For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గీత ఫసక్' అంటూ బూతుల.. చీరలు కట్టుకున్న వారితో కూడా ఓటమి.. కౌశల్, బాబు మధ్య వార్!

    |

    గత ఏడాది బిగ్ బాస్ 2 షో సందర్భంగా కౌశల్, బాబు గోగినేని మధ్య ఎలాంటి వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా బాబు గోగినేని, కౌశల్ మధ్య వార్ కొనసాగింది. కౌశల్ ఆర్మీ పేరుతో ఇతరులపై జరుగుతున్న ట్రోలింగ్ ని బాబు గోగినేని తీవ్రంగా ఖండించారు. తన కుటుంబ సభ్యులని కూడా కొందరు ట్రోల్ చేశారని దీనికి ఎవరు సమాధానం చెబుతారని కౌశల్ ఆ సందర్భంలో బాబు గోగినేని విమర్శలని తిప్పికొట్టారు. ఇప్పుడు వీరిద్దరి రచ్చ ఆస్ట్రేలియాకు చేరింది.

    మెల్బోర్న్‌లో బిగ్‌బాస్‌ వార్

    మెల్బోర్న్‌లో బిగ్‌బాస్‌ వార్

    ఆస్ట్రేలియాలోని తెలుగు వారు మెల్బోర్న్ లో కౌశల్, బాబు గోగినేని మధ్య చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ లో తమకు ఎలా అవకాశం వచ్చింది. తామిద్దరి మధ్య చోటు చేసుకున్న విభేదాలు ఏంటి అనే విషయాలపై ఆసక్తికర చర్చ జరిగింది. కౌశల్ ఆర్మీ ముందుగా ప్లాన్ చేసుకున్న ఆర్మీ అని బాబు గోగినేని ముందునుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని బాబు మెల్బోర్న్ లో కూడా ప్రస్తావించారు. దీనితో కౌశల్, బాబు మధ్య మతాల యుద్ధం తారాస్థాయికి చేరింది.

    నా తర్వాత తేజస్వినే

    నా తర్వాత తేజస్వినే

    తనకున్న అనుభవంతో బిగ్ బాస్ లో కూడా చాలా మందికి తాను ఫ్రెంచ్ నేర్పించానని బాబు గోగినేని అన్నారు. దీనికి కౌశల్ కౌంటర్ ఇస్తూ.. తాను బిగ్ బోస్ కు ప్రెంచ్ నేర్చుకోవడానికి వెళ్లలేదని, గేమ్ ఆడి తనని తానూ ప్రూవ్ చేసుకోవడానికి వెళ్లానని కౌశల్ తెలిపాడు. బిగ్ బాస్ లో తాను కాకుండా విజేతగా నిలిచే అర్హత తేజస్వికి మాత్రమే ఉందని కౌశల్ తెలిపాడు. తేజస్వి ఉన్నన్ని రోజులు తనకు గట్టి పోటీ ఇచ్చిందని అన్నారు. ఇక హౌస్ లో తనని నూతన్ నాయుడు కొన్ని వారాల పాటు సపోర్ట్ చేశారని కౌశల్ తెలిపాడు. బిగ్ బాస్ 3కి తానే హోస్ట్ ని అంటూ చమత్కరించారు.

    అందరూ సెలెబ్రిటీలే

    అందరూ సెలెబ్రిటీలే

    బాబు గోగినేని మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఎంటర్ టైన్మెంట్ రంగం నుంచి వచ్చిన సెలెబ్రిటీలే. కానీ నేను ఒక్కరిని కూడా గుర్తుపట్టలేక పోయా. ఎందుకంటే నేను ఎంటర్ టైన్మెంట్ ని ఎక్కువగా పట్టించుకోను అని బాబు తెలిపారు. కానీ అక్కడున్నవారంతా తనని గుర్తుపట్టి పలకరించారని అన్నారు. కౌశల్ మాట్లాడుతూ.. నాలుగు రోజులుకూడా నా కుటుంబాన్ని విడచి ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది బిగ్ బాస్ కోసం 100 రోజులకు పైగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని అన్నారు.

    అలా జరిగింది

    అలా జరిగింది

    తన బిగ్ బాస్ ఎంట్రీ గురించి బాబు మాట్లాడుతూ.. తాను ఇంటర్నేషనల్ ఫిగర్ ని. అందుకే నన్ను బిగ్ బాస్ కోసం ఏరికోరి ఎంచుకున్నారని బాబు తెలిపారు. నేను బిగ్ బాస్ కి అప్లై చేయలేదు. వాళ్లే వచ్చి అడిగారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా బిగ్ బాస్ నుంచి నా కోసం ఒకరు వచ్చారు. బిగ్ బాస్ నుంచి వచ్చినట్లు ముందుగా నాకు చెప్పలేదు. బిగ్ బాస్ గురించి నా అభిప్రాయం అడిగారు.. అయితే పిచ్చోళ్లు వెళతారు లేకుంటే పిచ్చోళ్లుగా మారి బయటకు వస్తారు అదేనా అని అన్నాను అని బాబు తెలిపారు.

    వారం కూడా ఉండలేవు

    వారం కూడా ఉండలేవు

    బిగ్ బాస్ లో పాల్గొనమని నన్ను అడిగారు అని నా భార్యకు చెప్పా. నువ్వు అక్కడ ఒక వారం కూడా ఉండలేవు. నువ్వు ఒక పాట పాడితే ఆ బిగ్ బాస్ గాడే పారిపోతాడు అని నా భార్య చెప్పింది. నాకు డాన్సులు రావు, పాటలు రావు, ఎంటర్ టైన్మెంట్ తో ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా బిగ్ బాస్ కోసం నన్ను పిలిచారని బాబు తెలిపారు.

    చీరలు కట్టుకున్న వారితో

    చీరలు కట్టుకున్న వారితో

    కౌశల్ మరోమారు బాబుకి కౌంటర్ ఇచ్చాడు. బిగ్ బాస్ లో ఇంటర్నేషనల్ ఫిగర్స్ కూడా పాల్గొన్నారు. కానీ వాళ్ళు చీరలు కట్టుకున్న ఆడవారితో కూడా పరిగెత్తలేక ఓడిపోయారని కౌశల్ ఎద్దేవా చేశాడు. బిగ్ బాస్ లో నెగ్గుకురావాలంటే బుద్ది బలం, గుండె బలంతో పాటు పిక్క బలం కూడా అవసరం. బాబు గోగినేనికి బుద్ది బలం ఉంది కానీ పిక్క బలం లేదని కౌశల్ తెలిపాడు. తనని బిగ్ బాస్ కోసం ఎంపిక చేయడానికి కారణం.. తాను మోడలింగ్ లో సాధించిన విజయాలే అని కౌశల్ తెలిపాడు.

    'గీత ఫసక్' అంటూ బూతులు

    'గీత ఫసక్' అంటూ బూతులు

    బిగ్ బాస్ హౌస్ లో కౌశల్, గీత మాధురి మధ్య ఎక్కువగా పోటీ జరిగింది. కౌశల్ ఆర్మీ చేసిన ట్రోలింగ్ ని బాబు గోగినేని ప్రసవించడంతో చర్చా కార్యక్రమంలో వీరిద్దరి మధ్య మాటల తీవ్రత పెరిగింది. తనని వాడు,వీడు అంటూ అవమానకరంగా మాట్లాడారు అని బాబు గోగినేని ఆరోపించారు. కౌశల్ ఆర్మీని ముందుగా ప్లాన్ చేసుకుని కౌశల్ హౌస్ లోకి వచ్చాడు అని బాబు ఆరోపించారు.కౌశల్ ఆర్మీ నిర్వహించిన 2కె రన్ కార్యక్రమంలో గీత మాధురి ఫసక్ అంటూ బూతులు తిట్టారని బాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

    ఆడవారిని రేప్ చేసినా పర్వాలేదు తు.. తు..

    ఆడవారిని రేప్ చేసినా పర్వాలేదు తు.. తు..

    2కె రన్ మీ లాంటి వాళ్లందరికీ మా బలం ఎంతో నిరూపించుకోవడానికి చేసిందే అని కౌశల్ సమాధానం ఇచ్చారు. ఒక పథకం ప్రకారం డబ్బులతో మేనేజ్ చేసిన ఆర్మీ కౌశల్ ఆర్మీ అని బాబు ఆరోపించగా.. నిరూపించాలని కౌశల్ డిమాండ్ చేశాడు. ఆడవారిని రేప్ చేసినా పర్వాలేదు అని ట్రోల్ చేసిన ఆర్మీ అది.. తు..తు.. అది పైడ్ ఆర్మీ అయితే ఏంటి.. కాకపోతే ఏంటి అని బాబు గోగినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సూసైడ్ చేసుకునేవారు

    సూసైడ్ చేసుకునేవారు

    కౌశల్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో నా భార్యపై వచ్చిన ట్రోల్స్ ఇంకెవరిపైన అయినా వచ్చి ఉంటె సూసైడ్ చేసుకునే వారు అని కౌశల్ తెలిపారు. వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా కౌశల్ సతీమణి నీలిమ కూడా వేదికపైకి చేరుకొని బాబు గోగినేని ప్రశ్నించారు. అసలు బిగ్ బాస్ హౌస్ లో గెలుస్తాడో లేదో కూడా తెలియని వ్యక్తి ఎలా ఆర్మీని ఏర్పాటు చేసుకుని వెళతారు అని నీలిమ అన్నారు. బాబు గోగినేని మాట్లాడేముందు నిరూపించి, ఆధారాలు చూపించి మాట్లాడాలి అని నీలిమ అన్నారు.

    English summary
    War between Kaushal and Babu Gogineni at Melbourne
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X