Rathika Rose: బిగ్ బాస్‌పై కోపంతో రతిక అంత పని చేసిందా..ఈ రెమ్యూనరేషన్ పంచాయితీ ఏందిరా?
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి నాలుగు వారాలు పూర్తి అయింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో మొత్తంగా 14మంది ఎంటర్ అవ్వగా.. అందులో కిరణ్ రాథోడ్, షకీలా, దామినీ, రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం రతికా రోజ్ ఎలిమినేట్ అవ్వడం సెన్సెషన్ క్రియేట్ చేసింది. దానికి కారణం ఆమె టాప్ 5లో నిలుస్తుందని అంతా అనుకున్నారు. ఆ విషయం పక్కన పెడితే... రతికా తన బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ చారిటీకి ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. అసలు అందులో నిజమెంత ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 లో 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా రతికా రోజ్ అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాదు ఆమె టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలుస్తుందని అంతా అనుకున్నారు. ఇక మొదటి వారం పల్లవి ప్రశాంత్ తో ప్రేమాయణం... ఆ తర్వాత వారి మధ్య గొడవలు ఆమెకు మైనస్ గా మారాయి. ఆ తర్వాత యావర్ తో ప్రేమాయణం మరింత నెగిటివిటీ తీసుకువచ్చింది.

మరోవైపు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ గుర్తుకు వస్తున్నాడు అంటూ సింపతీ గెయిన్ చేసుకునేందుకు ట్రై చేసిందంటూ కామెంట్స్ వినిపించాయి. ఇక ఈ విషయంపై రాహుల్ సైతం ఇన్ డైరెక్టుగా ఆమెకు కౌంటర్ ఇచ్చారు. పేరు వాడకుండా తమ పర్సనల్ ఫోటోస్ ఎలా లీక్ అయ్యాయంటూ... ప్రశ్నించాడు. ఇదంతా ఆమె టీం నడిపిస్తుందని ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా చెప్పుకువచ్చాడు. ఇక అప్పటి నుంచి ఆమెపై మరింత నెగిటివిటీ వచ్చింది.

ఇక మరోవైపు నాలుగో వారంలో సైతం రతిక, ప్రశాంత్ మధ్య వార్ నడిచింది. ప్రశాంత్ పవర్ అస్త్ర పోటీల్లో ఆడుతున్నప్పుడు అమర్ దీప్ తో కలిసి రతికా ఓవర్ చేసింది. ప్రశాంత్ తనను అక్క అని పిలవడంపై ఎన్నో కామెంట్స్ చేసింది. ఆయన బ్రెయిన్లో మన్ను మశానం ఉందంటూ... క్రైయింగ్ స్టార్ అంటూ వెకిలి చేష్టలు చేసింది. ఇక ఇంట్లో వాళ్లు ఇలాగే పెంచారా అంటూ రతికా చేసిన కామెంట్స్... నాగార్జునకు కూడా నచ్చలేదు. వీకెండ్ ఎపిసోడ్ లో ఆమెపై ఫైర్ అయ్యాడు.
ఇదంతా పక్కన పెడితే ఆమె నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. ఇక నాలుగు వారాలకు ఆమె 8 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక ఈ రెమ్యూనరేషన్ బిగ్ బాస్ పై కోపంతో ఓ చారిటీకి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే... ఆమెకు అసలే ఆఫర్స్ లేవు...వచ్చినా డబ్బును ఎందుకు చారిటీకి ఇస్తుంది.

ఒకవేళ ఇచ్చినా.. తాను డైరెక్టుగా ప్రకటించి ఇస్తుంది... ఎందుకంటే అలా అయినా ఆమెకు కాస్త నెగిటివిటీ పోయి.. సానుభూతి వస్తుంది. అయితే ఈ ప్రచారం ఆమెకు సంబంధించిన ఫ్యాన్ పేజీలు సృష్టిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఆమెపై నెగిటిపోయేందుకు.. రతిక ఇలాంటి గొప్ప పని చేసిందంటూ కొంతమంది సృష్టిస్తున్న వార్తలు ఇవని తెలుస్తోంది. రతికా తన రెమ్యూనరేషన్ చారిటీకి ఇచ్చిందన్న దాటిలో నిజం లేదని అర్దం అవుతుంది.


Click it and Unblock the Notifications











