twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్.. 20 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఇంగ్లీష్ కేబీసీ మూసివేత

    |

    టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పొందిన రియాలిటీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ప్రారంభించిన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. అంతటి ప్రభావవంతమైన షోకు మాతృక అమెరికాలో అత్యంత ప్రజాదరణ ఉన్న కార్యక్రమం హూ వాంట్స్ టు బీ ఏ మిలియనీర్. ఈ రెండు కార్యక్రమాల ఆధారంగానే తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలా సుమారు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న షోను రద్దు చేయడం టెలివిజన్ ప్రేక్షకులకు షాక్ తగిలింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఇవిగో..

     హూ వాంట్స్‌ బీ ఏ మిలియనీర్ షో

    హూ వాంట్స్‌ బీ ఏ మిలియనీర్ షో

    1999లోనే ఏబీసీ ఈ షోను ప్రారంభించింది. ఆ తర్వాత దీని నిర్వాహణను సిండికేషన్ అనే సంస్థ ద్వారా 2002లో హూ వాంట్స్ టు బీ ఏ మిలియనీర్ షో ఏబీసీ అనే చానెల్‌లోనే ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ తర్వాత ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఆ తర్వాత సిండికేట్ అనే సంస్థ 17 ఏళ్ల విజయవంతంగా నడిపిస్తున్నది. అయితే ఈ షోను రద్దు చేయాలని నిర్ణయించడం మీడియా వర్గాలను కూడా షాక్ గురిచేసింది. 2019-20 సీజన్‌ను ప్రసారం చేయవద్దని నిర్వాహకులు నిర్ణయం తీసుకొన్నారు అని హాలీవుడ్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.

    17 ఏళ్ల నుంచి చేతులు మారి

    17 ఏళ్ల నుంచి చేతులు మారి

    17 ఏళ్ల క్రితం హూ వాంట్స్ టు బీ ఏ మిలియనీర్ షోను వ్యాలీక్రెస్ట్ ప్రొడక్షన్స్ నిర్వాహణ బాధ్యతను చేపట్టింది. డిస్నీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ టెలివిజన్ డిస్ట్రిబ్యూషన్ అనే సంస్థ దీనిని ప్రసారం బాధ్యతను భుజానకు ఎత్తుకొన్నది. 2002లో రేజిస్ ఫిల్బిన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాత 2013 వరకు మెరెదిత్ వీయారా హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి సెడ్రిక్ ది ఎంటర్‌టైనర్, టెర్రీ క్రూస్, క్రిస్ హారిసన్ హోస్ట్‌‌లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

     గేమ్ ఫార్మాట్.. భారీగా ప్రైజ్ మనీ

    గేమ్ ఫార్మాట్.. భారీగా ప్రైజ్ మనీ

    ఓ ప్రశ్నకు నాలుగు ఆప్షన్లుగా సమాధానాలు ఉండేలా డిజైన్ చేశారు. అలా 15 ప్రశ్నలకు సమాధానం చెప్పిన కంటెస్టెంట్‌కు ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా లభిస్తాయి. అంటే అక్షరాల రూ.7 కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ షో ప్రారంభించిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకుల నుంచి క్రేజ్ అలాగే కొనసాగడం జరుగుతున్నది. అయితే ఈ షో కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు.

    హిందీ, దేశీయ ఇతర భాషల్లోకి

    హిందీ, దేశీయ ఇతర భాషల్లోకి

    ఇంగ్లీష్‌లోనే కాకుండా హిందీతోపాటు భారతీయ పలు భాషల్లో కౌన్ బనే కరోడ్‌పతి షోకు విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. తెలుగులో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం కూడా విజయవంతంగా సాగింది. 2000 సంవత్సరం నుంచి ఈ షోకు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 2007 సీజన్‌కు షారుక్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించాడు.

    English summary
    Worlds iconic game show "Who Wants to Be a Millionaire?" has been cancelled after 20 years of long run, the last 17 of which were in syndication. The game show, which was a phenomenon in its initial network run on ABC and has aired in syndication since 2002, will end after its current season.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X