Bigg Boss Telugu 7: షోలో ఊరోడు రచ్చ... భార్య పేరు లాగుతూ రెచ్చిపోయిన ప్రశాంత్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకూ ఆసక్తిగా సాగుతోంది. ఇక ఏడో వారం నామినేషన్స్ ప్రకియ నిన్న ప్రారంభం అయింది. ఇక ఈ వారం కూడా ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేసి రీజన్స్ చెప్పాలి. నామినేట్ చేసే వాళ్ల పేరు చెప్పి... దానితో పాటు రీజన్ చెప్పి... వారికి ఎదురుగా ఉన్న కుండను పగులకొట్టాలి. అయితే ఈ వారం ఆటగాళ్లు, పోటుగాళ్లు అనే తేడా లేకుండా అందరూ హౌస్ మేట్స్ గా ఉన్నారు. ఇక అందరూ నామినేషన్స్ లో పాల్గొనాలని బిగ్ బాస్ చెప్పుకువచ్చాడు.
అలా మొదటిగా పల్లవి ప్రశాంత్ నామినేషన్ చేయడానికి వచ్చాడు. అలా రాగానే ఆట సందీప్ పేరు చెప్పాడు. తన బెలూన్ పగులగొట్టినప్పుడు ఆట సందీప్ చెప్పిన కారణం... తనకు నచ్చలేదంటూ ప్రశాంత్.. ఆట సందీప్ ను నామినేట్ చేశాడు. హే పో అంటూ తనను తక్కువ చేసి మాట్లాడటం నచ్చలేదని కారణం చెప్పాడు. ఇక పల్లవి ప్రశాంత్ కాస్త ఓవర్ చేస్తూ మాట్లాడటంతో నీపై సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది కాస్త తగ్గించు అంటూ ఆట సందీప్ చెప్పుకువచ్చాడు. థ్యాంక్యూ అన్న అంటూ వెటకారంగా కుండబద్దలు కొట్టాడు.

ఇక ప్రశాంత్.. సందీప్ ను నామినేట్ చేశాడు. ప్రశాంత్ రెచ్చిపోయి మాట్లాడిన.. అంతగా పట్టించుకోలేదు సందీప్. మెచ్యూరిటీ లేదని నవ్వుకుని ఆపేసుకున్నాడు. ఇక సందీప్.. ప్రశాంత్ ను నామినేట్ చేసినప్పుడు మాత్రం రచ్చ రచ్చ అయింది. కెప్టెన్సీ రూమ్ గురించి కాసేపు గొడవపడ్డారు. కెప్టెన్ ఎలా ఉండాలో చెప్తున్నావ్... కానీ కెప్టెన్‌తో ఎలా మాట్లాడాలో తెలియదా? అంటూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. దీంతో సందీప్... మనం టెక్నికల్‌గా మాట్లాడుకుందామన్నాడు. దీంతో ప్రశాంత్ మాత్రం టెక్నికల్‌గా మాట్లాడతావో.. స్విమ్మింగ్ పూల్‌లో దూకి మాట్లాడు అంటూ అర్థం లేకుండా మాట్లాడాడు.
ఇక సందీప్... నేను మాట్లాడేటప్పుడు.. విను.. లేదంటే ఓవర్ ల్యాప్ వస్తాది అని చెప్పాడు. దాందో ఆ మాట అర్థం కాని ప్రశాంత్... నేను కాదు ఓవర్... నువ్వు చేస్తున్నావ్ అంటూ రెచ్చిపోయాడు. ఓవర్ అని నేను అనలేదురా బాబు.. ఓవర్ ల్యాప్ అని అన్నాను.. ఓవర్ ల్యాప్ అంటే మాట మీద మాట వస్తుంది అని అన్నాను.. వాడికి ఎవరైనా చెప్పండి ఓవర్ ల్యాప్ అంటూ సందీప్ చెప్పుకువచ్చాడు. ఇక క్యాప్టెన్సీలో ఫెయిల్ అయ్యావ్ అనే రీజన్ చెప్పి నామినేట్ చేశాడు సందీప్.
ఇక ఈ నామినేషన్స్ రైతు బిడ్డ కాస్త ఓవర్ గానే బిహేవ్ చేశాడు. బరాబర్ ఇలాగే మాట్లాడుతా అంటూ హద్దులు దాటేసి మరీ రైతు బిడ్డ ఇష్టం వచ్చినట్లు వాగేశాడు. ఇక ఈ ప్రాసెస్ లో ఊరోడు అని తనను సందీప్ అన్నాడు అంటూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. దాంతో సందీప్.. ఆ మాట నేను అన్నానా? అని అడగడంతో.. అన్నావ్ కదా.. అని అన్నాడు. ఇక దీనిపై షోలో పెద్ద రచ్చే జరిగింది. నీ పొలం మీద ఒట్టేసి చెప్పు... నేను ఆ మాట అన్నానా.. అంటూ సందీప్ ఎమోషనల్ అయ్యాడు.
అంతే కాదు... సందీప్ డ్యాన్స్ మీద... నటరాజ్ మీద ఒట్టేసి చెప్పాడు. నేను ఎప్పుడూ ఆ మాట అనలేదని... మరి నువ్వు తినే అన్నం మీద.. నువ్వు పండించే పొలం మీద ఒట్టేసి చెప్పు అని సందీప్ అన్నాడు. ఇక అప్పుడు రెచ్చిపోయిన ప్రశాంత్... రైతు ఎవరైనా పొలం మీద ఒట్టేస్తారా అంటూ సర్ది చెప్పుకువచ్చాడు. ఊరోడు అన్నాను అన్నానా అంటూ ప్రశాంత్ మాట మార్చడంతో.. శివాజీ ఎంటర్ అయి... అవును అన్నావ్ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇక సందీప్ భార్య పేరు లాగుతూ కూడా ప్రశాంత్ రెచ్చిపోయాడు. జ్యోతి.. ఊరి ఆమె.. సిటీ కల్చర్ తెలుసు అని అన్నావ్ కదా అంటూ మాట మార్చేశాడు. దీంతో సందీప్.. నా భార్య పేరు ఎత్తకు అంటూ చెప్పుకువచ్చాడు. పేర్లు ఎత్తకుండా నీకు ఆన్సర్ ఎలా చెప్పాలంటూ ప్రశాంత్ పిచ్చిగా ప్రవర్తించాడు. నీలో నిజాయితీ లేదు కాబట్టి.. ఒట్టు వేయలేదు.. నాలో నిజాయితీ ఉంది కాబట్టే ఒట్టు వేశాను' అని అన్నాడు సందీప్. ఇలా మొత్తానికి నామినేషన్స్ లో వీరి రచ్చ మామూలుగా లేదు.


Click it and Unblock the Notifications











