హర్ట్ అయ్యానన్న బాబా భాస్కర్.. మహేశ్, అలీ మధ్య మొదలైన వార్.. ఒకరిపైకి ఒకరు వెళ్తూ రచ్చ.!

Recommended Video

War of words between #AliReza & #MaheshVittta

మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా హౌస్‌లో మరోసారి గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.

ఈ వారం కొంచెం కొత్తగా..

ఈ వారం కొంచెం కొత్తగా..

ఇప్పటికే నాలుగు వారాల్లో ఎలిమినేషన్ ప్రక్రియ నాలుగు రకాలుగా జరిగింది. నలుగురు కంటెస్టెంట్లు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇక, ఈ వారం బిగ్ బాస్ సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో బాక్స్‌లో బాల్స్ పెట్టారు. నల్ల బాల్ వచ్చిన వాళ్లు ఒకలా.. ఎర్ర బాల్స్ వచ్చిన వాళ్లు మరోలా నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో భాగంగానే ఓ ప్రక్రియలో కంటెస్టెంట్లు తమకు ఇష్టంలేని హౌస్‌మేట్ ముఖంపై ఎరుపు రంగు పూశారు.

బాబా భాస్కర్ అన్ లక్కీ

ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు కెప్టెన్ అయిన అలీ రేజాను నలుగురు కంటెస్టెంట్లను నేరుగా నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత ఆ నలుగురు అతడి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని, చివరకు అలీ ఎవరి పేరు చెబితే వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. ఇక, చివర్లో అలీ.. బాబా భాస్కర్ పేరు చెప్పడంతో ఆయన నేరుగా నామినేట్ అయ్యాడు.

 మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు

మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు

ఇప్పటి వరకు అందరినీ నవ్వించిన బాబా భాస్కర్ సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో కన్నీటి పర్యంతం అయ్యాడు. దీనికి కారణం అలీ తనను నేరుగా నామినేట్ చేయడమే. తాను ఎప్పుడూ ఎలాగే ఉంటానని.. బిగ్ బాస్ కోసం నటించాల్సిన అవసరం తనకు లేదని శ్రీముఖితో చెప్పుకుని ఏడ్చాడు. అంతేకాదు, అలీ తనను నామినేట్ చేసిన పర్లేదు కానీ.. అతను చెప్పిన కారణాలు తనకు నచ్చలేదని బాధ పడ్డాడు.

అలీ.. మహేశ్ మధ్య గొడవ

అలీ.. మహేశ్ మధ్య గొడవ

దీని తర్వాత ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇక, తాజాగా విడుదలైన ప్రోమోలో.. అలీ రేజా.. బాబా భాస్కర్‌కు వివరణ ఇస్తున్నాడు. ఇంతలో మహేశ్ విట్టా మధ్యలో జోక్యం చేసుకున్నాడు. అప్పుడు అలీ నువ్వు పుల్లలు పెట్టకు అని అనడంతో మహేశ్ కూడా సీరియస్ అయ్యాడు. ఇద్దరి మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో అషు రెడ్డి.. మహేశ్‌ను దూరంగా తీసుకొచ్చేసింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X