వెరీ ఇంట్రెస్టింగ్: అనసూయకు రోజాకు మధ్య మొదలైన వార్.. ఆ చానెల్ చేసిన పనే కారణం.!

By Manoj

బుల్లితెర చరిత్రలోనే తన అందంతో, అద్భుతమైన టైమింగ్‌తో భారీ క్రేజ్ సంపాదించుకున్న యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ప్రస్తుతం ఈమె వన్ ఆఫ్ ది బెస్ట్ యాంకర్‌గా వెలుగొందుతోంది. మరోవైపు, తన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించి, కొన్నేళ్లుగా బుల్లితెరపైనా రాణిస్తోంది సీనియర్ హీరోయిన్ రోజా. తమ తమ రంగాల్లో దూసుకుపోతోన్న ఈ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. ఇన్ని రోజులు కలిసి పని చేసిన ఈ ఇద్దరూ ఆ విషయంలో పోటీ పడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే....

జబర్ధస్త్ షో కలిపింది ఇద్దరిని

జబర్ధస్త్ షో కలిపింది ఇద్దరిని

బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రోగ్రామ్‌లలో ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ ఒకటి. దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోన్న ఈ షోకు అనసూయ భరద్వాజ్ యాంకర్‌గా చేస్తుండగా.. సీనియర్ హీరోయిన్ రోజా జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఈ కామెడీ షో ద్వారా వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగిపోయిందని చెప్పవచ్చు.

దాని వల్ల ఇద్దరూ ఫుల్ బిజీ

దాని వల్ల ఇద్దరూ ఫుల్ బిజీ

రోజా, అనసూయ ఇద్దరూ జబర్ధస్త్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. అందుకే వీళ్ల మొదటి చాయిస్ ఈ షోకే ఇస్తున్నారు. అదే సమయంలో వేరే చానెళ్లలో ప్రసారం అవుతోన్న మరికొన్ని ప్రొగ్రామ్‌లకు పని చేస్తున్నారు. దీంతో ఇద్దరూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. టీవీ రంగంలోనే కాదు.. ఇద్దరూ సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు.

ఇద్దరి మధ్య మొదలైన వార్

ఇద్దరి మధ్య మొదలైన వార్

జబర్ధస్త్‌లో కలిసి పని చేస్తున్న ఈ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. వార్ అంటే తిట్టుకోవడమో.. కొట్టుకోవడమో.. ఒకరిపై ఒకరు కాలు దువ్వుకోవడమో కాదు.. ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం కాబోతున్న రెండు షోలకు ఈ ఇద్దరూ వేరు వేరుగా హోస్టింగ్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు షోలలో దేనికి ఎక్కువ రేటింగ్ వస్తుందన్న దానిపై ఇద్దరి మధ్య పోటీ నెలకొంది.

అనసూయ ఇలా మొదలు పెట్టింది

ప్రముఖ చానెల్ తల్లి, భార్య గురించి చెప్పుకునే సరికొత్త ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ‘తల్లా పెళ్లామా' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ కార్యక్రమానికి అనసూయ హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఇందులో బుల్లితెరపై సందడి చేస్తున్న సెలెబ్రిటీలు రాబోతున్నారు. మొదటి ఎపిసోడ్‌కు ప్రముఖ యాంకర్ రవి.. తన తల్లి, భార్యతో కలిసి వచ్చాడు. ఆ ప్రోమో ఇప్పటికే విడుదలైంది.

Recommended Video

Anchor Anasuya Bharadwaj Strong Warning || మర్యాదగా కామెంట్స్ డిలీట్ చెయ్యండి..! | Filmibeat Telugu

దద్దరిల్లిపోవాల్సిందే అంటున్న రోజా

తల్లి గొప్పదనాన్ని చాటి చెప్పుకునే మరో ప్రోగ్రామ్ కూడా ఆ చానెల్‌లో రాబోతుంది. ‘అమ్మ సరిలేరు నీకెవ్వరు' అనే పేరుతో రాబోతున్న ఈ కార్యక్రమానికి రోజా హోస్ట్‌గా చేస్తున్నారు. ఇందులో కూడా సెలెబ్రిటీలు సందడి చేయనున్నారు. మొదటి ఎపిసోడ్‌లో జబర్ధస్త్‌లో పని చేస్తున్న పిల్లలు రాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X