VJ Sunny v/s Shannu.. బిగ్‌బాస్ తెలుగు 5 విజేత అతడే.. హోరెత్తుతున్న ట్రోల్స్, ట్రెండ్స్
గత కొద్దికాలంగా నిరాశజనకంగా సాగుతున్న బిగ్‌బాస్ తెలుగు 5 షో పదోవారం జోరందుకొన్నది. ఇంటిలో వీజే సన్నీ ఆటపరంగా, వినోదపరంగా దూసుకెళ్తున్న సమయంలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతుతో వివాదం మరింత పాపులారిటిని సంపాదించుకొన్నాడు. దాంతో వీజే సన్నీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండింగ్ నిలిచారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వీజే సన్నీకి భారీగా మద్దతు కనిపించడం క్రేజీగా మారింది. తాజాగా ట్రెండ్ అయిన, ట్రోల్స్ గురించి వివరాల్లోకి వెళితే..

గత రెండు వారాలుగా
గత రెండు వారాలుగా వీజే సన్నీ ట్విట్టర్‌లో భారీగా అభిమానులను కూడగట్టుకొన్నారు. బిగ్‌బాస్ ఇంటిలోనే కాకుండా హోస్ట్ నాగార్జునతో కూడా ప్రశంసలు అందుకొన్నారు. ఇక ఫన్ ఎలిమెంట్స్‌తోపాటు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో ఇంటిలో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. దాంతో ఒక్కసారిగా అందరి దృష్టి వీజే సన్నీపై నిలిచింది.

శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ టార్గెట్ చేస్తూ
అయితే శనివారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత వీజే సన్నీని హోస్ట్ నాగార్జున టార్గెట్ చేశారనే భావనతో భారీగా ట్రోల్ చేశారు. షో గురించి నాగార్జునకు సరిగా నిర్వాహకులు స్క్రిప్టు. ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లేదు. నాగార్జునకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మీరు ఎంతగా బ్యాడ్‌గా చిత్రీకరించాలని చూసినా సన్నీ ఎమోషన్స్ ఆపలేరు అంటూ కామెంట్లు చేశారు. ఎంత అడ్డుకొన్నామని ప్రయత్నించినా సన్నీనే బిగ్‌బాస్ సెన్సేషన్ అంటూ ట్వీట్లు చేశారు.

18 గంటలపాటు ట్రెండింగ్‌లో
ఇలాంటి పరిస్థితుల్లో వారాంతంలో వీజే సన్న వరల్డ్ వైడ్ ట్రెండ్ అయ్యాడు. దాదాపు ఇండియాలో ఎక్కువ సేపు ట్రెండింగ్‌గా నిలిచిన బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఒక ట్రెండింగ్‌లో టాప్ పోజిషన్‌లో నిలిచిన కంటెస్టెంట్‌గా నిలిచాడు. దాదాపు 18 గంటలపాటు ట్రెండింగ్ లిస్టులో ఉన్నాడు. సుమారు 1.1 మిలియన్ కౌంట్‌ను సొంతం చేసుకొన్నాడు.

సింహం ఒకవైపు.. జంతువులన్నీ మరోవైపు
అడవిలో సింహం ఒకవైపు.. జంతువలన్నీ మరోవైపు.. అలాగే బిగ్‌బాస్‌లో సన్నీ ఒకవైపు.. ఇతర కంటెస్టెంట్లు మరోవైపు. అడివికి రారాజు సింహమైంతే.. బిగ్‌బాస్ తెలుగు 5 కింగ్ విజే సన్నీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. #Bb5sensationvjsunny అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

భారీగా మద్దతు కూడగట్టుకొన్న సన్నీ
ఇక సన్నీ ఫ్యాన్స్ భారీగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. షన్ముఖ్‌ను భారీగా ట్రోల్ చేస్తున్నారు. షన్ను యూట్యూబ్ ఫాలోవర్స్ ఓట్లు తీసుకొంటున్నాడు. కానీ సన్నీ మాత్రం రియల్ ఓటింగ్‌ను సంపాదించుకొంటున్నాడు. సననీ ఆల్ రౌండర్, యూట్యూబ్ గురించి తప్పుగా అనలేదు. వాళ్లకి ఫాలోవర్స్ ఉన్నారని.. మిగితా కంటెస్టెంట్లను బ్యాడ్ చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Recommended Video

సన్నీ టార్గెట్ చేసిన షన్ను ఫ్యాన్స్
ఇదిలా ఉండగా, సన్నీని కూడా షన్ను అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అప్పడం వివాదంపై సన్నీని టార్గెట్ చేశారు. అయితే బిగ్‌బాస్ విజేతగా నిలువడానికి షన్నుకు అన్నీ అర్హతలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు వదులుతున్నారు.


Click it and Unblock the Notifications











