Bigg Boss Telugu 9 Top 5: బిగ్‌బాస్ తెలుగు టాప్ 5లో ఎవరు? ఆ ఇద్దరికి చాన్స్ లేనట్టేనా?
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో దాదాపు ముగింపు దశకు చేరుకొన్నది. ఇంటి నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోయారు. చివరకు ఇంటిలో ఏడుగురు కంటెస్టెంట్లు మిగిలిపోయారు. అయితే ఊహించని విధంగా కొందరు టాప్ కంటెస్టెంట్లు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్‌లో ఉన్న సెలబ్రిటీల నుంచి ఎవరు టాప్ 5 లిస్టులోకి వెళ్తారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. కానీ ఇంటిలో కొందరు కంటెస్టెంట్లు బలహీనంగా ఉండటం, మరికొంత మంది స్ట్రాంగ్‌గా తొలివారం నుంచి ఆడుతుండటంతో టాప్ 5 బెర్త్ ఎవరి వశం అవుతుందని ఆలోచిస్తున్నారు. టాప్ 5 కంటెస్టెంట్ల జాబితా విషయంలోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు షోలో 13వ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. భరణి, సుమన్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రీతూ చౌదరీ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే భరణి, సుమన్ శెట్టిని కొనసాగించడంపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే రీతూ చౌదరీ గేమ్స్‌లోను, టాస్క్‌లోను టాలెంట్ చూపిస్తుండటంతో కొంత సానుభూతి కనిపిస్తున్నది.

ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో ఇప్పటి వరకు 13 వారాల్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్, 8వ వారంలో దివ్వెల మాధురి, 9వ రాము రాథోడ్, శ్రీనివాస సాయి, 10వ వారం గౌరవ్, నిఖిల్, 12వ వారంలో దివ్య నిఖిత, 13వ వారం రీతూ చౌదరీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఇంటిలో ప్రస్తుతం ఉన్న వారిలో కల్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్్, సుమన్ శెట్టి ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఉంటుందా? ఉంటే దాని ప్రాసెస్ ఎలా కొనసాగిస్తారు? లేదా రానున్న రెండు వారాల్లో ఏడుగురు సభ్యులతోనే షోను నడిపించి.. చివరి వారంలో టాప్ 5 కంటెస్టెంట్స్‌ను ఫైనలైజ్ చేస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో టాప్ 5లో ఉండే సెలబ్రిటీల విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో జరిగిన ఓటింగ్, గత నామినేషన్ల సందర్భంగా కంటెస్టెంట్లు సంపాదించిన ఓటింగ్ ప్రకారం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కల్యాణ్ పడాల టికెట్ టూ ఫినాలే దక్కించుకొన్నాడు. ఇక తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, డీమాన్ పవన్ టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. చివరి రెండు స్థానాల్లో భరణి, సుమన్ శెట్టి నిలిచే ఛాన్స్ కనిపిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక బిగ్‌బాస్ తెలుగు ఫినాలే విషయానికి వస్తే.. ఈ షో గ్రాండ్ ఫైనల్ డిసెంబర్ 21వ తేదీన జరుగుతుందని స్టార్ మా యాజమాన్యం వెల్లడించింది. ఈ ఫినాలే కోసం ఇప్పటికే గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారనే వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











