగా నిలిచారు. ఆమెను బిగ్‌బాస్ అభినందించారు.

ఓట్లు అడిగే ఛాన్స్ అంటూ టాస్క్

ఓట్లు అడిగే ఛాన్స్ అంటూ టాస్క్

ఆ తర్వాత సరికొత్త టాస్క్‌ను కంటెస్టెంట్ల ముందుకు తీసుకొచ్చారు. ఈ టాస్క్‌లో ఉత్తమ ప్రదర్శన చూపించిన కంటెస్టెంట్లకు ప్రేక్షకులను ఓట్లను అడిగే చాన్స్ లభిస్తుంది. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటిలో జరిగిన ఐకానిక్ సీన్లను రీ క్రియేట్ చేయాలి. ఇంటిలో సిరి హన్మంతు, వీజే సన్నీ మధ్య జరిగిన అప్పడం సీన్‌ను రీక్రియేట్ చేయాలి అంటూ బిగ్‌బాస్ సూచించాడు.

లఫూట్ సీన్ రీ క్రియేషన్‌తో హడావిడి

లఫూట్ సీన్ రీ క్రియేషన్‌తో హడావిడి

కాజల్‌గా శ్రీరామచంద్ర, అని మాస్టర్‌గా మానస్, సన్నీగా సిరి హన్మంతు, సిరి హన్మంతుగా షన్ను, వీజే సన్నీ షణ్ముక్‌గా నటించారు. అయితే టవర్ టాస్క్‌లో షణ్ముఖ్‌ను వెనుక నుంచి పట్టుకొన్న సిరి హన్మంతును నెట్టివేయడంతో కిందపడింది. గట్టిగా నెట్టివేస్తే అప్పడం అయిపోతావు అంటూ సన్నీ చెప్పిన కామెంట్ షన్ను చెప్పాడు. అలాగే ఆర్జే కాజల్‌ను ఉద్దేశించి లఫూట్ అంటూ అనీ మాస్టర్ అనే సీన్‌ను రీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అనీ మాస్టర్ పిచ్చిగా డ్యాన్స్ చేయడం, నాగిని డ్యాన్స్ చేయడం ఆర్జే కాజల్ గట్టిగా అరవడం లాంటి సీన్లను రిపీట్ చేశారు.

సీన్‌లో హగ్గులు ఎక్కడివిరా అంటూ సిరి

సీన్‌లో హగ్గులు ఎక్కడివిరా అంటూ సిరి


అలాగే షన్ను, వీజే సన్నీ మధ్య జరిగిన యూట్యూబ్‌లో మాత్రమే అనే కామెంట్లపై ఇంటి సభ్యులు రచ్చ చేశారు. అయితే ఈ గేమ్‌లో పదే పదే షణ్ముఖ్‌ను సన్నీ కౌగిలించుకోవడంతో అరేయ్ ఈ సీన్‌లో హగ్గులు ఎక్కడ ఉన్నాయిరా అంటూ సిరి హన్మంతు కామెంట్ చేసింది. అలా వీజే సన్నీగా సిరి, వీజే సన్నీ సిరి హన్మంతుగా మంచి నటించి ఫన్ క్రియేట్ చేశారు.

లేనిది క్రియేట్ చేయకు అంటూ షన్ను

లేనిది క్రియేట్ చేయకు అంటూ షన్ను

అయితే షన్నుగా నటించిన సన్నీ తనదైన స్టయిల్‌లో నటించడంపై షన్ము కోపంతో ఊగిపోయాడు. నీవు లేనిది క్రియేట్ చేయకు అంటూ సన్నీని ఉద్దేశించి షన్ను కామెంట్ చేశాడు. దాంతో లేదు మచ్చా అంటూ సన్నీ వివరణ ఇచ్చాడు. అలా మొదటి సంఘటన టాస్క్ ముగిసింది. అయితే ఈ టాస్క్ కొందరిలో అసంతృప్తిని కలిగించింది. ముఖ్యంగా సన్నీ తమను టార్గెట్ చేస్తున్నాడని సిరి, షన్ను తమలో తాము అనుకోవడం కనిపించింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Shanmukh- Siri Upset | VJ Sunny Ultimate || Filmibeat Telugu
నన్ను తప్పు చేయడానికి వెకిలి చేయకు.

నన్ను తప్పు చేయడానికి వెకిలి చేయకు.

అయితే వీజే సన్నీని ఉద్దేశిస్తూ.. ఇమిటేట్ చేయి కానీ.. వెకిలి చేయకు. నీవు వెకిలిగా నువ్వు ట్రీట్ చేస్తున్నావు. అది నాకు నచ్చలేదు అని షణ్ముఖ్ జస్వంత్ అన్నాడు. అయితే ఇమిటేట్ చేశాడు.. లైట్ తీసుకో అంటూ షన్నును సిరి హన్మంతు ఊరడించింది. అయితే ఒక మనిషిని తప్పుగా చూపించాలంటే.. వెకిలి చేయడమేనా? అప్పటికే చెవిలో చెప్పాను.. ఎక్కువ చేయకు అని చెప్పాను. అయితే వెకిలి చేసి సారీ చెబితే అయిపోయినట్టేనా? నీవు బయటకు వెళ్తే మనం చిల్లర అయిపోతామో చూడు అంటూ సిరితో షన్ను అంటూ కనిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X