Brahmamudi Weekly Roundup: కళ్యాణ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కనకం.. మాయని వెతికే ప్రయత్నంలో రాజ్ దంపతులు!

తన ఆరోగ్యం కోసం ప్రకాష్ పూజ చేయాలనుకుంటే అందుకు అంగీకరించదు అపర్ణ నా కొడుకు కోడలు చేస్తారంటూ రాజ్ వాళ్ళని కూర్చోబెడుతుంది. భార్యతో తన పరిస్థితి చెప్పి క్షమాపణ అడుగుతాడు సుభాష్. మరోవైపు మాయకి వెతికే ప్రయత్నంలో అప్పుకి కావ్య కి తోడవుతాడు కళ్యాణ్. మాయని వెతికే ప్రయత్నంలో రుద్రాణి ప్లాన్ కి బలై మీడియా ముందు దోషులుగా నిలబడతారు అప్పు,కళ్యాణ్. ఇంట్లో రచ్చ రచ్చ చేస్తుంది అనామిక. అయితే అది నిజం కాదని మాయని వెతికే ప్రయత్నంలో ఇదంతా జరిగిందని చెప్తుంది కావ్య. ఆ తర్వాత భర్త సహాయంతో అసలు మాయని తీసుకువచ్చి నిజం చెప్పి మామగారి నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుంది. జూన్ 17వ తేదీ నుంచి జూన్ 22 వ తేదీ వరకు.. 438 ఎపిసోడ్ నుంచి 443 వరకు ఏం జరిగిందంటే?

జూన్ 17వ తేదీ 438 ఎపిసోడ్‌లో
భార్య ఆరోగ్యం కోసం పూజ చేయాలనుకుంటాడు ప్రకాష్. కానీ అందుకు అంగీకరించదు అపర్ణ. ఆ స్థానంలో తన కొడుకు కోడల్ని కూర్చోబెట్టి పూజ చేయిస్తుంది. పూజ కోసం వచ్చిన కావ్య కుటుంబ సభ్యులని ఆదరంగా ఆహ్వానిస్తుంది అపర్ణ. ఆమెలో వచ్చిన మార్పుకి ఆనందపడుతుంది కనకం. మరోవైపు అనామిక తల్లిదండ్రులు కావ్య ని చూసావా అత్తగారిని ఎలా బుట్టలో వేసుకుందో నువ్వు కూడా నీ భర్తని అలాగే బుట్టలో వేసుకొని నీ ఆస్తి నువ్వు రాబట్టుకోవాలి సలహాలు ఇస్తారు. అపర్ణ ప్రవర్తనకి షాక్ లో ఉండిపోతుంది రుద్రాణి. ఎలా అయినా అపర్ణకి కావ్య మీద మనసు విరిగిపోయేలాగా చేయాలి అని కొడుకుతో చెప్తుంది. తర్వాత కొడుకు కోడలు సలహా మీద భార్యకి సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాడు ప్రకాష్.

Weekly Roundup of Brahmamudi Telugu Serial from june17th to June 22nd episode Story

జూన్ 18 వ తేదీ 439 ఎపిసోడ్‌లో
తనని అసహ్యించుకుంటున్న భార్యకి సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాడు ప్రకాష్. నేను తప్పు చేయలేదు అని చెప్పడం లేదు అందుకే క్షమించమని అడగటం లేదు కోపం తీరేవరకు శిక్షించు కానీ ఇలా మౌనంగా ఉండకు అని బ్రతిమిలాడుకుంటాడు కానీ అపర్ణ భర్తని క్షమించలేక పోతుంది. మరోవైపు మాయా కి స్పృహ వచ్చింది అని చెప్పటానికి అప్పు కావ్య ఇంటికి వస్తుంది వాళ్ల మాటలు విన్న కళ్యాణ్ వాళ్లతో పాటు మాయ దగ్గరికి వెళ్తాడు. మెలకువ వచ్చిందని తెలుసుకున్న రుద్రాణి ఆమెని కిడ్నాప్ చేయిస్తుంది. అప్పుడే హాస్పిటల్ కి వచ్చిన కావ్య వాళ్ళకి మాయ కిడ్నాప్ అయింది అని తెలుసుకుని ఆమెని వెతికే ప్రయత్నం చేస్తారు కళ్యాణ్ వాళ్ళు. ఒక కారులో కావ్య, మరొక కారులో కళ్యాణ్,అప్పు బయలుదేరుతారు.మరోవైపు తల్లికి సేవ చేస్తూ తండ్రిని క్షమించవచ్చు కదా అని తల్లి మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు రాజ్.

జూన్ 19వ తేదీ 440 ఎపిసోడ్‌లో
తల్లి మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు రాజ్ కానీ అపర్ణ భర్తని క్షమించలేక పోతుంది. ఈ జీవితంలో భర్త అనే అధ్యాయం ముగిసిపోయింది అని బాధగా చెప్తుంది. మరోవైపు కావ్య ఫాలో అవుతున్న కారులో మాయ లేదని తెలుసుకుంటుంది కావ్య. అదే విషయం అప్పుకి చెప్పి మీరు ఎక్కడికి వెళ్తున్నారో లొకేషన్ షేర్ చేయండి అంటుంది. మరోవైపు తల్లి చెప్పిన ప్లాన్ అమలు చేసి ఆ విషయం తల్లికి చెప్తాడు రాహుల్. అప్పుడు రుద్రాణి అనామిక దగ్గరికి వెళ్లి నీ భర్త అప్పు తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు వెళ్తే పట్టుకోవచ్చు అంటుంది. ఆవేశంతో అత్తగారిని తీసుకొని బయలుదేరుతుంది అనామిక. విషయం తెలియని అప్పు కళ్యాణ్ మాయని వెతకడానికి ఒక రూమ్ కి వెళ్ళేసరికి బయట డోర్ లాక్ చేసేస్తారు రాహుల్ మనుషులు. మీడియా వచ్చే సమయానికి డోర్ ఓపెన్ చేస్తారు. మీడియా అప్పు కళ్యాణ్ తప్పు చేస్తున్నారని వార్తలు ప్రచారం చేస్తుంది. అదే సమయంలో ధాన్యలక్ష్మి అనామిక కూడా అక్కడికి వస్తారు. విషయం తెలిసిన కనకం దంపతులు చాలా బాధపడతారు.

Weekly Roundup of Brahmamudi Telugu Serial from june17th to June 22nd episode Story

జూన్20 వ తేదీ 441 ఎపిసోడ్‌లో
తనకి న్యాయం చేయమని ఇంట్లో అందరి ముందు పంచాయతీ పెడుతుంది అనామిక. అప్పు అలాంటిది కాదని చెల్లెల్ని వెనకేసుకొస్తుంది స్వప్న. కళ్యాణ్ అలాంటివాడు కాదు అని ప్రకాష్ కొడుకుని వెనకేసుకొస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కనకం నా కూతురు మీద నిందలు వేస్తే ఊరుకోను, నాకు నా కూతురు మీదే కాదు నీ భర్త మీద కూడా నమ్మకం ఉంది అంటుంది. నాకు కూడా వాళ్ళిద్దరి మీద నమ్మకం ఉంది కానీ వాళ్ళు ఆ పరిస్థితులలో ఎందుకు ఉన్నారో చెప్పాలి కదా అంటాడు రాజ్. వాళ్ళిద్దరూ నిజం చెప్పారు కానీ కావ్య నిజం చెప్తుంది. నీ కట్టు కథలు అని కొట్టి పారేస్తుంది అనామిక. ఇకమీదట అప్పు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు అంటుంది నువ్వు చెప్పటం కాదు నేనే చెప్తున్నాను కళ్యాణ్ మళ్ళీ ఫ్రెండ్ షిప్ అని మా ఇంటికి వస్తే మొహం మీదే తలుపు వేసేస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుంది కనకం.

జూన్ 21 వ తేదీ 442 ఎపిసోడ్‌లో
మరోవైపు ఇంట్లో ఇంత జరుగుతున్నా తను మాట్లాడలేని పరిస్థితులలో ఉంచినందుకు భర్త మీద కోప్పడుతుంది అపర్ణ. మరోవైపు ఆ మాయ జోలికి ఎందుకు వెళ్లావు అని రాజ్ కావ్య అని మందలిస్తాడు కానీ కావ్య అసలు మాయ దొరికిందని జరిగిందంతా రాజ్ తో చెపుతుంది, మాయని వెతికే పనిలో తనకి తోడుగా నిలబడమని అడుగుతుంది. అందుకు సరే అంటాడు రాజ్. మరోవైపు కూతురి భవిష్యత్తు కోసం బాధపడుతూ ఉంటుంది కనకం. ఆమె భవిష్యత్తుకి ఏమి భయం లేదు నేను భరోసా అని భార్యకి ధైర్యం చెప్తాడు కృష్ణమూర్తి. మరోవైపు గదిలోకి వచ్చిన భర్తతో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది అనామిక కానీ అందుకు ఇష్టపడని కళ్యాణ్ మమ్మల్ని ఎవరో ప్రీ ప్లాన్డ్ గా ఇందులో ఇరికించారు, ఇలా చేసింది ఎవరు ఎందుకు చేశారు అనే విషయాలని బయట పెడతాను అంటాడు.

జూన్ 22వ తేదీ 443 ఎపిసోడ్‌లో
మాయని వెతకడం కోసం బయలుదేరుతారు రాజ్ దంపతులు. దారిలో దుండగుల నుంచి తప్పించుకొని పరిగెడుతున్న మాయని రక్షించి ఇంటికి తీసుకు వస్తారు. మాయ చేత ఇంట్లో అందరికీ నిజం చెప్పిస్తారు, అన్నయ్య, కావ్య, రాజ్ అందరూ ఒకటైపోయారు మరో కొత్త నాటకం మొదలుపెట్టారు అంటుంది రుద్రాణి. ఆమెని కుటుంబ సభ్యులందరూ చివాట్లు పెడతారు. మాయ మీద ప్రకాష్ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే క్షమించి వదిలేయమంటుంది ఇందిరా దేవి. మాయ అక్కడనుంచి వెళ్లిపోయిన తరువాత బిడ్డ సంగతి ఏమిటి అని అడుగుతుంది రుద్రాణి. వాడితో మాకు బంధం ఏర్పడిపోయింది వాడిని అనాధాశ్రమంలో వదిలేయలేం, మేం పెంచుకుంటాము అంటారు రాజ్ దంపతులు.వాళ్ళ మంచితనాన్ని మెచ్చుకుంటుంది ఇందిరా దేవి . తరువాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X