Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ హౌస్‌లో సెన్సేషన్.. సడెన్‌గా గేమ్ నుంచి తప్పుకున్న శివాజి.. అసలేం జరిగిందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతుంది. రోజుకో రకమైన ట్విస్ట్ ఇస్తూ.. షోను మరింత రసవత్తరంగా మలుస్తున్నారు బిగ్ బాస్ టీం నిర్వాహకులు. ఇప్పటికే విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకొని 14 వారంలో కొనసాగుతున్న ఈ షో.. మరికొద్ది రోజుల్లో ఫైనల్స్ కు చేరిపోతోంది. ఈక్రమంలోనే ఓటింగ్ అప్పీల్ కోసం బిగ్ బాస్ టీం నిర్వాహకులు సరికొత్త టాస్క్ లు ఇస్తూ కంటెస్టెంట్లకు షాకిస్తున్నారు. ముఖ్యంగా ఫన్ టాస్క్ లు అని చెబుతూనే... హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెడుతున్నారు. ఫన్ టాస్క్ ను కూడా సీరియస్ గా తీసుకొని కంటెస్టెంట్లు కూడ రచ్చ చేస్తున్నారు.
ఓవైపు సీరియల్ బ్యాచ్ మరోవైపు శివాజి బ్యాచ్ లు ఇంటిని ఎప్పటికప్పుడు రణరంగంగా మారుస్తున్నారు. ముఖ్యంగా అమర్ దీప్ అయితే అచ్చం సైకోలా మారిపోయి మరీ నానా హంగామా చేస్తున్నాడు. మొన్నటికి మొన్న శోభాను కాలితో తన్ని, ప్రియాంకను మూతిపై కొట్టి మళ్లీ సారీ చెప్పిన అమర్ దీప్.. నిన్నటి ఎపిసోడ్ లో అయితే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను కొరికాడు. ఇంత అరాచకంగా ప్రవర్తిస్తూ... ఓటింగ్ లో అట్టడుగు స్థాయికి వస్తున్నాడు. ఆయన చేసే చేష్టలతో ఓటింగ్ అంతా ఉల్టాపుల్టాగా మారుతోంది.

ఇదంతా ఇలా ఉండగా... తాజాగా బిగ్ బాస్ ఓ టాస్క్ ను ఇఛ్చాడు. ఇందులో అంబటి అర్జున్, శివాజి, ప్రియాంక జైన లు గేమ్ ఆడారు. సేమ్ నిన్నటిలాగే ఓ జాకెట్ ఇచ్చి బాల్స్ అతికేలా కొట్టుకొమ్మని చెప్పారు. అయితే శోభా శెట్టిని ఆ టాస్క్ సంచాలకురాలిగా ఉంచారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే అప్పటి వరకు చాలా హుషారుగా గేమ్ ఆడిన శివాజి ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. జాకెట్ విడిచి పడేస్తూ... నేనీ గేమ్ ఆడనంటూ వెళ్లిపోయాడు. ఎందకంటు ప్రిన్స్ యావర్ నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశాడు. అయితే శివాజి మధ్యలో అలా గేమ్ ఎందుకు ఆపేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రియాంక జైన్, శివాజి, అంబటి అర్జున్ లు ఓ వైపు సీరియస్ గా గేమ్ ఆడుతుంటే... బయటే ఉన్న శోభాశెట్టి మాత్రం కమాన్ ప్రియాంక, కమాన్ ప్రియాంక అంటూ చెబుతూనే ఉంది. బాగా ఆడు, గెలువు అంటూనే నాన్ స్టాప్ గా వాగుతూ ఉంది. దీనికి ఫుల్ ఫైర్ అయిన శివాజి.. తరచుగా అలా చెప్పకు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ శోభా మాత్రం తన తీరు మార్చుకోకుండా అరుస్తూనే ఉంది. దీంతో మరింత కోపం తెచ్చుకున్న శివాజి బయటకు వచ్చేశాడు. ఎవరు చెప్పినా నేన్ గేమ్ ఆడనంటూ మెండికేశాడు. ఈక్రమంలోనే శోభా.. నా ఇష్టం, నా ఫ్రెండ్ కు నేను సపోర్ట్ చేసుకుంటానంటూ తెలిపింది.
హౌస్ మేట్ లా సపోర్ట్ చేస్తే పర్లేదు కానీ... సంచాలక్ గా ఉండి అలా చేయకూడదు అంటూ శివాజి వివరించాడు. ఎప్పుడూ నువ్వు ఇలాగే చేస్తావు... నీ తీరు మార్చుకోమంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు ఫుల్ ఫైర్ అయిన శోభాశెట్టి చాలు సార్ చాలు.. నా గేమ్ నేను ఆడుతా.. నా ఫ్రెండ్ కి నేను సపోర్ట్ చేసుకుంటా... దానికి మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదంటూనే మరింత గొడవ పడుతుంది. నిన్నటి టాస్క్ లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ల మధ్య గట్టిగా గొడవ జరగ్గా.. ఈరోజుటి టాస్క్ లో శోభాశెట్టి, శివాజిల మధ్య గొడవ జరగబోతున్నట్లు ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications











