Bigg Boss Telugu 8 5th week Nominations: హాట్ హాట్‌గా నామినేషన్ల పర్వం.. 5వ వారం ఎంతమంది అంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 నాలుగో వారాన్ని కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్‌లు ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం ఎవ్వరూ ఊహించని విధంగా సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సోనియా హౌస్‌ను వీడటంతో బిగ్‌బాస్ లవర్స్ షాక్ అయ్యారు. ఇక ఐదో వారం నామినేషన్స్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే..
నాలుగో వారం నాగమణికంఠ, సోనియా, నబీల్, ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్వీలు నామినేషన్స్‌లో నిలిచారు. శనివారం నబీల్‌ను సేవ్ చేసిన నాగ్.. ప్రేరణ, మణికంఠ, సోనియా, ఆదిత్య ఓంలలో మణికంఠ డేంజర్ జోన్‌లో ఉన్నాడని చెప్పి టెన్షన్ పెట్టించాడు. హౌస్ మెట్స్ మణికంఠని వారు జీరో అని స్టాంప్‌లు వేయడంతో వారి నిర్ణయం ప్రకారం.. చివరి వరకు అతను డేంజర్ జోన్‌లో ఉంటాడని చెప్పాడు.

ఆదివారం నాటి ఎపిసోడ్‌లో సోనియా, ఆదిత్య ఓం, ప్రేరణలలో ముందుగా ప్రేరణను సేవ్ చేసిన కింగ్.. మిగిలిన ముగ్గురిని యాక్షన్ రూంలోకి పిలిచారు. అక్కడి టాస్క్‌ల్లో ఆదిత్య ఓం సేఫ్ అయ్యి మళ్లీ సంతోషంగా హౌస్‌లో అడుగుపెట్టాడు. చివరికి మణికంఠ, సోనియాలు మిగలగా.. మరోసారి ఎలిమినేషన్ బాధ్యతను హౌస్‌మెట్స్ చేతుల్లోనే పెట్టి 8 సెకన్లు టైమిచ్చాడు నాగార్జున. నిఖిల్, పృథ్వీ, నైనిక తప్పించి మిగిలిన ఆరుగురు ఇంటి సభ్యులు మణికంఠ హౌస్‌లో ఉండాలని ఓట్లు వేయడంతో సోనియాను ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగ్ ప్రకటించారు.
అనంతరం అందరికీ వీడ్కోలు చెప్పిన సోనియా స్టేజ్ మీదకి చేరుకుంది. ఎలిమినేషన్‌కి ప్రీపేర్‌గానే ఉన్నానని.. కానీ సేవ్ అవుతానని ఎక్కడో ఉందని, ముఖంపై మాట్లాడతాను కాబట్టే తనను ఎక్కువమంది ఇష్టపడరని ఆమె చెప్పింది. కానీ నేను ఎప్పుడు మారలేదు, మారను కూడా.. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇంత యాక్టీవ్‌గా ఆటలు ఆడలేదని సోనియా తెలిపింది. అందరూ నన్ను ఏకాకిని చేశారని.. నబిల్, పృథ్వీలను స్వీట్ అని మెచ్చుకుని హౌస్‌ని వీడింది. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై నాగ్ అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు, ఈ మిడ్ వీక్‌లో ఓ ఎలిమినేషన్ ఉంటుందని మరో బాంబు పేల్చాడు. అలాగే ఐదో వారం ఓ మిని లాంచింగ్ ఈవెంట్ కూడా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
14 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 8లో నలుగురు ఎలిమినేట్ కావడంతో ఐదో వారం వచ్చేసరికి హౌస్‌లో 10 మంది మిగిలారు. ఎప్పటిలాగే సోమవారం కావడంతో నామినేషన్స్ తారాస్థాయిలో జరిగినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐదో వారానికి గాను ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వారు ఆదిత్య ఓం, నబీల్, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ, నైనిక . మరి బిగ్‌బాస్ తెలుగు 8లో ఐదో వారం నామినేషన్స్‌లో ఎవరున్నారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











