బిగ్ బాస్‌లో యుద్ధం, తనీష్ నోరు మూస్కో, సిగ్గులేకుండా.. సహనం కోల్పోయిన తనీష్, తేజస్వి!
బిగ్ బాస్ హౌస్ రోజురోజుకు ఆసక్తిగా మారుతోంది. గత సీజన్ కంటే ఈ సీజన్ మరింత రసవత్తరంగా మార్చాలని నిర్వాహకులు భావిస్తున్నారు. హౌస్ లో కంటెస్టెంట్స్ పెర్ఫామెన్స్ కూడా అదే స్థాయిలో ఉంది. బిగ్ బాస్ 2 ప్రస్తుతం రెండవ వారం జరుగుతోంది. మొదటి వారంలో సంజన ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఎపిసోడ్స్ కి సంబందించిన ప్రోమోలని వదులుతూ నిర్వాహకులు షోపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. తాజగా వదిలిన ప్రోమో చూస్తే బిగ్ బాస్ లో రోజు రోజుకు మసాలా ఎక్కువవుతున్న సంగతి అర్థం అవుతుంది.

రణరంగంగా బిగ్ బాస్
శుక్రవారం ప్రదర్శించబోయే ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారబోతున్న సంగతి అర్థం అవుతుంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దూషణలు దిగుతున్నారు. సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఈ వివాదం వారి మధ్య ఎందుకు చెలరేగిందో నేడు తెలియనుంది.

నోరు మూసుకో తనీష్
తనీష్, నూతన్ నాయుడు మధ్య ఏదో విషయంలో చెలరేగిన వివాదం కట్టలు తెంచుకున్నట్లు తెలుస్తోంది. తనీష్ నోరు మూసుకో అని నూతన్ నాయుడు గట్టిగా అరుస్తున్నాడు. తనీష్ కూడా పూర్తిగా సహనం కోల్పోయి కనిపిస్తున్నాడు.

ఇంట్లో నేర్పించలేదా
హౌస్ కెప్టెన్ సామ్రాట్ కూడా కంటెస్టెంట్స్ పై విరుచుకుపడుతున్నారు. కనీసం తిన్న ప్లేటులు కూడా ఎవరూ కడగడం లేదని అరుస్తున్నాడు. కనీసం ఇది కూడా ఇంట్లో నేర్చుకోలేదా అని హౌస్ లో ఉన్న సభ్యులకు చురకలు అంటిస్తునాడు.

సిగ్గు లేకుండా
తేజస్వి కూడా సహనం కోల్పోయి కనిపిస్తోంది. ఇంత చెప్పినా సిగ్గు లేకుండా కూర్చుని తింటున్నారని అరుస్తోంది.

రసవత్తరంగా
ఇందంతా చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ నేడు రణరంగంగా మారబోతుందనే విషయం అర్థంఅవుతోంది. రోజురోజుకు మసాలా జత చేసి బిగ్ బాస్ ని రసవత్తరంగా మారుస్తున్నారు.


Click it and Unblock the Notifications











