Who is Divya Ganesh? బిగ్‌బాస్ తమిళ్ 9 విజేతగా తెలుగు సీరియల్ నటి.. దివ్య గణేష్ ఎవరో తెలుసా?
పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్ తమిళ్ ఫినాలే గ్రాండ్‌గా ముగిసింది. దాదాపు 105 రోజులపాటు నిర్విరామంగా అనేక వివాదాలు, సంచలనాలతో ఈ షో అత్యంత వ్యూయర్ షిప్‌ను సాధించింది. అక్టోబర్ 5వ తేదీ 2025 రోజున దాదాపు 20 మంది కంటెస్టెంట్స్‌తో క్రేజీగా ఈ షో ప్రారంభమైంది. అయితే ఈ సీజన్‌లో విజేతగా దివ్య గణేష్ నిలిచింది. అయితే ఫినాలే గురించి, దివ్య గణేష్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 9 ప్రారంభమైంది. కమల్ హాసన్ హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆయన రెండోసారి హోస్ట్‌గా ఈ షోను ముందుకు నడిపించాడు. అయితే తాజా సీజన్‌లో ఆయన పలు వివాదాలను చాకచక్యంగా పరిష్కరించారు. ఓ టాస్క్‌లో ఓ మహిళా కంటెస్టెంట్‌ను ఇద్దరు కంటెస్టెంట్లు శారీరక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై వారిని ఇంటి నుంచి బయటకు పంపించడం సంచలనంగా మారింది. ఇంకా పలు వివాదాలు ఈ సీజన్‌పై ఆసక్తిని రేపేలా చేశాయి.

బిగ్‌బాస్ తమిళ సీజన్ 9 లో మొత్తం నలుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టులగా నిలిచారు. దివ్య గణేష్, శబరినాథన్, వికాల్స్ విక్రమ్, ఆరోరా సింక్లయిర్ ట్రోఫి కోసం పోటీపడ్డారు. అయితే చివరకు దివ్య గణేష్‌ను హోస్ట్ విజయ్ సేతుపతి విజేతగా నిలిచారు. ఫస్ట్ రన్నరప్‌గా శబరినాథన్‌ను ప్రకటించారు. వికాల్స్ విక్రమ్ సెకండ్ రన్నరప్‌గా, ఆరోరా సింక్లయిర్ మూడో రన్నరప్‌గా నిలిచారు.
ఫినాలేలో దివ్య గణేష్‌ను విజేతగా ప్రకటించడానికి ముందు హై డ్రామా నడించింది. సూట్ కేసులో కొంత డబ్బు పెట్టి కంటెస్టెంట్లకు ఆశచూపి.. స్వయంగా ఎలిమినేషన్ ఎవరు అవుతారని గేమ్ ఆడించగా.. గణ వినోద్ అందుకు మొగ్గు చూపాడు. 18 లక్షల రూపాయల ఉన్న సూట్ కేసును తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దాంతో ఇంటిలో ట్రోఫి కోసం నలుగురు కంటెస్టెంట్లు పోటీపడ్డారు. అయితే ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఫినాలేలో దివ్య గణేష్ విన్నర్‌గా నిలిచారు.
బిగ్‌బాస్ తమిళ్ 9వ సీజన్‌లో విజేతగా నిలిచిన దివ్య గణేష్‌కు 50 లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. అంతేకాకుండా మారుతి సుజుకి విక్టోరియస్ వాహనం కూడా గెలుచుకొన్నారు. ఇంకా పలు బహుమతులు, గిఫ్ట్ హాంపర్స్ ఆమెకు లభించాయి. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీతో ఇంట్లోకి వచ్చిన ఆమె నాలుగో వారం కెప్టెన్‌గా నిలిచింది. అంతేకాకుండా తమిళంలో రెండో మహిళా విన్నర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో అర్చన రవిచంద్రన్ అనే లేడీ కంటెస్టెంట్ విజేతగా నిలవడం తెలిసిందే.
ఇక దివ్య గణేష్ ఎవరనే విషయానికి వస్తే.. జెమినీ టెలివిజన్‌లో ప్రసారమైన భాగ్యరేఖ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె 1994 సంవత్సరంలో తమిళనాడులోని రామనాథపురంలో జన్మించారు. 2017 సంవత్సరంలో కెలడీ కన్మనీ అనే టీవీ సీరియల్ ద్వారా యాక్టింగ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత విన్నుతాండై వారువాయ, లక్ష్మీ వందాచు, సుమంగళి, భాగ్యలక్ష్మీ, చెల్లమ్మ అనే సీరియల్స్‌లో నటించారు. అడంగతే అనే సినిమా ద్వారా తమిళ సినిమా పరిశ్రమలోకి 2022లో అడుగుపెట్టారు.


Click it and Unblock the Notifications











