Waltair Veerayya: బాలయ్య రికార్డు టచ్ చేయని చిరంజీవి.. మరీ ఇంత తక్కువగానా!

ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా రీఎంట్రీలో ఏకధాటిగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న ఆయన.. ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి మాత్రం ఆడియెన్స్ అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుని పొంగల్ విన్నర్‌గా నిలిచింది.

సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించిన ఈ మూవీకి ఊహించని రీతలో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్లుకు పైగా షేర్‌ను వసూలు చేసింది. అలాగే, 230 కోట్లు వరకూ గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది. తద్వారా చిరంజీవి కెరీర్‌లోనే టాప్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

Waltair Veerayya Did Not Reach Veera Simha Reddy TRP Rating

థియేటర్లలో మాదిరిగానే 'వాల్తేరు వీరయ్య' మూవీ ఓటీటీలోనూ అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుని సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా దీనికి స్పందన అంతగా రాలేదు. ఫలితంగా ఈ చిత్రానికి అర్బన్ ఏరియాలో 5.14 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి 4.56 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది.

చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి ఇంత తక్కువ రేటింగ్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు, ఈ చిత్రానికి పోటీగా థియేటర్లలో విడుదలైన 'వీర సింహా రెడ్డి' మూవీ మాత్రం ఏకంగా 8.83 టీఆర్పీ రేటింగ్‌ను సాధించింది. ఈ రికార్డును మాత్రం చిరంజీవి సినిమా చేరలేకపోయింది. దీంతో ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ఈ రెండింటినీ కంపార్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Waltair Veerayya Did Not Reach Veera Simha Reddy TRP Rating

ఇదిలా ఉండగా.. 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా తదితరులు నటించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X