బాయ్ ఫ్రెండ్‌తో జగతి మేడమ్ ప్రైవేట్ వీడియో లీక్... జ్యోతి రాయ్‌ని టార్గెట్ చేసింది ఎవరో తెలుసా?
రెండ్రోజుల క్రితం జ్యోతి రాయ్ అనే నటి ఇంటిమేట్ వీడియో లీక్ అయ్యిందనే వార్త గుప్పుమంది. ఆ తరువాత ఆమె ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ వీడియో గురించి పోస్ట్ చేసిన వారు డిలీట్ చేయడం జరిగిపోయిన విషయాలు. అయితే ఈ వివాదంతో అసలు జ్యోతి రాయ్ అంటే ఎవరు అని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఈ సందర్భంగా జ్యోతి రాయ్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలపై ఓ లుక్కేద్దాం.
కన్నడ టెలివిజన్ నటి జ్యోతి రాయ్ ప్రైవేట్, వీడియోలు లీక్ అవ్వడం కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కన్పించే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోయిన బొల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. మరి ఈ జ్యోతి రాయ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే..

జ్యోతి రాయ్ ఒక కన్నడ టెలివిజన్ నటి. అక్కడ ఆమె 20కి పైగా షోలలో నటించి నటిగా మంచి గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు అనే సీరియల్ చేస్తోంది. ఈ ఒక్క సీరియల్ లో ఆమె పోషించిన జగతి మేడమ్ పాత్రతో బుల్లితెర ప్రేక్షకులపై గట్టిగానే ఇంపాక్ట్ చూపించింది.
దీంతో ఆమెకు స్టార్ హీరోయిన్లకు ఉండే క్రేజ్, ఫాలోయింగ్ ఈ సీరియల్ ద్వారానే దక్కింది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా విపరీతంగా అభిమానులను సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల కలల రాణిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమె వీడియో లీక్ ఘటన రచ్చ రచ్చ అయ్యింది.

ఇక ఈ బ్యూటీ బుల్లితెర దర్శకుడైన సుకుమార్ పూర్వాజ్ తో ప్రేమలో పడింది. ఈ జంట గత ఏడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే జ్యోతికి ఇది రెండవ పెళ్లి కావడం గమనార్హం. ఆమెకు 20 ఏళ్ల వయసులోనే పద్మనాబ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే ఈ జంట అప్పట్లోనే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. జ్యోతికి మొదటి భర్తతో ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం సుకుమార్ పూర్వాజ్ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.
ఇలా ఓవైపు సీరియల్స్, మరోవైపు పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్న జ్యోతి రాయ్ ని కొంతమంది తాజాగా టార్గెట్ చేసి ఆమె ఇంటిమేట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలారు. అలాగే యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేస్తామంటూ నెటిజన్లను సబ్ స్క్రయిబ్ చేసుకోవాలని కోరారు. దీంతో ఈ విషయమై ఆమె పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది.

కాగా కొంతకాలం క్రితమే జ్యోతి రాయ్ హాట్ ఫోటోలు వైరల్ కాగా, అదే సమయంలో ఆమె ఎ మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది అనే వార్తలు వచ్చాయి. మరోవైపు ఆమెకు దేవర మూవీలో నటించే ఛాన్స్ వచ్చిందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలపై ఇంకా అధికారికంగా అనౌన్స్మెంట్ రాలేదు.


Click it and Unblock the Notifications











