Bigg Boss Telugu 8 Week 2 Elimination: బిగ్‌బాస్ ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. టాప్‌లో ఎవరున్నారంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 అప్పుడే సెకండ్ వీక్‌లోకి ఎంటరై, గేమ్ ఉత్కంఠగా సాగుతోంది. రెండో వారం నామినేషన్స్ వాడివేడిగా జరిగింది. కంటెస్టెంట్స్ వాల్యుబుల్ పాయింట్లను బయటికి తీసి నామినేట్ చేశారు. తొలివారం ఆటను అర్ధం చేసుకోవడానికి ఇబ్బందిపడ్డ ఇంటి సభ్యులు .. రెండో వారం గేమ్‌ను పూర్తిగా అంచనా వేసినట్లుగా కనిపిస్తోంది. గతవారం బేబక్క ఎలిమినేట్ అవ్వగా .. ఈ వారం ఎవరు హౌస్‌ను వీడనున్నారనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. ఆ వివరాలు మీకోసం

సెకండ్ వీక్ నామినేషన్స్‌ విషయానికి వస్తే.. 14 మంది కంటెస్టెంట్స్‌కు గాను బేబక్క ఎలిమినేట్ కావడంతో 13 మంది మిగిలారు. తొలివారం ఆరుగురు మాత్రమే నామినేషన్స్‌లో ఉండగా ఈసారి మాత్రం ఏకంగా 8 మంది డేంజర్ జోన్‌లో ఉన్నారు. విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, నాగమణికంఠ, నిఖిల్, పృథ్వీరాజ్, శేఖర్ భాషా, కిర్రాక్ సీత‌లు డేంజర్ జోన్‌లో నిలిచారు. యాష్మీ, సోనియా, అభయ్ , నబీల్‌, ప్రేరణలు మాత్రం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

Who will be eliminated from Bigg Boss Telugu 8 Week 2 here s the details

నామినేషన్స్‌లో ఉన్న వారి విషయానికి వస్తే.. నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. దీనికి తోడు సీరియల్ నటుడు కావడంతో అతనిని సపోర్ట్ చేసేవారు ఉన్నారు.
విష్ణుప్రియ ఇప్పటి వరకు తన అసలు సిసలు ఆట ఆడలేదు. గతవారం ఆమె గేమ్‌ను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది. ఆమె ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ వేరే లెవల్ అన్నది అందరికీ తెలిసిందే. విష్ణుప్రియ మనసుపెట్టి ఆడితే ఆమెకు పోటీ ఇచ్చేవారు ఎవరూ లేరు. ఇదే విషయాన్ని బేబక్క కూడా అంగీకరిస్తూ ఈసారి విన్నర్ ఆమెనంటూ రిజల్ట్ కూడా చెప్పేసింది. ఆమెకు స్టార్ యాంకర్లు, సీరియల్ నటులు ఫ్రెండ్స్‌గా ఉండటంతో విష్ణుప్రియకు ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఓటింగ్‌లో వీరిద్దరూ టాప్‌లో కొనసాగుతున్నారు.

మణికంఠ విషయానికి వస్తే తన సెంటిమెంట్ డ్రామాతో అందరికీ టార్గెట్ అయిన అతను కూడా ఏదో స్ట్రాటజీతోనే హౌస్‌లో అడుగుపెట్టినట్లుగా అర్ధమవుతోంది. ఏం చేసినా సరే ఇంట్లో నుంచి కదిలే ప్రసక్తే లేదని మణికంఠ చెప్పాడు. అతను కూడా ఈ వీక్ సేవ్ అవుతాడని విశ్లేషకులు అంటున్నారు. నైనిక, శేఖర్ భాషా, పృథ్వీరాజ్‌లు కూడా ఏదో లాగా బతికిపోతారని ఏటోచ్చి కిర్రాక్ సీత, ఆదిత్య ఓం ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు.

సీత బాగానే ఆడుతూ.. తన మీద చేసే కామెంట్స్‌కి ఘాటుగానే బదులిస్తోంది. అయితే కొన్నిసార్లు అనవసరంగా గొడవ పడుతుందని, కారణం లేకుండా గొంతు చించుకుంటోంది అనేవారు లేకపోలేదు. ఓటింగ్‌లోనూ సీతకు అంతగా బలమైన సపోర్ట్ లేదని అంటున్నారు. ఇక ఆదిత్య ఓం పేరు ఈవారం ఎలిమినేట్ అయ్యేవారి జాబితాలో ఎక్కువగా వినిపిస్తోంది. సహజంగానే బిగ్‌బాస్‌లో వయసులో పెద్దవారిని ఎక్కువ రోజులు ఉంచరు .

బేబక్కను ఇప్పటికే ఎలిమినేట్ చేయగా.. నెక్ట్స్ టార్గెట్ ఆదిత్యనే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందరితో ఆయన బాగానే ఉంటున్నా , ఫన్ పెద్దగా ఇవ్వడం లేదు. పైగా ఓటింగ్‌లో ఆదిత్య ఓం చివరి స్థానంలో ఉన్నారు. కాకపోతే సెలబ్రెటీ కావడంతో ఆయనను కాపాడే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి సీత, ఆదిత్య ఓంలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X