Don't Miss!
- News కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
నాగబాబు మాటలకు నోరెళ్లబెట్టిన రోజా.. నువ్వా నేనా అంటూ ఫుల్లుగా గొడవ.. హాట్ టాపిక్
బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో అనగానే ముందుగా గుర్తొచ్చేది నాగబాబు, రోజా. ఆ ఇద్దరి నవ్వులే ఈ కామెడీ షోకి కితకితలు. ఏడేళ్లుగా ఈ నవ్వులు పడిపోతూనే ఉన్నారు బుల్లితెర ఆడియన్స్. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరి జబర్దస్త్ ప్రయాణం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు రోజా, నాగబాబు. ఈ నేపథ్యంలో వీరి మధ్య జరిగిన గొడవ తాలూకు వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య వచ్చిన గొడవేంటి? ఈ వీడియో ఎక్కడిది? వివరాల్లోకి పోతే..
గొడవకు దిగిన నాగబాబు, రోజా
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హంగామా చేస్తోంది. ఆ వీడియోలో నాగబాబు, రోజా గొడవ పడుతూ కనిపించడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఇది నిజమైన గొడవ కాదులెండి. ఎప్పటిలాగే బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచడంలో భాగంగా జరిగిన గొడవ. 'ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు' అనే ప్రోగ్రాంలో నువ్వా.. నేనా? అంటూ గొడవకు దిగారు నాగబాబు, రోజా.
ఎప్పటిలాగే ఈ సారి కూడా
ప్రతీ పండగకు బుల్లితెరపై ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా వినోదం పంచుతూ ఖుషీ చేస్తున్న ఈ స్టార్స్.. ఎప్పటిలాగే ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ‘ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు' అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో రోజా, నాగబాబు గొడవ పడడాన్ని ప్రధానాంశంగా తీసుకున్నారు.
అసలు గొడవ అదే.. రోజా, నాగబాబు మాటల యుద్ధం
నా నవ్వు బాగుంటుందా.. లేక నీ నవ్వు బాగుంటుందా అంటూ నాగబాబు, రోజాల మధ్య జరుగుతున్న వార్ ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇచ్చింది. నవ్వుల యుద్ధంలో భాగంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు వేసుకున్న పంచులు అబ్బో! అనిపించాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ ఒకరిని మించి ఒకరు రెచ్చిపోయి పర్ఫార్మ్ చేశారు.
రోజా అంటే నవ్వు కాదు పువ్వు
నా నవ్వు ఉంటే చాలు షో హిట్ అయినట్లే.. రోజా అంటే నవ్వు.. నవ్వు అంటే రోజా.. అని రోజా అనడం, దానికి బదులిస్తూ 'ఒకసారి జనాన్ని అడుగు నవ్వుల నాగబాబు అంటారో లేక.. నవ్వుల రోజా అంటారో!. అయినా.. రోజా అంటే నవ్వు కాదు పువ్వు. వెళ్లి చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్లను వెళ్లి చెప్పు నీ నవ్వు బాగుంటుందని' అని నాగబాబు పంచ్ వేశారు. దీంతో వెంటనే నోరెళ్లబెట్టడం రోజా వంతైంది. ఇలా మొత్తానికి ఎంతో రసవత్తరంగా సాగింది ఈ షో.
సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర కూడా
వినాయక చవితి సందర్బంగా ప్రసారమైన ఈ షోలో నాగబాబు, రోజాల ఫైట్‌తో పాటు సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, వర్షిణి, యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ హంగామా కూడా బుల్లితెర ఆడియన్స్ లో జోష్ నింపింది.