బిగ్ బాస్ ఎలిమినేషన్: ఒక్క ఎపిసోడ్‌తో మారిన సీను.. డేంజర్ జోన్‌లో ఊహించని కంటెస్టెంట్
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రొమాన్స్, లవ్, ఏడుపులు సహా పలు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన రచ్చ ఊహించని కంటెస్టెంట్‌ను డేంజర్ జోన్‌లో పడేసింది.

మళ్లీ ఫిజికల్ టాస్కే
ఈ వారం వీక్లీ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కు ‘దొంగలు దోచిన నగరం' అనే చెత్త టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దొంగలు ముఠా, నగర వాసులు అని కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టాడు బిగ్ బాస్. ఈ సారి కూడా ఫిజికల్ టాస్కే ఇవ్వడంతో హౌస్‌మేట్స్‌ను పిలిచి మరీ గాయాలు కాకుండా ఆడమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత టాస్క్ మధ్యలో కూడా హెచ్చరించాడు.

హింసాత్మకంగానే జరిగింది
ఈ టాస్క్ తొలి రోజు హింసాత్మకంగానే సాగింది. మొదట్లో శ్రీముఖి - పునర్నవి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. అంతేకాదు, వితిక కూడా మరో కంటెస్టెంట్‌పై విరుచుకు పడింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ కలుగజేసుకుని వితికను ఆపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక, రాహుల్, అలీ రేజా స్విమ్మింగ్ పూల్‌లో ఒకరినొకరు నెట్టేసుకున్నారు.

రెచ్చిపోయిన అలీ రేజా
ఒకరిని మరొకరు నెట్టుకోవడం, మీద పడిపోవడం, గొడవలు పెట్టుకోవడం వంటి వాటితో ఈ టాస్క్ రణరంగంగా సాగింది. ముఖ్యంగా ఇందులో అలీ రేజా రెచ్చిపోయి ఆడాడు. పునర్నవితో గొడవ పడడం.. వరుణ్ సందేశ్‌ను మెడ పట్టుకుని లాగడం.. రాహుల్‌తో వాగ్వాదం.. చివరకు రవిపై చేయి చేసుకోవడం వంటి వాటితో అతడు టాస్క్ మొత్తంలో చర్చనీయాంశం అయ్యాడు.

రవితో ప్రవర్తనపై విమర్శలు
ఈ టాస్క్‌లో అలీ రేజా ఎంతో కోపంగా కనిపించాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడైన రవితో దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత చెత్తగా ఆడిన వాళ్ల పేర్లు చెప్పమన్నప్పుడు రవి పేరే చెప్పాడు. దీంతో రవి జైలుకు వెళ్లాడు. ఇక, అప్పటి నుంచి అలీ రేజాపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని రవి అభిమానులు ఏకి పారేస్తున్నారు.

డేంజర్ జోన్‌లో పడిపోయాడు
మొదటి సారి ఎలిమినేషన్‌లో ఉన్నానన్న ప్రస్టేషనో ఏమో గానీ అలీ రేజా ఈ టాస్క్‌లో క్రూరంగా ప్రవర్తించాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సారి ఓటింగ్‌లో అతడికి వ్యతిరేకంగా ఓట్లు పోలవుతున్నాయి. దీంతో అలీ రేజా డేంజర్ జోన్‌లో పడిపోయినట్లు కొన్ని సైట్స్ చూపిస్తున్నాయి. అయితే, ఎలిమినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఏం జరిగినా ఆశ్చర్యమే.


Click it and Unblock the Notifications











