ఇంకొక్క సారి ఆ మాట అంటే సహించను, నువ్వెవరు చెప్పడానికి.. బాబు, కౌశల్ మధ్య వార్!

Recommended Video

ఇంకొక్క సారి ఆ మాట అంటే సహించను, నువ్వెవరు చెప్పడానికి.. బాబు, కౌశల్ మధ్య వార్!

బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారుతోంది. పురుషులు, మహిళల మధ్య హోరాహోరీగా టాస్క్ లు జరుగుతున్నాయి. ఈ టాస్క్ లలో పురుషులు అవలీలగా విజయం సాధిస్తున్నారు. ఈ విషయంలోనే వివాదం మొదలైంది. ఇంటి సభ్యుల మధ్యే మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయి. కౌశల్ తన ఆలోచనా విధానం ప్రకారం గేమ్ ఆడడం బాబు గోగినేని, పూజకు నచ్చడం లేదు. బాబు పురుషుల టీంలో సభ్యులు అయినప్పటికీ మహిళలకు సపోర్ట్ చేస్తున్నారు. దీనికంతటికి కారణాన్ని ఆడియన్స్ విశ్లేషిస్తున్నారు. నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోని తాజగా విడుదల చేశారు.

 చాలా దారుణం

చాలా దారుణం

మహిళల ఆస్తి తీసుకుని వెళ్లడం దారుణమైన విషయం అని బాబు గోగినేని కౌశల్ తో వాదిస్తున్నాడు. టాస్క్ మొదలైన తరువాత కౌశల్ కొన్ని నాణేలని తనవద్దనే ఉంచుకున్నాడు. అవి తమకు కేటాయించిన నాణేలు అని పూజ వాదించిన సంగతి తెలిసిందే.

 వాళ్ళ ఆస్తి

వాళ్ళ ఆస్తి

ప్రోమోని గమనిస్తే ఈ వివాదం విషయంలో కౌశల్, బాబు మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది.అసలు కౌషల్ టీమ్ లోనే లేనట్లు అర్థం అని బాబు అన్నారు. మీరెవరు నాకు చెప్పడానికి అని కౌశల్ ప్రతిఘటిస్తున్నాడు. ఇంకోక్కసారి దారుణం అంటూ మాట్లాడితే సహించను అని కౌశల్ బాబుకు వార్నింగ్ ఇచ్చాడు. ఏంచేస్తావో మరి అంటూ బాబు కూడా కౌంటర్ ఇచ్చాడు.

 గట్టిగా అరుస్తూ

గట్టిగా అరుస్తూ

అసలు ఇది మహిళలు, పురుషుల మధ్య సరైన గేమ్ కాదని పూజ గట్టిగా అరుస్తోంది. ఒక్క నాణెం కూడా తమ వద్ద లేకుండా గేమ్ ఎలా ఆడాలని పూజ వాదిస్తోంది. ఈ వివాదం విషయంలో ఇతర మహిళలు గీత, దీప్తి, శ్యామల అభిప్రాయం వేరుగా ఉన్నట్లు అర్థం అవుతోంది. వారు పూజతో విభేదిస్తున్నారు.

 అందరూ వ్యతిరేకంగా

అందరూ వ్యతిరేకంగా

బాబు, కౌశల్ వివాదంలో మహిళలు కూడా బాబుకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. కౌశల్ దొంగతనం చేశాడని తామెవరం భావించడం లేదని దీప్తి చెబుతోంది. వీరి మధ్య మొదలైన ఈ పంచాయతీ ఏవిధంగా ముగిసిందో తెలియాలంటే నేడు జరగబోయే ఎపిసోడ్ చూడాల్సిందే.

బాబు ప్లాన్

ఈ గేమ్ మహిళలకు, పురుషులకు మధ్య జరుగుతోంది. కానీ బాబు మహిళలకు సపోర్ట్ చేస్తున్నాడు. దీనికి కారణం కౌశల్ ఖాతాలో క్రెడిట్ పోకుండా ఉండే ఎత్తుగడలో భాగంగానే అని ఆడియన్స్ భావిస్తున్నారు. మరో వైపు తనీష్ కూడా తెలివిగా కౌశల్ కు సాధ్యమైనంత దూరంగా ఉంటూ గేమ్ ఆడుతున్నాడు. ఈ వారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X