Who is Bigg Boss Telugu 7 Winner? పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికి? అతడికేనా పవర్ స్టార్ అభిమానుల ఓట్లు?
బిగ్‌బాస్ తెలుగు 7 విజేత ఎవరో తెలియడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17వ తేదీన నిర్వహించేందుకు వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు మిగితా సీజన్లతో పోల్చుకొంటే ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్‌కు భారీ స్పందన లభించింది. ఇలాంటి హైప్ నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారు? ఎవరికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మద్దతు ఇస్తారనే విషయంలోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు ప్రారంభమైనప్పటి నుంచి ఈ షోకు పవర్ స్టార్ అభిమానులు యాక్టివ్‌గా మద్దతిస్తున్నారు. మెగా ఫ్యామిలీని అభిమానించే వారికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేసి గెలిపించుకొంటూ వస్తున్నారు. ఇంటిలో మెగా హీరోల అభిమానిని అని చెప్పుకొనే ప్రతీ ఒక్కరికి పవన్ కల్యాణ్ అభిమానులు అండగా నిలుస్తూ వస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడైన శివబాలాజీకి అండగా నిలిచారు. ఆయనకు రికార్డు స్థాయిలో ఓట్లు వేసి పవర్ స్టార్ అభిమానులు విజేతగా నిలిపారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ను హిట్ చేయడంలో మెగా, పవర్ అభిమానులు కీలక పాత్ర పోషించారు.
ఇక రెండో సీజన్‌లో సెన్సేషన్‌గా మారిన కౌశల్ మండాకు పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున్న ఫాలో అయ్యారు. బిగ్‌బాస్ ఇంటిలో కౌశల్ పదే పదే పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన మాటలు, ఆయన చేసిన సహాయం గురించి చెప్పడంతో అతడికి చాలా మంది కనెక్ట్ అయ్యారు. దాంతో కౌశల్ చేసిన ఒంటరిపోరాటానికి పవర్ స్టార్ అభిమానులు అండగా నిలిచారు.

అలాగే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3, సీజన్ 4 లో కూడా రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్‌కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసిన విషయం సోషల్ మీడియాలో వారు చేసిన పోస్టుల వల్ల స్పష్టమైంది. ఇక సీజన్ 5లో కూడా వీజే సన్నీకి, సీజన్ 6లో రేవంత్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. దాంతో వారి విజయంలో తమ వంతు సహకారాన్ని అందించారు.
ప్రస్తుతం ఇంటిలోని టాప్ కంటెస్టెంట్లలో ఇద్దరు మెగా, పవర్ స్టార్ అభిమానులకు దగ్గరైన వారు పల్లవి ప్రశాంత్, శివాజీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ పడనక్కర్లేదు. శివాజీ ఇంట్లోకి వస్తూనే మనల్ని ఎవడురా ఆపేది అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్‌తో ఓ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక పల్లవి ప్రశాంత్.. పుష్ప పాత్రలోనే జీవిస్తూ కనిపించాడు. దాంతో ఈసారి ఈ ఇద్దరికి మెగా, పవన్ అభిమానుల మద్దతు ఉంటుందనే విషయం స్పష్టమైంది.

ఇదిలా ఉండగా, డిసెంబర్ 17వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలేలో ముఖ్య అతిథిగా సూపర్‌స్టార్ మహేష్ బాబు హాజరవుతున్నట్టు వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వేదిక ద్వారా త్వరలో విడుదల కానున్న గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











