For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Indian Idol 12 Finale: షణ్ముఖ ప్రియపై భారీగా ట్రోలింగ్.. మా అమ్మ కూడా అంటూ కరణ్ జోహర్ ఆగ్రహం!

  |

  Indian Idol 12 సీజన్‌కు అంతా రంగం సిద్ధమైంది. ఈ సీజన్ ఫైనల్‌ కొద్ది గంటల్లో ముగియనుండగా విజేతగా ఎవరు నిలుస్తారనే విషయం దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్లో ఉత్కంఠగా మారింది. విజయ్ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్‌లో షణ్ముఖ ప్రియకు అండగా నిలిచారు. అయితే శనివారం జరిగిన సెమిఫైనల్ ఈవెంట్‌కు కరణ్ జోహర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. ఈ షోలో షణ్ముఖ ప్రియ గురించి కరణ్ మాట్లాడుతూ...

  అందరి దృష్టి సెమీఫైనల్‌పైనే

  అందరి దృష్టి సెమీఫైనల్‌పైనే

  Indian Idol 12 సీజన్ షో విషయానికి వస్తే.. వైజాగ్‌కు చెందిన తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియతోపాటు పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, మహ్మద్ డానిష్, సయేలి కాంబ్లే, నిహాల్ టారో పోటీలో నిలిచారు. ఈ సారి ఫైనల్ పోటికి వెళ్లే ఐదుగురు కంటెస్టెంట్లు ఎవరు అనే ఉత్కంఠ ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. దీంతో శనివారం జరిగే ఎపిసోడ్‌పై అందరి దృష్టి పడింది. ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం అభిమానుల్లో ఆందోళన కలిగించింది.

  కంటెస్టెంట్లను ఆకాశానికి ఎత్తేసిన కరణ్ జోహర్

  కంటెస్టెంట్లను ఆకాశానికి ఎత్తేసిన కరణ్ జోహర్

  Indian Idol 12 సీజన్ సెమీ ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ దర్శక, నిర్మాత, నటుడు, హోస్ట్ కరణ్ జోహర్ కంటెస్టెంట్ల ప్రతిభను ఆకాశానికి ఎత్తేశారు. పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, మహ్మద్ డానిష్‌కు నేరుగా ధర్మ ప్రొడక్షన్‌లో పాడే అవకాశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా భారతీయ సినిమా చరిత్రలో షోలే సినిమా తర్వాత అంత హిట్ అయిన షో ఇండియన్ ఐడల్ 12 అంటూ కామెంట్ చేయడంతో జడ్జీలందరూ సంతోషంలో మునిగిపోయారు.

  నీవో రాక్‌స్టార్ అంటూ

  నీవో రాక్‌స్టార్ అంటూ

  ఇక షణ్ముఖ ప్రియ పాడిన పాటకు జడ్జీలతోపాటు కరణ్ జోహర్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. కరణ్ జోహర్ మాట్లాడుతూ.. ఓ మై గాడ్... నీవు అన్ని అర్హతలు ఉన్న రాక్‌స్టార్. నీలో ఎనర్జీ అసాధారణం. రియల్ రాక్ స్టార్ పెర్ఫార్మెన్స్. ఖుర్బానియా పాటను ప్రొఫెషనల్ రాక్‌స్టార్‌గా పాడావు. నీ మాదిరిగా ఎవరూ పాడలేరు. అది నీకే సాధ్యం. నీవు మ్యూజిక్ జీనియస్. నీలో ఫైర్ అద్భుతంగా పాడావు. ఒరిజినల్ సాంగ్ కంటే బాగా పాడావు అంటూ కరణ్ జోహర్ ప్రశంసల వర్షం కురిపించారు.

  సోషల్ మీడియాలో షణ్ముఖప్రియపై ట్రోలింగ్

  సోషల్ మీడియాలో షణ్ముఖప్రియపై ట్రోలింగ్

  షణ్ముఖ ప్రియకు అండగా నిలుస్తూ... కొద్ది రోజుల నుంచి నేను సోషల్ మీడియాలో చాలా గమనిస్తు ఉన్నాను. నీపై జరుగుతున్న ట్రోలింగ్ నా దృష్టికి వచ్చింది. నీపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. నీ జీవితంలో జరగకూడనిది జరుగుతున్నది. నా జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి నాపై కూడా దాడి జరుగుతన్నది. బాలీవుడ్‌లో నా తరహా నేను సినిమాలు చేస్తుంటాను. టెలివిజన్ షోలు హోస్ట్ చేస్తుంటాను. నాకు ఇష్టమైన బట్టలు ధరిస్తాను. కానీ నా గురించి ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ చేశారు.

  షణ్ముఖప్రియ భారత్‌ కి బేటీ

  షణ్ముఖప్రియ భారత్‌ కి బేటీ

  సోషల్ మీడియాలో గత సంవత్సరం ఇంకా దారుణంగా ఈ ట్రోలింగ్ పెరిగిపోయింది. పొద్దున లేస్తే చాలూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. గత సంవత్సరమంతా సోషల్ మీడియాలో నేను సబ్జెక్ట్‌గా మారాను. నా ఇంట్లో నా తల్లి తీవ్రమైన మనోవేదనకు గురయ్యేది. మీ ఇంట్లో మీ తల్లి అలా ఆందోళనకు గురికావొద్దు అంటూ షణ్ముఖ ప్రియ తల్లితో మాట్లాడుతూ... నీ ఇంట్లో భారత్ కీ బేటి (భారత దేశానికి ఓ బిడ్డ) ఉంది. ఆమె రియల్ రాక్‌స్టార్ అంటూ ప్రశంసించారు.

  Indian Idol 12 Grand Finale: Special Focus On Shanmukha Priya | Oneindia Telugu
  ఉత్కంఠగా ఎలిమినేషన్ ప్రక్రియ

  ఉత్కంఠగా ఎలిమినేషన్ ప్రక్రియ

  ఇక చివర్లో ఇండియన్ ఐడల్ 12 ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, మహ్మద్ డానిష్, సయేలి కాంబ్లే, నిహాల్ టారో ఒకరు ఎలిమినేట్ కావాలి. వరుసగా పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, మహ్మద్ డానిష్, సయేలి కాంబ్లే ఫైనల్‌కు చేరుకొన్నారు. నిహాల్ టారో, షణ్ముఖ ప్రియలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ న్యాయనిర్ణేతలు ఇద్దరిని సేఫ్ చేస్తూ మొత్తం ఆరుగురిని ఫైనల్‌లోకి పంపారు. దాంతో తొలిసారి ఆరుగురు కంటెస్టెంట్లతో ఫైనల్ జరుగబోతున్నది.

  English summary
  Indian Idol 12 Finale is set ready fire on August 15th. Chief guest for semi final, Karan Johar praises the Shanmukhapriya and condemns tolling on her in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X