బిగ్ బాస్2: ఆవిడ బూతులు మాట్లాడినప్పుడు మీరేం చేశారు.. నిలదీసిన కౌశల్!
Recommended Video

ఒకే ఇంట్లో ఉన్న సభ్యులు ఇపుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. టైటిల్ వేట దగ్గర పడుతుండడంతో ఎవరూ తగ్గడం లేదు. కౌశల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడనే అభిప్రాయం బయట మద్దత్తు దారులలో ఉండగా.. మిగిలిన ఇంటి సభ్యులు మాత్రం కౌశల్ సింపతీ కోసం ప్రయత్నిస్తున్నాడని నిందిస్తున్నారు. కొన్ని రోజులుగా హౌస్ లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా కౌశల్, గీత మాధురి మధ్య మాటల యుద్ధం ముదిరినట్లు తాజాగా విడుదుల చేసినప్రోమో ద్వారా అర్థం అవుతోంది.

ఆ ముగ్గురి మధ్య
కౌశల్ ని వ్యతిరేకిస్తున్న వారిలో గీత మాధురి, తనీష్ ప్రధానంగా ఉంటారు. చాలా కాలంగా కౌశల్ తో విభేదిస్తూ వస్తున్నది వీరే. ప్రతి విషయంలోనూ కౌశల్ తో వాగ్వాదం జరుగుతూనే ఉంది.

రోజుకొక మాట
నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో విడుదుల చేశారు. కౌశల్, గీతామాధురి మధ్య మాటల యుద్ధం నేటి ఎపిసోడ్ లో హైలైట్ కానున్నట్లు అర్థం అవుతోంది. మీరు రోజుకొక మాట మాట్లాడితే కష్టం అని కౌశల్ తో గీత అంటోంది.

ఎదిరించిన గీత
నన్నుఆడవద్దు అని చెప్పడానికి మీరు ఎవరు. ఆయన సింపతీ కోసం నన్ను తోసేస్తున్నారు వంటి మాటలు గీత నుంచి వినిపిస్తున్నాయి. ఆ తరువాత కౌశల్ అన్న మాటతో గీత మాధురితో సహా ఇంటి సభ్యులంతా అవాక్కయ్యారు.

నిలదీసిన కౌశల్
ఆపిల్ టాస్క్ లో ఆవిడ బూతులు తిడుతుంటే మీరు పక్కనే ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేశారు. వింటున్నారా అంటూ కౌశల్ గీత మాధురిని ప్రశ్నించాడు. ఆ మాటతో గీత మాధురి అవాక్కైపోయింది.

కెప్టెన్‌గా
వీరి మధ్య అంత పెద్ద గొడవ జరుగుతుంటే కెప్టెన్ గా దీప్తి వారించే ప్రయత్నం చేసింది. రోల్ రైడ పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. తనీష్ కూడా కలుగజేసుకుని కౌశల్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసినట్లు అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











