Bigg Boss Top 5: బిగ్‌బాస్ తెలుగు 9లో టాప్ 5 ఎవరంటే? ఆ అదృష్టం వరించేది ఎవరి కంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ఆసక్తికరంగా ఎవరూ ఊహించని విధంగా ముందుకు సాగుతున్నది. ఎనిమిదో వారంలో కూడా ట్విస్టులు, టర్నులతో బిగ్‌బాస్ ఆసక్తిని రేపుతున్నాడు. తాజాగా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపి షోను రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ఇంటిలోకి వైల్డ్ కార్డుల రూపంలోను, అలాగే రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ల మధ్య ఆట చదరంగాన్ని మించి రణరంగాన్ని తలపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న పెర్ఫార్మెన్స్ చూస్తే.. టాప్ 5 ఎవరు ఉంటారనే విషయంలోకి వెళితే..

సెలబ్రిటీస్, కామన్ మ్యాన్ రెండు కేటగిరీల్లో సెలబ్రిటీలను, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఇంటిలోకి పంపారు. 5 వారాలు ముగిసిన తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీలతో షోను మరింత క్రేజీగా మార్చారు. దివ్య, ఆయేషా, రమ్య మోక్ష, నిఖిల్, గౌరవ్, ఆయేషా లాంటి సెలబ్రిటీలను ఇంటిలోకి పంపారు. వీరి రాకతో ఇంటిలో ఆటలా కాకుండా రణరంగంగా మారింది. వాదనలు, గొడవలు, గ్రూపిజంతో బిగ్‌బాస్ హౌస్ మాత్రం ఫుల్లుగా గందరగోళంతో నెలకొన్నది.

Top 5 of in Bigg Boss Telugu 9

తాజాగా బిగ్‌బాస్ ఇంటి గేమ్‌లో మరో ట్విస్ట్ ఇచ్చారు. 8వ వారంలో నామినేషన్ల సందర్భంగా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారందర్ని ఇంటిలోకి పంపి వారిని నామినేషన్ ప్రాసెస్‌లో భాగం చేశాడు. దాంతో మనీష్ మర్యాద, ప్రియాశెట్టి లాంటి వాళ్లు వచ్చి కంటెస్టెంట్లను నామినేట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఇంటిలోకి ఎలిమినేట్ అయిన శ్రీజ దమ్ము, భరణి శంకర్‌ను రీ ఎంట్రీ ఇచ్చారు. తన ఆట తీరుతో ప్రభావం చూపలేక రమ్య పికిల్ ఇంటి దారి పట్టగా.. ఆయేషా మాత్రం అనారోగ్యంతో మధ్యలోనే ఆట నుంచి బయటకు వెళ్లింది. దాంతో ఆట మరో లెవెల్‌కు చేరిందనే ఫీలింగ్‌ను ఆడియెన్స్‌లో కల్పించాడు.

ఇంటిలో తమ ఆటతో రియాలిటీ షోపై ప్రభావం చూపుతున్న వారిలో ఇమ్మాన్యుయేల్, తనుజా గౌడ, డీమాన్ పవన్, రీతూ చౌదరీ, సుమన్ శెట్టి, కల్యాణ్ ఉన్నారు. వీరికి తోడుగా శ్రీజా, భరణి చేరారు. దాంతో టాప్ 5లో ఎవరు ఉంటారనే విషయం మరింత ఝటిలంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా గేమ్ షో మలుపులు తిరుగుతున్నది. 8వ వారం, 9వ వారం ఎలిమినేషన్లు కీలకంగా మారుతాయి. అలాగే టికెట్ టూ ఫినాలే కూడా టాప్ 5లో ఎవరు ఉంటారనే విషయాన్ని నిర్ధారిస్తుంది అనే అభిప్రాయం అందరిలోను నెలకొన్నది.

ఇలాంటి ట్విస్టులు, టర్నుల మధ్య అంచనాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ల టాలెంట్ పరిశీలించిన తర్వాత ఈ సీజన్‌లో టాప్ 5లో ఉండే వారిలో ఇమ్మాన్యుయేల్ మొదటి వరుసలో ఉండటం ఖాయంగా కినిపిస్తున్నది. ఇక తనూజా కూడా టాప్ లిస్టులో టైటిల్ కోసం పోటీ పడటంలో ముందున్నది. ఆ తర్వాత మాధురీ, రీతూ చౌదరీ, కల్యాణ్, డీమాన్ పవన్, శ్రీజ, భరణి, సుమన్ శెట్టిలో ముగ్గురు టాప్‌లో ఉంటారు. పోటీ ధాటిగా ఉంటే.. టాప్ సిక్స్‌తో ఫినాలేను నిర్వహించే విషయం కూడా లేకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఇక ఎనిమిదో వారం నామినేషన్ల విషయానికి వస్తే.. ఈ వారం ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారి జాబితాలో కల్యాణ్ పడాల, రాము రాథోడ్, డీమాన్ పవన్, గౌరవ్, సంజనా, తనూజా గౌడ, మాధురీ, రీతూ చౌదరీ ఉన్నారు. ఈ వారం గౌరవ్ గానీ, లేదా రాము యాదవ్ గానీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తాజా ఓటింగ్ సరళి తెలియజేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X