Naga Panchami: మోక్ష, పంచమిలకు మరోసారి శోభనం.. ఈసారి కార్యం కచ్చితమే.. మరి మోక్ష ప్రాణాలు!

Naga Panchami November 28th Episode: నాగ పంచమి పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. అదిరిపోటే ట్విస్ట్ లతో అంతకు మించినఎమోషన్స్ పండించడంలో సీరియల్ నిర్వాహకులు సఫలం అవుతున్నారు. ముఖ్యంగా పెళ్లి జరిగి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు మోక్ష, పంచమిలు శారీరకంగా కలవలేదు. అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు శోభనం ఏర్పాటు చేసిన కార్యం మాత్రం జరగలేదు. కానీ వీరి పెళ్లి రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫస్ట్ నైట్ మాత్రం కచ్చితంగా జరగబోతున్నట్లు అర్థం అవుతుంది. పంచమిని ఎలాగైనా సరే తల్లిని చేసి.. శాశ్వతంగా మనిషిలా ఉంచాలని.. మోక్ష ప్రాణాలకు తెగిస్తున్నాడు.

పంచమితో కలిస్తే తన ప్రాణం పోతుందని తెలిసినా ఏమాత్రం పట్టించుకోకుండా పంతంగా ముందుకు వెళ్తున్నాడు. అయితే అందుకు ఒప్పుకోని పంచమి తానే పాము అని మోక్షతో చెప్పేస్తుంది. తాను నాగ కన్యను అని తనతో శారీరకంగా కలిస్తే.. కచ్చితంగా మోక్ష ప్రాణాలు పోతాయని వివరిస్తుంది. అయితే అదంతా విన్న మోక్ష ఈ విషయం తనకు తెలుసని చెబుతాడు. నువ్వు కాటేసి ఎప్పుడో చంపేయడం కంటే తాను ఇలా చనిపోవడమే బెటర్ అని తాను ప్రాణాలు కోల్పోయినా.. తమకు పుట్టే బిడ్డలో తన ప్రతిరూపాన్ని చూసుకుంటూ హాయిగా బతకాలని పంచమికి చెబుతాడు. ఆమెను ఒప్పించి మరీ ఆమెకు దగ్గర అవుతాడు.

What Happend After Moksha And Panchami First Night on November 28th Episode Number 212 in Naga Panchami Telugu Serial

ప్రతీసారి వీరి శోభనం జరగకుండానే అవుతోంది. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సుబ్బు సహకారం కూడా ఉంటుందని తెలుస్తోంది. కానీ పంచమితో శారీరకంగా కలిసిన తర్వాత.. మోక్ష ప్రాణాలతో ఉంటాడా లేదా అనేది మాత్రం తెలియట్లేదు. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూస్తే మోక్ష ప్రాణాలు దక్కుతాయా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ జరగ్గా.. నిన్నటి ఎపిసోడ్ లోనూ చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి.

ముఖ్యంగా మోక్ష.. పంచమిని తాను ఉన్న లేకపోయినా.. తనను చూసుకున్నట్లుగానే చూసుకోవాలంటూ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అప్పుడే తన ఆత్మ అయినా సంతోషంగా ఉంటుందని అంటాడు. వారందరూ ఏడుస్తున్నా అలా ఉండకండి అని చెబుతూనే కనిపిస్తాడు. ఇక ఆ తర్వాత కరాళీ మహా మాయావిని ఆవాహన చేసుకొని మోక్ష, పంచమిల శోభనాన్ని క్యాన్సిల్ అయ్యేలా చేయాలని చెబుతుంది. అది విన్న మహా మాయవి జ్వాలలో ఆవాహనం అయి వీరి శోభనం జరగకూడదంటూ ఫైర్ అవుతుంది. ఒకవేళ కార్యం జరిగితే పంచమి పసుపు, కుంకుమలు పోతాయని హెచ్చరిస్తుంది.

What Happend After Moksha And Panchami First Night on November 28th Episode Number 212 in Naga Panchami Telugu Serial

ఆ తర్వాత సుబ్బు తన శక్తితో అమ్మవారిని హెచ్చరించగా.. తప్పయిపోయింది స్వామి నేను వెళ్లిపోతాను, నేను మంచి చేయడానికి మాత్రమే పని చేస్తానంటూ మహా మాయావి పారిపోతుంది. అయితే ఇంట్లో వాళ్లు మాత్రం చాలా భయపడిపోతారు. పొద్దున నల్లచొక్కా అతను, ఇప్పుడు అమ్మవారు చెబుతున్నారు.. వద్దు మోక్ష అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మోక్ష మాత్రం వారి మాట వినడు. నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను... గదిలోకి వెళ్తాడు. ఇదంతా చూసిన కరాళీ మాత్రం తాను అనుకున్నది జరగట్లేదని ఫుల్ ఫైర్ అవుతుంది. తన ప్రయత్నం అంతా వృథా అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఆ తర్వాతే గదిలోకి వెళ్లిన మోక్ష.. పంచమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X