Who Is Ashwini Sri? బిగ్‌బాస్ షోలో అరేబియన్ గుర్రం.. అశ్వినీ శ్రీ ఎవరు? ఆమె గురించి మీకు తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 2.O అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం ప్రసారమైన వీకెండ్ ఎపిసోడ్‌లో పలు సంచలన విషయాలు చోటు చేసుకొన్నాయి. ఇంటిలో డబుల్ ఎలిమినేషన్, ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంటిలోకి ప్రవేశించడం.. అలాగే ఇంటిలో సిద్దార్థ్ హంగామా చేయడం, అలాగే టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ కోసం రవితేజ, నుపూర్ సనన్ తదితరులు ప్రమోషన్స్ కోసం రావడంతో సరదాగా, ఇంట్రెస్టింగ్‌గా ఎపిసోడ్ సాగిపోయింది. అయితే ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశించిన అశ్వీని శ్రీ ఎవరు అని నెటిజన్లు భారీగా ఇంటర్నెట్‌లో సర్చ్ చేస్తున్నారు. అయితే బిగ్‌బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీలు, అశ్విని శ్రీ వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 2.O వెర్షన్‌లో భాగంగా అంబటి అర్జున్, అశ్విని శ్రీ, భోలే షవాలీ, నయనీ పావనీ, పూజా మూర్తీ ఇంటిలోకి ప్రవేశించారు. తొలిసారి రెండు సార్లు కంటెస్టెంట్ల ఎంట్రీలు జరగడం తొలిసారి. నిజంగా ఉల్టా పుల్టా అనే విధంగా అభిమానులకు మజా పంచారు.

అయితే వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా ఇంటిలోకి వచ్చిన అశ్విని శ్రీ ఎవరనే విషయం గురించి గూగుల్‌లో వెతుకులాట మొదలైంది. అయితే వర్థమాన తారగా ఇప్పుడిప్పుడే అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న ఈ అందాల భామకు బిగ్‌బాస్ ద్వారా అవకాశం తలుపుతట్టింది.
ఇక అశ్వినీ శ్రీ వ్యక్తిగత విషయాల్లోకి వెళితే.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జన్మించింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోలు, రీల్స్‌తో ఆకట్టుకొంటారు. తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆసక్తికరమైన స్టాటస్ కామెంట్ పెట్టుకొన్నారు. నన్ను సరిగా ట్రీట్ చేస్తే.. డబుల్ ఫేవర్ చేస్తాను .. ఇట్లు అరేబియన్ గుర్రం.. ఎన్ఐటీ వరంగల్. ఇంజినీర్ అంటూ అశ్విని కామెంట్ చేసింది.

అశ్వినీ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. కొన్ని సినిమాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. ఆమె 2016లో వినోదం 100 % సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బీటెక్ బాబులు, అమీర్ పేటలో లాంటి చిత్రాల్లో నటించింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ సీరియల్స్‌లో కనిపించింది.
తెలుగు సినిమా పరిశ్రమలో వర్టమాన తారగా గుర్తింపు తెచ్చుకొంటున్న అశ్వినీ శ్రీ ఆరోవారంలో బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టింది. తన తండ్రికి యాక్టర్ కావడం ఇష్టం లేదు. ఎన్ఐటీలో చదువుకొని యాక్టర్ కావడం ఇష్టలేదు. కానీ నేను చదువును వదిలేసి యాక్టర్‌ను కావాలనుకొంటున్నాను అని అశ్వినీ శ్రీ చెప్పింది.


Click it and Unblock the Notifications











