నోరు జారిన శ్రీముఖి.. మీలా అలవాటు లేదంటూ కుమిలి కుమిలి ఏడ్చిన హిమజ.. రెండో రోజే గొడవ స్టార్ట్

Recommended Video

Bigg Boss Telugu 3 : Day 2 Started With Conflicts Between Srimukhi And Himaja

'బిగ్ బాస్'.. కాంట్రవర్సీలకు పెట్టింది పేరు.. అది బయట అయినా.. హౌస్‌లో అయినా సరే. ఇప్పటికే తెలుగులో రెండు సీజన్లలో ఇలాంటివి మనం చూశాం. ఒకవైపు.. షోకు ఎంపిక చేసే విషయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు.. వారికి ఓ దర్శకుడు మద్దతు.. వీళ్లందరికీ ఓయూ విద్యార్థులు బాసటగా నిలివడం వంటి సంఘటనలతో 'బిగ్ బాస్'ను నిషేదించాలన్న డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం మూడో సీజన్ మొదలైంది. మొదటి రోజే ట్విస్టులతో నడిచిన ఈ షోలో రెండో రోజు గొడవలు మొదలయ్యాయి.

నామినేషన్ నుంచి తప్పుకోవడం కోసం..

నామినేషన్ నుంచి తప్పుకోవడం కోసం..

'బిగ్ బాస్' మొదటి రోజే ఆరుగురు సభ్యులు నామినేషన్ అయిన విషయం తెలిసింది. అయితే, మానిటర్ హేమను మెప్పించే విధంగా తమ గురించి తాము చెప్పుకుని, మరొకరిని తమ బదులు మరొకరిని నామినేట్ చేయొచ్చని బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ అవకాశం ఐదుగురికే ఉందని చెప్పాడు. ఇందులో భాగంగానే ఐదుగురు సభ్యులు మరో ఐదుగురిని నామినేట్ చేశారు.

ఇద్దరు సేవ్.. ఇద్దరు బుక్

ఇద్దరు సేవ్.. ఇద్దరు బుక్

మొదటిగా రాహుల్ తనకి బదులుగా నామినేట్ చేయడానికి శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. కానీ, అతడి కారణాలు నచ్చక హేమ.. రాహుల్‌నే నామినేట్ చేశారు. తర్వాత వరుణ్ సందేశ్.. పునర్నవిని ఎంపిక చేసుకున్నాడు. దీనికి హేమ కూడా అంగీకరించింది. అనంతరం వితిక.. అషు రెడ్డిని చేసినా లాభం లేకుండా పోయింది. తర్వాత శ్రీముఖి.. హిమజను చేసింది. దీనికి హేమ ఒప్పుకుంది. అలాగే, జాఫర్.. మహేశ్‌ను చేయగా హేమ ఒప్పుకోలేదు.

శ్రీముఖి నోరు జారింది

శ్రీముఖి నోరు జారింది

శ్రీముఖి వంతు వచ్చిన సమయంలో ఆమె.. ''నేను హిమజను నామినేట్ చేస్తున్నా.. ఆమె నా ఫ్రెండే. ఇద్దరం కలిసి స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నాం. అయినప్పటికీ, 'బిగ్ బాస్' ఇచ్చిన బోర్డు మీద ఒక రెడ్ కనిపించింది అది ఒక కారణం.. రెండోది ఆహె లైఫ్‌ను సీరియస్‌గా తీసుకోదు అనిపించింది'' అని చెప్పుకొచ్చింది.

ఏడ్చిన హిమజ

ఏడ్చిన హిమజ

శ్రీముఖి అన్న మాటలకు హిమజ వివరణ ఇచ్చే క్రమంలో ఏడ్చేసింది. ''లైఫ్‌ను సీరియస్‌గా తీసుకోనన్న విషయం నీకు తెలుసా? నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసా? అసలు నా గురించి ఏం తెలుసని అలా అన్నావు'' అని ప్రశ్నిస్తూ ఏడ్చింది. దీనికి వెంటనే శ్రీముఖి సారీ చెప్పేసింది. అయినా.. ఈ గొడవ ఆగలేదు.

నిందలు పడడం నాకు ఇష్టం లేదు

నిందలు పడడం నాకు ఇష్టం లేదు

శ్రీముఖి చెప్పిన కారణాలు నచ్చడంతో మానిటర్ హేమ.. ఆమె బదులు హిజను నామినేట్ చేసింది. ఆ సమయంలో హేమకు హిమజకు మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు హిమజ ''నిందలు పడడం మీకు ఇష్టమేమే.. నాకు ఇష్టం లేదు'' అంటూ ఆమెపై సీరియస్ అయింది. తర్వాత హిమజను 'బిగ్ బాస్' పిలిచి సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోండి అని సలహా ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X