Who Is Prithvi Raj Shetty? ఎవరీ పృథ్వీరాజ్ శెట్టి?.. కంటెస్టెంట్‌పై బిగ్‌బాస్ ఎలిమినేషన్ కత్తి? డేంజర్ జోన్‌న
బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో రంజుగా సాగుతున్నది. ఇదే చివరి వారం.. కప్ మిస్ అవుతుందనే ఆతృత తొలివారమే కంటెస్టెంట్లలో కనిపించింది. నామినేషన్ల ప్రక్రియలో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొన్నారు. చివరకు గందరగోళం మధ్య నామినేషన్ ప్రక్రియను ముగించారు. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో నిలిచిన పృథ్వీ ఎవరనే విషయం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో తొలివారం నామినేట్ అయిన వారిలో బేబక్క, విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ భాషా అందరికి తెలిసిన వారే. అయితే మణికంఠ వివాదాస్పదంగా రెండు రోజుల్లోనే అందరికి పరిచయమయ్యారు. ఇక సోనియా ఆకుల మాత్రం యూట్యూబర్‌గా గుర్తింపు సొంతం చేసుకొన్నది. ఇక మిగిలింది పృథ్వీ.. ఈయన ఎవరు అనే విషయం అందరిలోను చర్చనీయాంశమైంది.

ఇక పృథ్వీ విషయానికి వస్తే.. ఆయన అసలు పేరు పృథ్వీరాజ్ శెట్టి. మంగళూరుకు చెందిన వాడు. కసరాగాడ్, ఉడిపి జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. స్టడీస్ తర్వా ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్థిరపడాలి. కెరీర్ కొనసాగించాలని అనుకొన్నాడు. పలు ఫ్యాషన్ షోలో పాలు పంచుకొన్నాడు. ఆ తర్వాత కొంత ఆ ఫీల్డ్‌లో గుర్తింపు రావడంతో ఆయన దృష్టి సినిమాలపై పడింది.
సినీ రంగంలో రాణించడానికి ఆయన బెంగళూరు చేరుకొన్నారు. సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తొలుత సీరియల్స్‌లో ఆఫర్లు సాధించాడు. నాగపంచమి సీరియల్ హిట్ కావడంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు.

తాజాగా బిగ్‌బాస్ తెలుగు 8 షోలొకి అడుగుపెట్టాడు. నాగార్జున అక్కినేనితో మాట్లాడుతూ.. నాకు యాక్టర్ కావాలని ఉంది. అది కూడా విలన్ పాత్రలు వేయాలని ఉంది అని అన్నారు. అలా ఇంటిలోకి అడుగుపెట్టిన ఆయన తొలివారం నామినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ కత్తి ఆయనపై వేలాడుతున్నది. ఆయన ఉంటాడా? ఇంటి నుంచి బయటకు వస్తారా? వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











